తిరుప్పరంకుండ్రం కొండ పై కార్తీక దీపం వెలిగిస్తారా?
x

తిరుప్పరంకుండ్రం కొండ పై కార్తీక దీపం వెలిగిస్తారా?

ఆ కొండ ఎవరిదీ? పురావస్తు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?


ప్రస్తుతం హిందూ- ముస్లిం వివాదానికి కేంద్రంగా ఉన్న తిరప్పరం కుండ్రం కొండపై తమిళనాడు పురావస్తు శాఖ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ సి. సంతలింగ ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. “ఒక పురావస్తు శాస్త్రవేత్తగా నేను కచ్చితంగా చెప్పగలను. ఈ కొండ శైవులు, వైష్ణవులు, జైనులు, ముస్లింలు.. ఇలా అందరికీ చెందుతుంది. ఇది మదురైతో పాటు దేశానికి చెందిన ఉమ్మడి వారసత్వ సంపద” అన్నారు.

తమిళనాడు ఆరాధ్య దైవం మురుగన్ స్వామి ఆరు ప్రసిద్ధ క్షేత్రాల్లో మొదటదగా పూజలందుకునే తిరుప్పరంకుండ్రం కొండ, కార్తిగై(కార్తీక) దీపం వేడుకకు ముందు వివాదానికి కేంద్రంగా మారింది. కొండపై సికందర్ దర్గా సమీపంలో దీపం వెలిగించాలా? లేక సంప్రదాయంగా ఉచ్చి పిళ్లయార్ ఆలయం సమీపంలోనే వెలిగించాలా? అన్నది వివాదానికి కారణం. సికందర్ దర్గా సమీపంలో దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ చర్చ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ కొండకు సంబంధించిన చారిత్రక, పురావస్తు నేపథ్యం, బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన సర్వే స్తంభాలు, ఈ వివాదం మత సామరస్యంపై చూపుతున్న ప్రభావం వంటి అంశాలపై పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు.
తిరుప్పరంకుండ్రం కొండ చారిత్రకంగా, పురావస్తు పరంగా ఎందుకు అంత ప్రాధాన్యం ?
సుమారు 2,000 సంవత్సరాల క్రితం నాటి సంగం సాహిత్యంలో తిరుప్పరంకుండ్రం కొండ ప్రస్తావన ఉంది. అప్పట్లో దీనిని 'తెన్పరంకుండ్రం', 'తన్పరంకుండ్రం' అని పిలిచేవారు. మధురైకి దక్షిణంగా ఉండటం, అక్కడి చల్లని వాతావరణం కారణంగా ఆ పేర్లు వచ్చాయి.
సుమారు 2,500 సంవత్సరాల క్రితం ఈ కొండ ఎలా ఉండేదో అకనానూరు, మధురైక్కాంచి, నర్రినై, పరిపాడల్ వంటి ప్రాచీన సాహిత్య రచనల్లో వివరించారు.
సంగం సాహిత్యంలో ఈ కొండను మురుగన్ కుండ్రం అని పిలిచారు. కానీ అప్పట్లో ఇక్కడ ఎలాంటి కట్టడాలు లేవు. సామాన్య శకానికి ముందు లేదా రెండో శతాబ్ధంలో జైనులు దాని పశ్చిమ ప్రాంతంలో స్థిరపడ్డారు. అక్కడ గుహలు, రాతితో చెక్కిన మంచాలు అలాగే ఉన్నాయి. జైన సన్యాసులు అక్కడ 200 నుంచి 300 సంవత్సరాల పాటు నివసిరంచారు. అక్కడే వారు తమిళ బ్రాహ్మీ శాసనాలను చెక్కారు. ఈ ప్రదేశం ఒక జైన కేంద్రంగా వెలసిల్లింది. ఇవే తొలి లిఖిత చారిత్రక ఆధారం.
ఏడో లేదా ఎనిమిదో శతాబ్ధాలలో తమిళ దేవరం సాదువులైన తిరుజ్ఞానసంబందర, తిరునావుక్కరసర్, సుందర్ ఈ ఆలయాన్ని దర్శించి మురుగన్ కాకుండా శివుడిలా స్తుతిస్తూ స్తోత్రాలు రచించారు. సామాన్య శకం 773 నాటి గ్రంథ లిపిలో ఒక సంస్కృత శాసనం, రాతితో చెక్కిన గుహాలయం పునర్మిణానం లేదా పునరుద్దరణను శివుని మరొక పేరు అయిన శంభుకు దానిని అంకితం చేసినట్లు నమోదు చేసింది. ఆ స్తోత్రాలు, శాసనం రెండు శివుడిని అధిష్టాన దైవంగా చెబుతున్నాయి.
