కర్ణాటకలో వర్గీకరణ రాజకీయాలు మళ్లీ తెర పైకి వస్తున్నాయా?
x
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో నాగమోహన్ దాస్ కమిటీ సభ్యులు

కర్ణాటకలో వర్గీకరణ రాజకీయాలు మళ్లీ తెర పైకి వస్తున్నాయా?

జనాభా పెరుగుతున్న నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్ కోరుతున్న కొన్ని కులాలు..


ఎం చంద్రప్ప

కర్ణాటకలో షెడ్యూల్ కులాలలో అంతర్గత రిజర్వేషన్ల సమస్య అనేక దశాబ్దాలుగా నలుగుతూ ఉంది. దాదాపు మూడు దశాబ్ధాలుగా ఈ పోరాటం జరుగుతున్నా ఇది తార్కిక ముగింపుకు చేరుకోలేదు.

దళిత వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్- జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం జస్టిస్ ఎజీ సదాశివ నేతృత్వంలో ఒక కమిషన్ ను ఏర్పాటు చేసింది.

2012 లో కమిషన్ తన తుది నివేదికను అప్పటి ముఖ్యమంత్రి సదానంద గౌడకు సమర్పించింది. షెడ్యూల్డ్ కులాలల్లో ఉన్న ఉప సమూహాలకు కోటా కేటాయింపును ఇది సిఫార్సు చేసింది.

అయితే తరువాత వచ్చిన ప్రభుత్వాలు వీటిని పట్టించుకోలేదు. కానీ తమ రాజకీయ సాధనంగా మాత్రంగా బాగా ఉపయోగించుకున్నాయి.

