రేయింబవళ్లు మా పనులకు అనుమతి కావాలంటున్న కర్ణాటక లాబీలు.. ఏంటవీ?
ప్రస్తుతం సూర్యాస్తమయం కాగానే మా పనులు ఆపేస్తున్నారు. మా పనులు మీరు అనుమతించడం వల్ల అదనంగా రూ. 9 వేల కోట్ల ఆదాయం వస్తుందని..
కర్ణాటక ప్రభుత్వంపై మైనింగ్ లాబీయింగ్ తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. తమకు రాత్రి పగలు తేడా లేకుండా ఇనుప ఖనిజం మైనింగ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలను కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో సూర్యాస్తమయం కాగానే మైనింగ్ నిలిపివేయాలనే నిబంధనలు అమలవుతున్నాయి. ప్రభుత్వం కూడా దీనిపై అనుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తోందని పర్యావరణ వేత్తలు, అటవీశాఖ అధికారులు కలవర పడుతున్నారు.
మొదటి దశగా గనులు - భూగర్భ శాస్త్ర శాఖ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఒడిశా, జార్ఖండ్ మోడల్‌ను అనుసరించాలని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ కమిటీ నివేదికను అమలు చేయాలని మైనింగ్ లాబీ కోరుతోంది.
ప్రభుత్వానికి ఈ నిరంతర మైనింగ్ వల్ల దాదాపు 9 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం సిద్ధరామయ్య సర్కార్ డబ్బులకు కటకటలాడుతోంది. అనేక ఉచిత పథకాలను అమలు చేయడం వల్ల అదనపు ఆదాయం కోసం వెతుకులాడుతోంది. అయితే ఈ నిర్ణయం పై అటవీశాఖ ఉన్నతాధికారులు మాత్రం సంతృప్తిగా లేరు. దీనిని వారు ఓ విపత్తుగా పేర్కొన్నారు.
"పర్యావరణవేత్తల ఆందోళనలను పట్టించుకోకుండా సిద్ధరామయ్య సర్కార్ మైనింగ్ లాబీల నుంచి వచ్చే ఒత్తిడికి తలొగ్గింది’’ అని మాజీ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పరమేశ్వరప్ప చెప్పారు. పర్యావరణ నిర్వహణ విధాన పరిశోధనా సంస్థ అటవీ శాఖకు ఇచ్చిన నివేదికలో 24 గంటలు మైనింగ్ చేయడం వల్ల వృక్షజాలం, జంతుజాలం, సమాజంలోని జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది.
మాకు నిరంతర మైనింగ్ కావాలి...
ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మైనింగ్ ఇండస్ట్రీస్ (FIMI).. ఒడిశా, జార్ఖండ్‌ల నమూనాను ఉటంకిస్తూ 24X7 రాష్ట్రంలో మైనింగ్ జరగాలని కోరుకుంటోంది.
గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, కర్ణాటక అటవీ చట్టం, ఇతర మైనింగ్ చట్టాలు రోజంతా మూడు షిఫ్టులలో ఇనుప ఖనిజం తవ్వకాన్ని ఆపమని చెప్పడం లేదని FIMI సభ్యుడు చెప్పారు. అయితే 2016-18 మధ్య రాష్ట్రంలో దాదాపు 800 మైనింగ్ కంపెనీలకు అనుమతులు మంజూరయ్యయి కానీ, అవి మైనింగ్ చేయడం వల్ల కలిగే దుష్ప్ర ప్రభావాలను అంచనా చేయడానికి మదింపు కమిటీని వేయాల్సి ఉంటుందని సీనియర్ అటవీ అధికారి ఒకరు తెలిపారు. ఇవి తీవ్రమైన పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడటం లేదని రుజువు కావాలని అన్నారు.
అటవీ మంత్రి...
అటవీ ఉత్పత్తుల జాబితా నుంచి ఇనుప ఖనిజాన్ని మినహాయించాలని ప్రభుత్వం యోచిస్తున్న తీరుపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే కూడా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అధికారుల ప్రకారం, వివిధ రకాల ఇనుప ఖనిజం గనులలో 80 శాతం అటవీ శాఖ పరిధిలోకి వస్తాయి.
