కర్ణాటక: చీఫ్ సెక్రటరీపై సీటి రవికుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
x
ఎమ్మెల్సీ సీటీ రవి కుమార్

కర్ణాటక: చీఫ్ సెక్రటరీపై సీటి రవికుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్.. గతంలోను ఓ అధికారిని పాకిస్తానీ అన్న కమల దళం నేత


ఈ మధ్య తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్ కు లక్ష్యంగా చేసుకుని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు విస్తృత నిరసనలు, ప్రజా ఆగ్రహానికి దారి తీశాయి.

ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ‘ ది ఫెడరల్’ కర్ణాటక చేతికి చిక్కింది. ఇందులో మహిళల గురించి ఆయన అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టంగా వినిపించింది.

సందర్భం ఏంటంటే..
బెంగళూర్ లోని కడుగోడి అటవీ భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను వ్యతిరేకిస్తూ రెండు రోజుల క్రితం విధాన సౌధలోని గాంధీ విగ్రహం దగ్గర బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ సమయంలో ఈ సంఘటన జరిగింది. తొలగింపు కోసం గుర్తించిన భూముల్లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన అనేక కుటుంబాలు ఉన్నాయని పేర్కొంటూ, తొలగింపును వెంటనే నిలిపివేయాలని ప్రతిపక్ష పార్టీ పట్టుబట్టింది.
ఈ నిరసన కార్యక్రమం తరువాత వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ సమయంలో ప్రధాన కార్యదర్శి అక్కడ లేరు. ఆ సమయంలోనే రవి కుమార్.. షాలినీ రజనీష్ గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఫిర్యాదు..
ఈ వ్యాఖ్యలు తరువాత బయటకు రావడంతో అధికార కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. శాసనమండలిలో బీజేపీ చీఫ్ విప్ కూడా అయిన రవి కుమార్ పై తగిన చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్ పర్సన్ ను డిమాండ్ చేసింది.
కర్ణాటక మహిళా శిశు అభివృద్ది మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్, ఎన్ రవికుమార్ కు తీవ్ర హెచ్చరిక చేశారు. మహిళలపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదా ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు.
బీజేపీ మౌనంగా ఎందుకు ఉంది..
రాష్ట్రంలో బీజేపీ నాయకులు మహిళలను అవమానించే సంస్కృతిని కొనసాగిస్తున్నారని గురువారం విడుదల చేసిన వీడియోలో ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం మహిళా ఐఏఎస్ అధికారిపై రవికుమార్ చెడుగా మాట్లాడాడని, ఇది అతని మనస్తత్వానికి నిదర్శనంగా అని విమర్శించారు.
ఆయన మాటలు మహిళలందరిని అవమానించినట్లు ఉన్నాయని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం అతని మాటలను సమర్థిస్తుందా అని వీడియోలో ప్రశ్నించారు.
గతంలో బెళగాని సమావేశంలోనూ ఇలాగే తన గురించి చెడుగా మాట్లాడాడని, కానీ బీజేపీ నాయకులు కనీసం నోరు తెరవకుండా అతనికి నైతిక మద్దతు అందించారని ఆరోపించారు.
ఇది బీజేపీ నాయకులు మహిళల పట్ల ఉన్న భావం తెలియజేస్తోందని విమర్శించారు. బీజేపీ నాయకులు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పటికీ అవమానకరమైన భాషను ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలన్నారు.
ప్రధాన కార్యదర్శిపై షాలిని రజనీష్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు రవికుమార్ ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్. మనోహార్ శాసన మండలి చైర్ పర్సన్ బసవరాజ్ హోరట్టికి ఫిర్యాదు చేశారు.
పాత వివాదం.. క్షమాపణలు..
ఎమ్మెల్సీ రవికుమార్ కు వివాదాలు ఏం కొత్త కాదు. మే 24న బీజేపీ నాయకులు నిర్వహించిన ‘‘చలో కలబురిగి’ ర్యాలీలో కలబురిగి డిప్యూటీ కమిషనర్ పాకిస్తానీలా కనిపిస్తున్నాడని అని వ్యాఖ్యలు చేశారు. దీనితో ఇది కూడా వివాదంగా మారింది. హైకోర్టు ఈ విషయంపై మందలింపు తరువాత రవికుమార్ క్షమాపణ చెప్పారు.
Read More
Next Story