
సోనియా గాంధీ
‘‘ధర్మస్థల మహిళల అదృశ్యం పై న్యాయం చేయండి’’
సోనియా గాంధీకి లేఖ రాసిన మహిళా హక్కుల కార్యకర్తలు
ధర్మస్థలలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హత్య జరిగాయని తప్పుడు కథనాలు వ్యాప్తి చేసి కొన్ని శక్తులు భంగపడిన సంగతి తెలిసిందే. కొంతమంది మహిళా కార్యకర్తలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు.
నట నాటక కార్యకర్త అరుంధతి నాగ్, చిత్ర నిర్మాతలు కవితా లంకేష్, సుమన్ కిట్టూర్, రచయిత జర్నలిస్ట్ విజయమ్మ, లింగ- లైంగిక హక్కుల కార్యకర్త అక్కై పదశ్మాలి వంటి మహిళల బృందం ఇందులో ఉన్నారు.
ధర్మస్థలలో అనేక అపరిషృత నేరాలు ఉన్నాయని, మహిళలు, బాధితులకు న్యాయం అందించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సోనియాగాంధీని కోరారు.
‘‘ధర్మస్థలలో మహిళలను ఎవరు చంపారు?’’ అనే పేరుతో మహిళా బృందం చేపట్టిన ఈ ప్రచారం.. బాధితులకు న్యాయం చేయడం, మహిళలపై హింసను కొనసాగించే లోతుగా పాతుకుపోయిన శక్తులను అణచివేయాలని కోరారు.
‘‘దురదృష్టవశాత్తూ దర్యాప్తు ప్రారంభమై కొన్ని వారాలు కూడా కాకముందే ఈ విషయం తీవ్రమైన తరుచుగా అశ్లీలమైన మీడియా కవరేజ్, రాజకీయ మైలేజ్ కి సంబంధించిన అంశంగా మారింది.
ఫలితంగా బెదిరింపు వ్యూహాలు న్యాయాన్ని మరోసారి సమాధి చేసే ప్రయత్నాలకు దారితీసింది’’ అని సెప్టెంబర్ 4 వ తేదీని దాదాపు 50 మంది మహిళా ప్రముఖులు సంతకం చేసి సోనియాగాంధీకి పంపారు. వారు లేఖను సెప్టెంబర్ 5న కొన్ని మీడియా సంస్థలకు విడుదల చేశారు.
మహిళలు, విద్యార్థులపై క్రమబద్దంగా హత్య, అత్యాచారం వివరించలేని మరణాలు మీడియాలో నివేదికలు వీటిని నిరంతరం సూచిస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
దక్షిణ కన్నడ లోని స్థానిక కార్యకర్తలు, జర్నలిస్టులు, రాష్ట్రవ్యాప్తంగా మహిళా హక్కుల సంస్థలు కూడా చాలా సంవత్సరాలు మరణాలు, అసహజ అదృశ్యాల గురించి ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా 2012 లో సౌజన్య కేసు, 1986 లో పద్మలత కేసు, 1979 లోవేదవల్లి వంటి కేసులను ఇందులో ఉదహరించారు.
మహిళల బృందం ప్రకారం.. జనవరి 2001, అక్టోబర్ 2012 మధ్య సమాచార హక్కు డేటా ప్రకారం.. 424 మరణాలు నమోదు అయ్యాయని చెప్పారు. వాటిలో ఉజిరే, ధర్మస్థల అనే రెండు పట్టణాలలో మాత్రమే చాలామంది బాలికలు, మహిళలు మరణించారు.
మహిళలు, పిల్లలపై జరుగుతున్న దారుణాలు, హింస లైంగిక నేరాలపై నివేదించడానికి మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప నేతృత్వంలోని నిపుణుల కమిటీ 2018 లో తన నివేదికను విడుదల చేసిందని లేఖలో పేర్కొన్నారు.
ఈ ప్రాంతాలలో జరుగుతున్న అసహజ మరణాలు, లైంగిక వేధింపుల కేసుల దర్యాప్తు పై సిట్ దృష్టి పెట్టాలని మహిళా కార్యకర్తలు గాంధీని కోరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వ నాయకులు సిట్ పనితీరు దెబ్బతీసే ప్రకటనలు రాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 13, 2024 నాటి కర్ణాటక హైకోర్టు తీర్పు ప్రకారం.. జవాబుదారీతనం ఉండేలా సౌజన్య కేసులో దర్యాప్తులో లోపాలకు కారణమైన తప్పు చేసిన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని వారు అన్నారు.
ముందు ధర్మస్థలలో నేత్రావది నది ఒడ్డున అనేక శవాలు ఉన్నాయని చిన్నయ్య ఫిర్యాదు చేసి ప్రజలను తప్పుదారి పట్టించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఈ కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని డిమాండ్ చేశాయి. ధర్మస్థలతో పాటు హిందూ దేవాలయాలపై దుష్ప్రచారం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు.
Next Story