ఖండ్రే ప్రకారం.. “అటవీ ప్రాంతాల్లో 24x7 మైనింగ్ కార్యకలాపాలను అనుమతించే చర్య గురించి నాకు తెలియదు. ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదన లేదు. నేను ఉప ఎన్నికలతో బిజీగా ఉన్నందున, నాకు పూర్తి సమాచారం వచ్చిన తర్వాత నేను స్పందిస్తాను’’ అన్నారు.
మైనింగ్ - అటవీ శాఖలకు సంబంధించిన రెండు అంశాలను, అటవీ ఉత్పత్తుల జాబితా నుంచి ఇనుప ఖనిజాన్ని మినహాయించడంతో సహా, నవంబర్ 14న జరిగే క్యాబినెట్ సమావేశానికి ముందు జాబితా చేయాలని చీఫ్ సెక్రటరీ షాలినీ రజనీష్ ప్రతిపాదించినట్లు ది ఫెడరల్‌లోని దగ్గర ఉన్న కొన్ని పత్రాలు చూపిస్తున్నాయి.
సీఎంపై పర్యావరణ వేత్తల ఒత్తిడి..
ఆంక్షల సడలింపు కోసం మైనింగ్ కంపెనీల ఒత్తిడిని అటవీ శాఖ అడ్డుకుంది. అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు కర్ణాటక లోకాయుక్త సైతం పలు మార్గాలను సూచించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మైనింగ్‌పై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ సమాజ్ పరివర్తన సముదాయ (SPS) అటవీ ప్రాంతాల్లో 24 గంటలు మైనింగ్‌ను అనుమతించవద్దని సిద్ధరామయ్య, అటవీ శాఖ మంత్రి ఖండ్రేలను కోరింది. పర్యావరణ నిపుణులు నాగేష్ హెగ్డే, అఖిలేష్ చిప్పాలి. ఇతరులు కూడా ఇదే విధమైన ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదాయం తగ్గుముఖం పట్టింది..
రెవెన్యూ వసూళ్లు తగ్గుముఖం పట్టడంతో ఎక్సైజ్, మైనింగ్‌తో సహా ఆదాయాన్ని ఆర్జించే శాఖల నుంచి ప్రభుత్వం అధిక ఆదాయాన్ని సేకరించాల్సి వస్తోందని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం అటవీ శాఖ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 9 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఇప్పటి వరకూ వసూళ్లు మొత్తం టార్గెట్ లో 46 శాతం కూడా దాటలేదు. ఈ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం ఈ దుస్సహానికి పూనుకుంది. అయితే మైనింగ్ నిబంధనలు మార్చకుండా ఉండటానికి సీఎం సిద్ధరామయ్యను కొంతమంది అటవీశాఖ ఉన్నతాధికారులు కలిశారని సమాచారం. రెవెన్యూ పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనే తపనతో సిద్ధరామయ్య, కనీసం గత ఏడాది వసూళ్ల లక్ష్యమైన 56 శాతమైన సాధించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ప్రమాదంలో జీవవైవిధ్యం
జార్ఖండ్ - ఒడిశాలో పరిస్థితి కర్ణాటక కంటే పూర్తిగా భిన్నంగా ఉందని అటవీ అధికారులు వాదిస్తున్నారు. రాష్ట్రాల జీవవైవిధ్యం, జీవావరణ శాస్త్రం మారుతూ ఉంటాయి. జార్ఖండ్, ఒడిశా నమూనాలను గుడ్డిగా అనుసరించడం వివేకం కాదంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక అవసరాల నేపథ్యంలో రాత్రి మైనింగ్ నిబంధనలు తొలగించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ది ఫెడరల్ కు తెలిపాయి. అయితే, ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ నుంచి క్లియరెన్స్ పొందవలసి ఉంది. శాసనసభలో పాత చట్టాలకు సవరణ చేయాల్సి ఉంటుంది.
సీఎం మంచి నిర్ణయం తీసుకుంటారు..
ప్రభుత్వ చర్య సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురిచేసే అవకాశం ఉందని మరో సీనియర్ అధికారి హెచ్చరించారు. కర్నాటక ప్రభుత్వం పర్యావరణ ఆందోళనలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ, సమాజ్ పరివర్తన సముదాయ (SPS), లంచా ముక్త కర్ణాటక (అవినీతి రహిత కర్ణాటక)కి చెందిన రవికృష్ణారెడ్డిలు మాట్లాడుతూ... "ఈ అత్యంత ప్రమాదకరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచిస్తుందని మేము ఆశిస్తున్నాము."
Next Story