కన్నడ సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్యకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు
x
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య

కన్నడ సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్యకు ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు

‘ముడా’ కుంభకోణం పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్, కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరిన ఆర్టీఐ కార్యకర్త


ముడా స్థలం కేటాయింపు కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు బుధవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన భార్య పార్వతి సహ ఇతర లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసింది.

మైసూర్ అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ(ముడా) సీఎం భార్య పార్వతికి కేటాయించిన 14 స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సిద్దరామయ్యపై ఆరోపణలు ఉన్నాయి.
ముడా కుంభకోణంపై లోకాయుక్త పోలీసులు జరిపిన దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించిన సింగిల్ జడ్జీ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వునూ కృష్ణ తాజాగా సవాల్ చేశారు.
సీఎంకు కోర్టు నోటీసులు..
ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి అంజరియా, న్యాయమూర్తి కేవీ అర్వింద్ లో కూడిన డివిజన్ బెంచ్ కేసును విచారిస్తూ.. ఏప్రిల్ 28 లోపు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.
‘‘ప్రతివాదులకు నోటీసును ఏప్రిల్ 28 లోపు అందజేయాలి. ఎందుకంటే విషయ వివాదానికి సంబంధించిన అప్పిళ్లను ఆ రోజున జాబితా చేయాలని నిర్ణయించాము’’ అని వ్యాఖ్యానించారు.
లోకాయుక్త విచారణలో..
లోకాయుక్త దర్యాప్తులో ఎటువంటి పక్షపాతం లేదా లోపం లేదని సింగిల్ బెంచ్ జడ్డి తేల్చడంతో ఈ ఏడాది ప్రారంభంలో దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
లోకాయుక్త స్వయంప్రతిపత్తిని హైకోర్టు, సుప్రీంకోర్టులు సైతం గుర్తించాయని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్ దారు సమర్పించిన ఆధారాలు కేసును సీబీఐకి కేసును బదిలీ చేసే విధంగా లేదని అన్నారు.
విధానపరమైన విషయం..
విచారణ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ కొనసాగించవచ్చా? అనే విధానపరమైన ప్రశ్నను డివిజన్ బెంచ్ లేవనెత్తింది.
అప్పీల్ దారుడి తరుపు సీనియర్ న్యాయవాదీ కేజీ రాఘవన్ ఈ అప్పీల్ న్యాయపరమైన ఉత్తర్వులను సవాల్ చేయలేదని, మాండమస్ రిట్ కోరిందని స్పష్టం చేశారు. ‘‘నేను కోర్టు ఉత్తర్వులను సవాల్ చేయడం లేదు’’ అని ఆయన ధర్మసనానికి తెలిపారు.
కేసు..
ప్రతివాదులను ప్రాసిక్యూట్ చేయడాన్ని గవర్నర్ అనుమతిని సమర్థిస్తూ సింగిల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వూలను సవాల్ చేస్తూ సంబంధిత అప్పీల్ ను ఏప్రిల్ 28న విచారించనున్నట్లు రాఘవన్ ధర్మాసనానికి తెలిపారు.
సెప్టెంబర్ 27, 2024న లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో సిద్ధరామయ్య ఆయన భార్య, బావమరిది బీఎం మల్లికార్జున్ స్వామి, దేవరాజు(ఈయన నుంచి భూమిని కొని పార్వతికి బహుమానంగా ఇచ్చారు) ఇతర పేర్లపై కేసులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను విచారించే ప్రత్యేక కోర్టు ఆదేశాన్ని అనుసరించి విచారణ ప్రారంభించారు.
దర్యాప్తు..
ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి, ఆయన భార్య మల్లికార్జున స్వామి, దేవరాజులపై వచ్చిన ఆరోపణలను సమర్థించే ఆధారాలు లేవని లోకాయుక్త పోలీసులు క్లోజర్ బి నివేదిను దాఖలు చేశారు. కానీ ముడా అధికారులు 50:50 నిష్పత్తిలో స్థలాల కేటాయింపులో ఖజానాకు నష్టం వాటిల్లిందని తెలిపారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేయడానికి కోర్టు అనుమతిని కోరారు.
వివాదాస్పద పథకం కింద నివాస ఫ్లాట్లను ఏర్పాటు కోసం వారి నుంచి సేకరించిన అభివృద్ది చేయని భూమికి బదులుగా ముడా అభివృద్ది చేసిన 50 శాతం భూమిని కేటాయించింది.


Read More
Next Story