
మట్టత్తూర్ విజయం సాధించిన అనంతరం బీజేపీ శ్రేణులు
మట్టత్తూర్ బీజేపీ విజయం వామపక్షాలు, కాంగ్రెస్ కు హెచ్చరికేనా?
చాలా వార్డులో మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్
కేరళలో బీజేపీ మెల్లమెల్లగా తన ప్రభావాన్ని పెంచుకుంటూ వస్తోంది. డిసెంబర్ లో జరిగిన స్థానిక పరిపాలన ఫలితాలలో త్రిస్సూర్ లోని మట్టత్తూర్ పంచాయతీలో బీజేపీ విజయం సాధించడంతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది.
ఇందులో ఎన్నో రాజకీయాలు ఉన్నాయి. కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యులు రాజీనామా చేసిన ఎలాంటి గందరగోళం లేదు. కానీ ఈ చర్య వలన బీజేపీ పంచాయతీని చేజిక్కించుకుంది.
కానీ అంతకుముందే పోలింగ్ బూత్ లో ఇది ప్రారంభమైంది. వార్డు స్థాయిలో ఓటింగ్ లోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీ నిష్క్రియాత్వం, బీజేపీ నిర్మాణాత్మక ఏకీకరణ వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ కూడా ఎల్డీఎఫ్ కంటే, యూడీఎఫ్ కే ఎక్కువ నష్టం కలిగించింది.
మట్టత్తూర్ ఫలితాలు కాంగ్రెస్ కు శాపమే..
ఇటీవల స్థానిక ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే మట్టత్తూర్ లోని 24 వార్డులలో స్థిరమైన ఓటింగ్ ధోరణి కనిపించింది. ఎల్డీఎఫ్ విజయం సాధించిన ప్రతిచోట యూడీఎఫ్ మూడో స్థానానికి పరిమితం అయింది.
దీనికి విరుద్దంగా యూడీఎఫ్ గెలిచిన ప్రతిచోట ఎల్డీఎఫ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు రాజకీయ పార్టీల వల్ల కచ్చితంగా బలపడింది బీజేపీ అని తెలుస్తోంది. ఇది చాలా స్థానాలలో రెండో స్థానంలో నిలిచింది.
అలాగే మట్టత్తూర్ లోని 24 వార్డులలో యూడీఎఫ్ 14 వార్డులలో మూడోస్థానంలో నిలిచింది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు. కాంగ్రెస్ షాక్ లాంటింది. ఇక ఏమాత్రం ఆ పార్టీ రాజకీయ ప్రత్యామ్నాయం కాదని సంకేతం. దీనికి స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. చాలా వార్డులలో కమలదళం ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.
బీజేపీ గెలిచిన చాలా వార్డులలో కాంగ్రెస్ ఓట్ల శాతం చాలా మేరకు క్షీణించింది. చాలాస్థానాలలో వంద ఓట్ల మార్కును కూడా చేరుకోలేకపోయింది.
నూలువల్లి వార్డులో బీజేపీ 768 ఓట్లు సాధించి విజయం సాధించింది. ఎల్డీఎఫ్ 629 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 44 ఓట్లు మాత్రమే లభించాయి.
ఇక్కడ అసలు కాంగ్రెస్ సోదిలో లేకుండా పోయింది. బీజేపీ అభ్యర్థి అతుల్ కృష్ణ సీటు గెలుచుకున్నారు. కోరెచల్ వార్డులో కూడా ఇదే తరహ పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడ 58 ఓట్లు మాత్రమే లభించాయి.
చెంబుచిర 63 ఓట్లు, నదిప్పర 64, మూలంకుడం 71 ఓట్లు పార్టీ బలాన్ని సంఖ్యాపరంగా స్పష్టంగా అంచనా వేసే విధంగా ఉన్నాయి. ఒక వార్డు తరువాత మరో వార్డులో కాంగ్రెస్ ఓట్ల వాటా వ్యూహాత్మక ఓటమిని కాదు, సంస్థాగత విచ్చిన్నతను తెలియజేస్తోంది.
వెల్లికులంగరలో తగ్గిన ఓట్ల శాతం..
వెల్లికులంగర వార్డు ఫలితం ఇక్కడ రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అక్కడ స్వతంత్య్ర అభ్యర్థి ఔసెఫ్ 453 ఓట్లతో విజయం సాధించారు.
