కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై మంత్రి పరమేశ్వర ఏమన్నారు?
x

కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై మంత్రి పరమేశ్వర ఏమన్నారు?

మే 2023లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించలేదు.


కర్ణాటక(Karnataka)లో సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) పై రోజురోజుకు ఒత్తిడి పెరిగిపోతోంది. వీలయినంత త్వరలో మంత్రివర్గాన్ని (Cabinet reshuffle) పునర్వ్యవస్థీకరించాలని పలువురు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో హోం మంత్రి జి. పరమేశ్వర(Parameshwara) స్పందించారు. పునర్వ్యవస్థీకరణపై పార్టీ హైకమాండ్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలిసి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం మే 20 వ తేదీ నాటికి రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటుంది.

తుది నిర్ణయం వారిదే..

"నాకు దాని గురించి తెలియదు. మనకు 138 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఆశావహులు ఉండొచ్చు. వీరిలో కొంతమంది మాత్రమే మంత్రులు అవుతారు. ఆ విషయంలో హైకమాండ్, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు" అని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై విలేఖరుల అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు పరమేశ్వర.

మంత్రి పదవులు ఆశించే ఎమ్మెల్యేలలో ఒక వర్గం.. తమను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే డిమాండ్ కూడా ఉంది. కొందరు మంత్రులు కావాలనే కోరికను బహిరంగంగా వ్యక్తం చేశారు కూడా. మే 2023లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించలేదు.

కర్ణాటక సహకార సంఘాల (సవరణ) బిల్లు 2024, కర్ణాటక సౌహార్ద సహకారి (సవరణ) బిల్లు 2024ను గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇటీవల రాష్ట్రపతికి పంపడంపై అడిగిన ప్రశ్నకు.."రాబోయే రోజుల్లో చట్టం ఏమి చెబుతుందో చూద్దాం" అని పరమేశ్వర సమాధానమిచ్చారు. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి 3 మాసాల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించడంపై అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని మాత్రం చెప్పారు.

సెఫెస్ట్ ప్లేస్ బెంగళూరు ..

హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన సర్వేలో బెంగళూరును "సురక్షిత నగరం"గా పేర్కొంది. దీనిపై మంత్రి పరమేశ్వర మాట్లాడుతూ.. శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు చేయడానికి ముందు.. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాలతో పోల్చి చూడాలి. శాంతిభద్రతల పరిస్థితి బాగానే ఉందని చెబుతున్నా పట్టించుకోవడం" అని పేర్కొన్నారు.

ముఖ్యంగా మహిళల భద్రత కోసం కేంద్రం నిర్భయ నిధుల నుంచి దాదాపు రూ. 657 కోట్లను వినియోగించాం. ఈ విషయాలు సర్వేలో మీకు కనిపిస్తాయి’’ అని చెప్పారు.

Read More
Next Story