కర్నాటక: ‘హసన్’ లో జేడీఎస్ రిపబ్లిక్ కు చెక్..?
x

కర్నాటక: ‘హసన్’ లో జేడీఎస్ రిపబ్లిక్ కు చెక్..?

పాత మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ కు మంచి పట్టుంది. అయితే తాజాగా వెలుగుచూస్తున్న సెక్స్ స్కాండల్స్ ఆ పార్టీని బాగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా దేవేగౌడ..


కర్నాటకలో కొన్ని రోజులుగా సెక్స్ స్కాండల్ అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. అయితే ఇవన్నీ ఒక్క కుటుంబంలోనే ఉండటం గమనార్హం. ఆ కుటుంబం ఏంటో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది అదే మాజీ ప్రధాని దేవేగౌడ ఫ్యామిలి. కర్నాటకలోని హసన్ జిల్లా అంటేనే దేవేగౌడ కుటుంబానికి పెట్టని కోట.

అదో గౌడ గణతంత్ర్య రాజ్యమని పేరుంది. అయితే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అక్కడి రాజకీయ దృశ్యాన్ని పూర్తి మార్చివేస్తున్నాయి. దేవేగౌడ పెద్ద కొడుకు కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు. దీంతో రాజకీయ ప్రత్యర్థులు ఇక్కడ తమ పట్టు బిగించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రజ్వల్ రేవణ్ణలపై వచ్చిన లైంగిక ఆరోపణలు జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. అతని రాజకీయ కుటుంబంలోని నలుగురు వారసులలో వీరు ఒకరు. మిగిలిన ముగ్గురిలో హెచ్‌డి కుమారస్వామి, అల్లుడు డాక్టర్ సిఎన్ మంజునాథ్, అతని సోదరుడు సిఎన్ బాలకృష్ణ, అతని నాల్గవ కుమారుడు డాక్టర్ హెచ్‌డి రమేష్. వీరంతా రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉన్నారు. ఉన్నతమైన స్థానాల్లో రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు.
దేవెగౌడది రాజకీయ కుటుంబం
పాత మైసూర్ జిల్లాలోని హసన్, మాండ్య, రామనగర, మైసూర్ ప్రాంతంలో అంతటా ప్రధానంగా ఒక్కలిగల ఆధిపత్యం ఉంటుంది. ఇదే సామాజిక వర్గమైన దేవేగౌడకు ఈ ప్రాంతంలో మంచి పట్టుంది. అయితే తాజా ఆరోపణలతో ఇక్కడ పార్టీ ప్రభావం క్రమక్రమంగా తగ్గిపోతోంది. హసన్ లో ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణ ఓడిపోయాడు. ఆయన అరెస్ట్ అయి జైలు లో ఉన్నాడు. రామనగర నియోజకవర్గం కుమారస్వామి తన కోటగా మార్చుకుని రాజకీయ భవిష్యత్ ను నిర్మించుకున్నాడు.
శ్రావణ బెళగొళ (హాసన్)లో బాలకృష్ణ ప్రభావం చూపుతుండగా, దేవెగౌడ పెద్ద కుమార్తె అనసూయ భర్త మంజునాథ్ ఇటీవల బెంగళూరు రూరల్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. రమేష్ భార్య డాక్టర్ సౌమ్య రమేష్ కూడా రాజకీయ ఆకాంక్ష ఉంది. ఆమె తండ్రి డిసి తమ్మన్న మద్దూరు ఎమ్మెల్యేగా ఉన్నారు.
సెక్స్ స్కాండల్
రేవణ్ణలు హాసన్‌ను తమ రాజ్యంగా పరిపాలించారు. హెచ్‌డీ రేవణ్ణ హోలెనరసిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండగా, కుమారుడు ప్రజ్వల్ హాసన్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఆయన సోదరుడు డాక్టర్ సూరజ్ రేవణ్ణ రాష్ట్ర అసెంబ్లీ ఎగువ సభలో ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఏది ఏమైనప్పటికీ, ఏప్రిల్ చివరిలో హాసన్‌లో బయటపడిన వీడియోలు పెద్ద కలకలం రేపాయి. దాంతో ప్రజ్వల్ ఉన్నఫలంగా జర్మనీ పారిపోయాడు. తరువాత ఇదే అంశంలో తండ్రి అరెస్ట్, తల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్, ఇప్పుడు తమ్ముడు అరెస్ట్. ఇలా కుటుంబంలోని అందరూ సెక్స్ స్కాండల్ అరెస్ట్ కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. తండ్రి హెచ్ డీ రేవణ్ణకు, తరువాత తల్లికి ఈ కేసులో బెయిల్ వచ్చింది.
తలదించుకునే మరో విషయం..