బీజేపీ రెండో స్థానంలో, ఎల్డీఎఫ్ మూడో స్థానంలో ఉంది. ఇద్దరికి చెరో 300 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పీఆర్ సునీల్ కుమార్ కు 108 ఓట్లు వచ్చి నాలుగో స్థానంలో నిలిచారు.
ఈ ఫలితం ఓట్ల బదిలీని సూచిస్తుంది. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ నుంచి ఓట్లు ఔసెఫ్ కు వచ్చాయి. ఇది కాంగ్రెస్ వ్యతిరేక భావనను సూచిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ స్పష్టంగా పక్కన పెట్టినట్లు స్ఫష్టంగా కనిపిస్తోంది.
ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలను కూడా అర్థం చేసుకోవాలి. ఓటింగ్ ద్వారా ఫలితాలను ప్రభావితం చేయడంలో విఫలమైన కాంగ్రెస్, పంచాయతీ ఎన్నికలలో పరపతిని మాత్రం సొంతం చేసుకుంది.
ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుల రాజీనామా, బీజేపీతో వారి పొత్తు ఏదో కాకతీయంగా జరగలేదు. ఇది వారి బేరసారాల శక్తిని బయటపెట్టింది. ఎన్నికల ఫలితాల ద్వారా కాకుండా, ఫిరాయింపు ద్వారా బీజేపీ మట్టత్తూర్ పంచాయతీని స్వాధీనం చేసుకోగలిగింది.
అయితే ఫలితం ముందుగానే నిర్ణయించబడిందని ఓటింగ్ డేటా తెలియజేస్తోంది. కాంగ్రెస్ తన ప్రధాన స్థానాన్ని నిలుపుకోవడంలో విఫలమైంది. కాషాయ పార్టీ వామపక్షాలకు ప్రధానంగా సవాల్ విసిరే ప్రయత్నం చేసింది.
కేరళ అంతటా..
మట్టత్తూర్ లో జరిగిన సంఘటనలు కేరళ అంతటా కనిపిస్తున్న ఒక స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి. ఇక్కడ 2026 లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వామపక్షాలను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా కొన్నిసార్లు అప్రమేయంగా బీజేపీకి అప్పగించింది.
జిల్లాల అంతటా పంచాయతీ స్థాయి ఫలితాలు ఇలాంటి ధోరణులు కనిపిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ నేరుగా ఎల్డీఎఫ్ ను ఓడించడం ద్వారా కంటే ప్రధాన ప్రతిపక్ష శక్తిగా కాంగ్రెస్ ను ఓడించడం ద్వారా బలాన్ని పొందుతుంది.
ఆమోదం లేకుండా అభ్యర్థుల నిలిపారా?
ప్రచారంలో బీజేపీతో కుదిరిన రహస్య ఒప్పందాలు ప్రధాన ఓటర్లు దూరం జరగడానికి మరో కారణమా? మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బీజేపీని బలోపేతం చేసినప్పటికీ వామపక్షాలను బలహీనపరచడానికి కాంగ్రెస్ ఏదైనా వ్యూహం పన్నిందా? పూర్తి సమాచారం బయటకు రాలేదు.
ఎల్డీఎఫ్ కు ధైర్యం.. హెచ్చరిక..
అధికార పార్టీకి ఈ ఫలితాలు ఓ ధైర్యం, హెచ్చరిక రెండింటిని ఇస్తున్నాయి. మట్టత్తూర్ ఎన్నికలలో అది స్థిరంగా ఫలితాలు సాధిస్తున్నప్పటికీ పోటీకి బీజేపీ ఎదగడం స్థానిక లెక్కలను మారుస్తోంది.
బీజేపీకి మట్టత్తూర్ కేవలం స్వాధీనం చేసుకున్న పంచాయతీ కాదు. కాంగ్రెస్ పతనం మీద విస్తరిస్తున్న కమల వికాసానికి ప్రతీక. ఇవన్నీ లోతైన రాజకీయాలను తెలియజేస్తున్నాయి.
బ్యాలెట్లు స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తున్నాయి. బీజేపీ ఓట్లు పెరుగుతున్నాయి. కౌన్సిల్ చాంబర్ లో అధికారాన్ని కోల్పోకముందే కాంగ్రెస్ ను ఓటర్లు పక్కనపెట్టారు.