ఈ గుహాలయంలో ఒకదానికొకటి ఎదురుగా రెండు ప్రధాన గర్భలయాలు ఉన్నాయి. శివుని గర్భాలయం తూర్పు వైపు, విష్ణువు గర్భాలయం పడమర వైపు ఉన్నాయి. శివలింగాన్ని సహజ శిల నుంచి చెక్కారు. దాని వెనక గోడపై సోమ స్కంద శిల్పం ఉంది. ఎనిమిదో శతాబ్ధంలో అక్కడ శివుడు, విష్ణువు, వినాయకుడు, దుర్గ, మురుగన్ అనే ఐదుగురు దేవతలను ప్రతిష్టించారు. వీరిలో చివరి ముగ్గురు మండపంలోని గూటిలో ఉండగా, మురుగన్ అధిష్టాన దేవతగా కాకుండా ఒక అధి దేవుడిగా ఉన్నారు.
శతాబ్ధాలుగా వచ్చిన పాలకులు అనేక మార్పులు, చేర్పులు పునరుద్దరణలు చేశారు. తరువాత పాండ్యులు శివుడు, దేవత కోసం ఆలయాలను నిర్మించారు. అయితే శాసనాలు ప్రధాన దైవాన్ని తిరప్పరంకుండ్రం ఉదైయ నాయనార్ అని పేర్కొన్నాయి.
నక్కీరర్ కు ఆపాదించబడిన తిరుమురుగత్రుప్పడై వంటి రచనలలో అరుపడై వీడు, మురుగన్ ఆరు పవిత్ర నివాసాల భావన కల్పించింది. తిరుప్పరంకుండ్రం మొదటి పడై వీడుగా గుర్తింపు పొందింది. ఇక్కడ భక్తులు రక్తం కలిపిన బియ్యం, ధాన్యాలను నైవేద్యంగా సమర్పించి మురుగన్ ను పూజించారు. పదో శతాబ్ధం నుంచి జైనులు కూడా పార్శ్వనాథుడు, మహావీరుడితో సహ తీర్థంకరుల శిల్పాలను చెక్కడం ప్రారంభించారు. వాటితో పాటు వట్టేళుత్తు శాసనాలను కూడా జతచేశారు.
కొండపై ఉన్న సికిందర్ దర్గా మాత్రం 13 లేదా 14 శతాబ్ధానికి చెందినది. సంప్రదాయం దీనిని సికిందర్ ఫకీర్ అనే ఇస్లామిక్ సన్యాసితో ముడిపెట్టినప్పటికీ కొంతమంది చరిత్రకారులు మాత్రం దీనిని 1370 లో పాలించిన మదురై చివరి సుల్తాన్ అయిన సికందర్ షా కోసం నిర్మించిన పుణ్యక్షేత్రంగా చెబుతున్నారు.
దీని ప్రకారం ఈ దర్గాకు 600 సంవత్సరాల చరిత్ర ఉంది. కొండకు దక్షిణం వైపున ఉన్న భాగంలో జైన గుహాలయం ఉంది. దీన్ని సామాన్య శకం 1221 లో సుందర పాండ్య ఈశ్వరం అనే శివాలయంగా మార్చారు. ఆ తరువాత విజయనగర పాలకులు ప్రస్తుత గోపురాలను నిర్మించారు.
17 వ శతాబ్ధంలో తిరుమలై నాయక్ మండపాలను జత చేశారు. జైన, శైవ, వైష్ణవ, పంచాయతన, ఇస్లామిక్ సంప్రదాయాలను కలుపుకుని 1300 సంవత్సరాల వాస్తు నిర్మాణ పరిణామంతో ఈ కొండ మదురై, భారత్ దేశ ఉమ్మడి వారసత్వ సంపదగా నిలుస్తుంది.
సంప్రదాయకంగా కార్తీక దీపాన్ని ఎక్కడ వెలిగించేవారు? కొన్ని సంస్థలు చేస్తున్న వాదనల గురించి చారిత్రక ఆధారాలు ఏమి చెబుతున్నాయి?
దీనికి అనేక ఆధారాలు ఉన్నాయి. సుమారు 300 సంవత్సరాల క్రితం గుహాలయంలోని శివాలయం పైన ఒక శాసనం చెక్కబడిన రాతి స్తంభాన్ని నిర్మించారు. భక్తులు ఉత్సవ దీపాన్ని వెలిగించే ప్రదేశంలో ఈ స్తంభాన్ని నిర్మించారు. భక్తులు ఉత్సవ దీపాన్ని వెలిగించే ప్రదేశంలో ఈ స్తంభాన్ని స్థాపించారని దాని శాసనంలో ఉంది. గత 200 సంవత్సరాలుగా మదురై లో నేను గడిపిన 40 సంవత్సరాల కాలమంతా, ఆలయ అధికారులు శివాచార్య పురోహితులు, భక్తులు ఉచ్చి పిళ్లైయార్ ఆలయం సమీపంలోని ఈ స్తంభంపై కార్తీక దీపాన్ని నిరంతరం వెలగిస్తూ వస్తున్నారు.
దర్గా దగ్గర కొండపై దీపం వెలిగించడంపై వివాదం ఎప్పుడు తలెత్తింది? అక్కడ ఉన్న స్తంభాలు ఏమిటీ?
ప్రస్తుత దర్గాకు ఎదురుగా కొండపై రెండు గ్రానైట్ స్తంభాలు ఉన్నాయి. బ్రిటిష్ రికార్డుల ప్రకారం అవి భూమిని సర్వే చేయడానికి ఏర్పాటు చేసిన త్రికోణమితి సర్వే స్తంభాలు. వాటిలో పై భాగంలో ఒక వృత్తాకార సర్వే గుర్తు, మధ్యలో ఒక చుక్క ఉంటాయి.
