రోజుకో కుంభకోణం ఆరోపణలు.. ఈసారి గురి ‘ ఖర్గే’ పైనే..
కర్నాటకలో రాజకీయాలు మూడు కుంభకోణాలు.. ఆరు ఆరోపణలు అన్నట్లు సాగుతున్నాయి. ప్రభుత్వం చేసిన ప్రతిపనిలో కుంభకోణం ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే.. అన్ని నిబంధనలు
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజుకో కొత్త అవినీతి ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ముడా స్కాం.. వాల్మీకీ కార్పొరేషన్ స్కాం.. బ్యాంకు డిపాజిట్ల గోల్ మాల్ స్కాంతో బొప్పికట్టించుకున్న సిద్దరామయ్య సర్కార్ మెడకు మరో వివాదం చుట్టుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుటుంబంలోని సంస్థలకు నిబంధనలకు విరుద్దంగా భూమిని కేటాయించిందని, ఇదో పెద్ద స్కామ్ అంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది.
మల్లికార్జున్ ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు కొంత భూమి కేటాయింపులో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు కమలం పార్టీ డిమాండ్ చేసింది. ఖర్గే వెంటనే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కర్నాటకలో మంత్రి గా పని చేస్తున్న ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా రాజీనామా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో నైతిక బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.