అన్ని పంచాయతీల్లోనూ ఇవే తరహ ఫలితాలు వస్తే మట్టత్తూర్ లాగా ప్రాధాన్యం దక్కకపోవచ్చు. త్రిస్సూర్ జిల్లాలోని పొరుగు పంచాయతీలలో ముఖ్యంగా త్రిస్సూర్ లోక్ సభ నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లను ఓడించాడు.
వల్లచిర, పారాలం పంచాయతీలలో యూడీఎఫ్, వామపక్షాల బలం కూడా క్షీణించింది. వల్లచిరలో ఆరుసీట్లను ఎన్డీఏ గెలుచుకుంది. ఎల్డీఎఫ్ రెండో స్థానం సాధించింది. కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది.
త్రిస్సూర్ లోని ఎల్డీఎఫ్ నాయకుల అభిప్రాయం ప్రకారం జిల్లాలోని నాలుగు పంచాయతీలలో మట్టత్తూర్, అవినిస్సేరీ, వల్లచిర మెజారిటీ తక్కువగా ఉన్న పంచాయతీలలో ఫలితాలను ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయత్నించింది.
ముఖ్యంగా కాంగ్రెస్ కు చెందిన యూడీఎఫ్ వార్డు సభ్యులను తమ మద్దతు తీసుకోవాలని ఒప్పించింది. ఈ ప్రయత్నం మట్టత్తూర్ లో మాత్రమే విజయం సాధించింది.
బీజేపీ అంటే నమ్మకం..
బీజేపీ వర్గాలు మాత్రం వేరే వర్షన్ ను వినిపిస్తున్నాయి. తక్షణ ఫలితం తమ ప్రధాన లక్ష్యం కాదని, పార్టీ ఫిరాయించిన సభ్యుల అనర్హత లేదా రాజీనామా కారణంగా ఉప ఎన్నికల అవసరమైతే పార్టీ మరింత బలంతో వస్తుందని వారు చెబుతున్నారు.
ఈ ధోరణి ఒక్క త్రిస్సూర్ కే పరిమితం కాలేదు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ తన ప్రచారాన్ని కేంద్రీకరించిన ప్రాంతాలలో కూడా ఇలాంటి నమూనా రాజకీయాలు కనిపించాయి. ఉదాహరణకు తిరువనంతపురంలో బీజేపీ గెలుచుకున్న కార్పొరేషన్ పార్టీ గెలుచుకున్న అనేక వార్డులలో కూడా కాంగ్రెస్ అసాధారణంగా బలహీనంగా కనిపించింది.
కొన్ని చోట్ల యూడీఎఫ్ బలం కూడా ఇలాగే ఉంది. కేరళలో వామపక్షాలు చెబుతున్న డేటా ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఫ్రంట్ రాష్ట్ర వ్యాప్తంగా 1917 సీట్లను గెలుచుకుంది.
వీటిలో 1445 సీట్లు గ్రామాలలో వచ్చాయి. 815 సీట్లలో ఎల్డీఎఫ్ జయకేతనం ఎగరవేసింది. అది బీజేపీకి ప్రధానంగా పోటీ ఇచ్చింది. బ్లాక్ పంచాయతీలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 54 సీట్లను గెలుచుకుంది.
వాటిలో 34 సీట్లలో ఎల్డీఎఫ్ రెండోస్థానం లో ఉంది. అంటే ఈ సీట్లలో 62.9 సీట్లతో ఎల్డీఎఫ్- బీజేపీ మధ్య నేరుగా పోటీ పడింది. మునిసిపాలిటీలో ఎన్డీఏ 324 సీట్లను గెలుచుకుంది. వీటిలో 148 స్థానాల్లో ఎల్డీఎఫ్ రెండో స్థానంలో గెలిచింది.
45.6 శాతం ఓట్లు సాధించింది. ఈ సీట్లలో కాంగ్రెస్ 33.3 శాతం స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. కార్పొరేషన్లలో ఇవే ఫలితాలు కనిపించాయి. అక్కడ ఎన్డీఏ 93 సీట్లు గెలుచుకుంది. వీటిలో 63 సీట్లతో వామపక్షాలు రెండో స్థానంలో ఉంది.
Next Story