ఆ చుక్కలో చాలా తక్కువ నూనె మాత్రమే పట్టగలదు. వాటిని ఆలయ దీపాలు లేదా కార్తీక దీపం వెలిగించడం కోసం ఎన్నడూ ఉద్దేశించలేదు. అరిట్టపట్టి జైన కొండ, పోయ్ గైమలై(కోయిల్ కుడి) జైన కొండతో సహ మదురై చుట్టుపక్కల ఉన్న అనేక కొండలపై ఇలాంటి సర్వే స్తంభాలు ఉన్నాయి.
బ్రిటిష్ రికార్డులు వాటి ఉద్దేశ్యాన్ని స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. స్మారక చిహ్నాల నియమాలు, చారిత్రక రికార్డులు, మదురై మత సామరస్యాన్ని విస్మరించి, రాజకీయ పార్టీలు కొన్ని న్యాయపరమైన పరిశీలనల ద్వారా ప్రొత్సహించబడుతున్న ప్రస్తుత వాదన నిరాధారమైనది.
కొంతమంది రాజకీయ నాయకులు తిరుప్పరన్ కుండ్రం ను ‘‘దక్షిణ అయోధ్య’’ అని పిలవడంపై మీ అభిప్రాయం ఏంటీ?
గత సంవత్సరం ఒక ప్రముఖ బీజేపీ నాయకుడు తిరుప్పరన్ కుండ్రంను అయోధ్యగా మారుస్తారని ప్రకటించారు. అయితే నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. నేను ఆ వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. తిరుప్పరన్ కుండ్రం ఎప్పటి నుంచో సామరస్యానికి నెలవు.
ఇక్కడ వివిధ వర్గాల ప్రజలు శాంతియుతంగా జీవించారు. ప్రస్తుత గందరగోళం కేవలం గత రెండు మూడు సంవత్సరాల క్రితం సృష్టించబడింది. మదురై దాని పరిసర ప్రాంతాల భక్తుల సహకారంతో ఆలయ నిర్వహణ ఎలా ఉంటుందో ఆచారాలు, వేడుకలు ఎల్లప్పుడూ శాంతియుతంగా ఎలా జరుగుతాయో స్థానిక నివాసితులకు తెలుసు.
అక్కడ మతసామరస్యం ఉంది.. ఈ సమస్యను రాజకీయం చేయడానికి పదేపదే జరుగుతున్న ప్రయత్నాలు.. కోర్టు ఆదేశాల మేరకు దర్గా సమీపంలోని కొండపై దీపం వెలిగించడం మత సామరస్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని మీరు అనుకుంటున్నారు?
ఇది కచ్చితంగా మత సామరస్యాన్ని దెబ్బతీసింది. సాధారణంగా కోర్టు తీర్పులను సామాన్య పౌరులు ప్రశ్నించరు. కానీ సుప్రీంకోర్టు అనేక తీర్పులు రాజకీయ నాయకుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. ఉదాహరణకు అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించే శబరిమల తీర్పు అమలు కాలేదు. ఆచరణలో అమలు చేయలేని ఉత్తర్వులను కోర్టులు జారీ చేయకూడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుకు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఉత్తర్వుకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. రాజకీయ నాయకులు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తారు. తమకు అనుకూలమైన తీర్పులను అంగీకరించి అనుకూలంగా లేని వాటిని వ్యతిరేకిస్తారు. శబరిమల తీర్పు మాదిరిగానే ప్రస్తుత ఉత్తర్వూ కూడా క్షేత్ర స్థాయి వాస్తవాలకు మత సామరస్యానికి విరుద్దంగా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధమైన వైఖరిని తీసుకుని సుప్రీంకోర్టు ఉత్తర్వును అమలు చేయకపోవడం ద్వారా ధిక్కారానికి గురికావాలని మీరు భావిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ తో సుప్రీంకోర్టు ఆశ్రయించవచ్చు. కానీ దాని ఫలితం ఎలా ఉంటుందో నేను అంచనా వేయలేను. అది ధైర్యం ప్రదర్శించి, పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే, మత సామరస్యానికి భంగం కలిగించే తీర్పును అమలు చేయడాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.

Read More
Next Story