కుటుంబాన్ని వేధిస్తున్న సెక్స్ స్కాండల్ కాకుండా మరో విషయం తాజాగా బయటపడటంతో ఆ కుటుంబం పరువు మరింత దిగజారింది. సూరజ్ రేవణ్ణ పార్టీకి చెందిన కార్యకర్తపై అసహజ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు నమోదు, అరెస్ట్ కావడం చకాచకా జరిగిపోయాయి. ఈ సంఘటన తరువాత హాసన్‌లో కుటుంబంపై ఉన్న ఆశలన్నీ అంతం అవుతున్నాయి. ఇప్పటికే, ప్రజ్వల్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ కుటుంబానికి చెందిన పుట్టస్వామి గౌడకు చెందిన శ్రేయాస్ పటేల్ చేతిలో ఓటమి పాలయ్యారు.
1985 అసెంబ్లీ ఎన్నికల్లో దేవెగౌడ హోలెనరసీపూర్ నుంచి పుట్టస్వామిగౌడ్‌ను ఓడించినప్పటి నుంచి వీరికి రాజకీయంగా పోటీ ప్రారంభం అయింది. 1989లో తన ఓటమికి, 1999లో మళ్లీ పుట్టస్వామి ప్రతీకారం తీర్చుకున్నాడు. అతని మనవడు శ్రేయాస్ పటేల్ (33) ఇటీవలే హసన్ లోక్‌సభ స్థానాన్ని తన వయసులో ఉన్న ప్రజ్వల్ నుంచి కైవసం చేసుకున్నాడు. శ్రేయాస్ తల్లి, SG అనుపమ కూడా JD(S)కి వ్యతిరేకంగా బలమైన కాంగ్రెస్ నాయకురాలిగా ఎదిగారు.
హసన్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అయిన జెడి (ఎస్) నాయకుడు ఫెడరల్‌తో మాట్లాడుతూ ‘‘ వారి కుటుంబానికి ఆది నుంచి ఫ్యూడల్ మనస్తత్వం ఉంది. అనేక కుటుంబాలకు వేదన కలిగించారు. ఇప్పుడు వీరు అనుభవిస్తున్నారు’’ అన్నారు. భవానీ రేవణ్ణ అనేక సందర్భాల్లో ప్రజలను బెదిరించారని నాయకుడు వివరించారు.
కుటుంబ ప్రత్యర్థులకు అవకాశం
రేవణ్ణల కష్టాలు కుటుంబంలోని ప్రత్యర్థి అయిన హెచ్‌డి కుమారస్వామి వర్గానికి లాభించినట్లు అయింది. ఆయన తన ప్రభావాన్ని హసన్ జిల్లా వరకూ విస్తరించే అవకాశం ఏర్పడింది. కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి హాసన్ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నాడు.
ఇటీవల, జెడి (ఎస్) కార్యాలయంలో మాట్లాడుతూ, నిఖిల్, “హాసన్ [జెడి (ఎస్) ఓటమి] ఫలితం ఊహించనిది. జిల్లాలోని JD(S) నాయకులు, కార్యకర్తల మద్దతు ఉన్నప్పటికీ ఓడిపోవడం బాధ కలిగించింది. జిల్లాలోని ఇక జేడీఎస్ ను బలోపేతం చేస్తాం. వచ్చే జిల్లా, తాలూకా పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సమాయత్తం అవుతాం. హాసన్ జిల్లా నుంచి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. కార్యకర్తలందరితో భుజం భుజం కలిపి పని చేస్తాను'' అని అన్నారు. మాండ్య, రామనగరలో ఓడిపోయిన నిఖిల్ తన రెండో రాజకీయ ఇన్నింగ్స్‌ను హాసన్‌ నుంచి ప్రారంభించనున్నట్టు జేడీ(ఎస్‌)లో చర్చ జరుగుతోంది.
కుటుంబం సవాల్
కుటుంబంలో రేవణ్ణ, కుమారస్వామి వర్గాల మధ్య పోటాపోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. దేవెగౌడ కుటుంబంలో కూడా ఇవి రెండు అత్యంత శక్తివంతమైన వర్గాలు. కుమారస్వామి రెండుసార్లు కర్ణాటక సీఎంగా పని చేయగా, ఆయన సతీమణి అనితా కుమారస్వామి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే నిఖిల్ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు.
మరోవైపు హెచ్‌డీ రేవణ్ణ పలుమార్లు మంత్రిగా, భవానీ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఉన్నారు. ప్రజ్వల్ ఎంపీగా, సూరజ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. దేవెగౌడ సన్నిహితుడు, మాజీ JD(S) ఎమ్మెల్యే ప్రకారం, కుమారస్వామి లేదా అతని కుమారుడు నిఖిల్ జోక్యాన్ని రేవణ్ణ ఎప్పుడు హసన్ లో పడనీయలేదు.
అయితే రేవణ్ణ కుటుంబం ఇప్పుడు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీనిని కుమారస్వామి కుటుంబం ఎంతవరకూ పూడ్చగలదో చూడాలి. సాధారణంగా దేవెగౌడ కుటుంబం ఇప్పుడు జిల్లాలో విపరీతమైన సవాలును ఎదుర్కొంటోంది, సెక్స్ కుంభకోణాలు వారికి మద్దతుగా నిలిచి స్థావరాన్ని దెబ్బతీసే ప్రమాదం పుష్కలంగా కనిపిస్తోంది. ఈ సంఘటన వారి రాజకీయ ప్రత్యర్థులకు ద్వారాలు తెరిచాయి. ప్రస్తుతం కొనసాగుతున్న చట్టపరమైన ప్రక్రియల ఫలితాలు హాసన్‌లో వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
Read More
Next Story