యెడగై వర్గాల సమాజాలు...
ఎస్సీ వర్గంలోని యెడగై కులాలు(ఎడమ చేతి వాటం కులాలు) అంతర్గత రిజర్వేషన్ల కోసం తీవ్రంగా పోరాడినప్పటికీ, కోటా కేటాయింపు వారికి ఇప్పటికీ ఎండమావిగానే ఉండిపోయింది.
బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ప్రతిపాదనను ఆమోదించి కేంద్రానికి పంపింది. కానీ రాజకీయ అడ్డంకులు, అధికార మార్పుల మధ్య ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు.
ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదల, సదాశివ కమిషన్ సిఫార్సులు, మధు స్వామి నేతృత్వంలోని క్యాబినేట్ సబ్ కమిటీ ఫలితాలు, ఎస్సీల ఉప వర్గీకరణకు సంబంధించి జస్టిస్ నాగమోహాన్ దాస్ కమిషన్ సూచనలను అర్థం చేసుకోవడం ముఖ్యం.
జనాభాకు అనుగుణంగా కోటాలు..
2011 జనాభా లెక్కల ప్రకారం కర్ణాటక లో ఉన్న మొత్తం ఎస్సీల జనాభా 96.66 లక్షలు. అయితే సదాశివ కమిషన్ ప్రకారం.. ఈ సంఖ్య కోటి దాటింది. వీరిలో 7.29 లక్షల మంది వ్యక్తులు తమ ఉపకులాన్ని ప్రకటించలేదు. ఇది వర్గీకరణకు సవాల్ గా మారింది.
కోటిపైగా ఉన్న ఈ జనాభాలో మాదిగ, ఆది ద్రావిడ, బాంబీ ఇతరులు వంటి ఎడమ చేతి ఉపకులాలు 33.25 లక్షలు ఉండగా, హోలేయ, ఆది కర్ణాటక, చలవాడీ వంటి రైట్ హ్యాండ్(ఎడగై) వర్గాలు 30.93 లక్షల ఉన్నారు.
వీరే కాకుండా ఆది ఆంధ్ర, ఆదియ, భండ, బేడ జంగమ, హోలే దాసరి వంటి ఇతర 42 ఇతర ఉపకులాలు 4.5 లక్షలు దాక ఉన్నాయి. బంజరా, భోవి, కొరాచ, కొరమ వంటి ఇతర సమూహాలు 22.84 లక్షలు ఉన్నాయి.
ఈ జనాభా పరిణామాలకు అనులోమానుపాతంలో కోటాలు కేటాయించాలనే డిమాండ్ పెరుగుతోంది. అయితే రిజర్వేషన్ నుంచి ఇప్పటికే ప్రయోజనం పొందుతున్న కులాలు ఈ ఉపకులాల వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటి సంఖ్య తక్కువగా ఉందంటూ పేర్కొంటూ, తీవ్ర జాప్యానికి కారణమవుతున్నాయి.
మారుతున్న జనాభా పరిణామం..
2021 కులగణన( ఇది ఇంకా బయటకురాలేదు) లీక్ అయిన సమాచారం ప్రకారం.. కర్ణాటక మొత్తం జనాభాలో ఎస్సీలు 19.5 శాతం దాకా ఉన్నారు. వీరి తరువాత ముస్లింలు 16 శాతం దాకా ఉన్నారు.
లింగాయత్, వొక్కలిగలు వరుసగా 14, 11 శాతంగా ఉన్నారు. ఓబీసీలలో కురుబలు 7 శాతం దాకా ఉన్నారు. మొత్తం ఓబీసీ జనాభా 20 శాతం ఉంది. ఎస్సీలలో లెప్ట్ హ్యాండ్ సమాజం మెజారిటీగా ఉన్నందున, రైట్ హ్యాండ్ సమూహాం అంతర్గత రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముప్పై సంవత్సరాలుగా దళిత సంఘాలు అంతర్గత రిజర్వేషన్లు కోసం ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త కమిషన్లు, సర్వేలు ఏర్పాటు చేస్తూ పోయారు.
అయినప్పటికీ ప్రతి నివేదికను ఏదో ఒక కారణంతో పక్కన పెడుతున్నారని కార్యకర్తలు చెబుతున్నారు. రిజర్వేషన్ పోరాట కమిటీ సభ్యుడు చంద్రు తారాహునాసే ప్రకారం.. ఈ నివేదికలు రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల సీజన్లలో మాత్రమే బయటకు తీస్తారని విమర్శించారు.
సదాశివ కమిషన్ సిఫార్సులు..
సదాశివ కమిషన్ ఎస్సీలలో అంతర్గత రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. లెప్ట్ హ్యాండ్ వాటం అంటరాని వర్గాలకు ఆరుశాతం, రైట్ హ్యాండ్ వాటం సమూహానికి ఐదుశాతం, ఎస్సీలలో తాకదగిన కులాలకు మూడు శాతం ఈ మూడు వర్గాలలో లేని ఉప కులాలకు ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సూచించింది.
2013, 2018 ఎన్నికల సమయంలో రాజకీయం గా ఈ సూత్రం ఆదరణ పొందింది. అయితే ఈ సిఫార్సులు అమలు చేయడానికి ప్రభుత్వాలకు ధైర్యం చాలలేదు. బదులుగా ఈ అంశం ప్రభుత్వాలను మార్చడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది.
నాగ మోహన్ దాస్ కమిషన్ సిఫార్సులు..
ఎస్సీ, ఎస్టీ కోటాలను పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం జస్టిస్ నాగమోహాన్ దాస్ నేతృత్వంలో కొత్త కమిషన్ ఏర్పాటు చేసింది. విస్తృత అధ్యయనం తరువాత ఎస్సీ రిజర్వేషన్ 15 శాతం నుంచి 17 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్ మూడు శాతం నుంచి ఏడు శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది.
2023 లో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సిఫార్సులను అమలు చేసింది. అదే సమయంలో సదాశివ కమిషన్ నివేదికను సమీక్షించడానికి అప్పటి న్యాయమంత్రి జేసీ మధుస్వామి నేతృత్వంలో ఒక క్యాబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
క్యాబినేట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు..
మధు స్వామి నేతృత్వంలోని ఉప సంఘం జనాభా డేటా ఆధారంగా ఈ క్రింది వాటిని సిఫార్సు చేసింది
1. మాదిగ, ఆది, ద్రావిడ, బాంబీ మొదలైన లెప్ట్ హ్యాండ్ వర్గాలకు 5.5 శాతం
2. హోలెయ, ఆది కర్ణాటక, చలవాడీ మొదలైన కుడిచేతి వర్గాలకు 5.5 శాతం
3. బంజారా, భోవి, కొరచా, కొరమ వంటి స్పర్శించదగిన కులాలకు 4 శాతం
4. సంచార, అర్థ- సంచార సమూహాలు, ఇతర సూక్ష్మ - ఎస్సీ వర్గాలకు ఒక్కొక్కరికి 1 శాతం
దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సదాశిక నివేదిక అమలుకు కేంద్రానికి సిఫార్సు చేయాలని నిర్ణయించింది.
సుప్రీంకోర్టు తీర్పు..
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్పీ వర్గీకరణకు అనుకూలంగా ఆగష్టు 1, 2024 న తీర్పును వెలువరించింది. ఇది నిజంగా చారిత్రాత్మకమైన తీర్పుగా సామాజిక మేధావులు విశ్లేషణ వినిపించారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీలకు ఉప వర్గీకరించే అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ముఖ్యంగా విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాతినిధ్యం లేని తగినంత ప్రాతినిధ్యం లేని వారికి జనాభా నిష్పత్తిలో ఉప కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పేర్కొంది. అయితే కర్ణాటకలో ఎన్నికల తరువాత పాలన మారడంతో అంతర్గత రిజర్వేషన్ నివేదిక అమలును మరోసారి నిలిపివేశారు.
నాగమోహాన్ దాస్ కమిషన్..
అంతర్గత రిజర్వేషన్, డేటా లభ్యతలపై రైట్, లెప్ట్ హ్యాండ్ వర్గాలు రెండు అంగీకరించడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నాగమోహన్ దాస్ కమిషన్ ను పున:నిర్మించింది.
రెండు నెలల అధ్యయనం తరువాత కమిషన్ ఇటీవల నాలుగు కీలక సిఫార్సులతో మధ్యంతర నివేదికను సమర్పించింది. దీని ప్రధాన ప్రతిపాదనలను కేబినేట్ ఆమోదించింది. ఎస్సీ ఉపకులాల శాస్త్రీయ వర్గీకరణ కోసం కొత్త సర్వే నిర్వహించడం డేటా సేకరణ రెండు నెలల్లో పూర్తి అవుతుంది.
డేటా ఆధారంగా అంతర్గత రిజర్వేషన్లను ప్రాధాన్యతా ప్రాతిపదికన కేటాయించాలని కమిషన్ గట్టిగా చెప్పింది. అయితే సిఫార్సులు ఎప్పుడు అమలు చేస్తారని అనే సందేహం దళిత ఉపకులాల్లో ఇప్పటికి ఉంది. ఇది వ్యవస్థ విశ్వసనీయత పై నీలినీడలు కమ్మేస్తోంది.


Read More
Next Story