
పీకే శేఖర్ బాబు
తమిళనాడులో బీజేపీ ఆటలు ‘మురుగన్’ సాగనివ్వలేదు
తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు
మధురైలో జరుగుతున్న తిరుపరంకుండ్రం దీపాల వివాదంలో మురుగన్(కుమార స్వామి) కాషాయ పార్టీకి అనుకూలంగా లేడని, ఈ వివాదం తరువాత మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించేవి సఫలం కాలేదని రాష్ట్ర హిందూ మత ధార్మిక శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు విమర్శించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాలనలో ప్రజలకు మతపరంగా విభజించే ఇటువంటి ప్రయత్నాలు ఫలించవని చెప్పారు.
‘‘తిరుపరంకుండ్రం కార్తీకదీపం సమస్య ద్వారా బీజేపీ మురుగన్ పేరును ప్రస్తావిస్తూ మత విద్వేషాన్ని రెచ్చగొట్ట ప్రయత్నం చేశారు. కానీ వారికి భగవంతుని అనుమతిలేనట్లు కనిపిస్తోంది. అది విఫలమైంది’’ అని మంత్రి విలేకరులతో అన్నారు.
అతను గెలవనివ్వండి..
తమిళనాడులోని దేవాలయాలను హిందూ మత ధర్మదాయా శాఖ నుంచి విముక్తి చేసి హిందూ మత ధార్మిక వ్యక్తులకు అప్పగిస్తామని బీజేపీ రాష్ట్ర సమన్వయ కన్వీనర్ హెచ్ రాజా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘ముందు అతను పోటీ చేసి గెలవనివ్వండి’’ అని వ్యాఖ్యానించారు.
‘‘రాజా ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేసి తనకంటూ ఒక గుర్తింపును సృష్టించుకునే బదులు చెన్నైలోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన విలువను నిరూపించుకోవాలి’’ అని బాబు సవాల్ విసిరారు.
సామరస్యం పెంపొందించాలి..
తిరుపరంకుండ్రం పట్టణ నివాసితులు క్రిస్మస్ సీజన్ లో మత సామరస్యాన్ని పెంపొందించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దర్గా దగ్గర హిందువులు దీపం వెలిగించడంపై వివాదం చెలరేగుతున్నప్పటికీ మత సామరస్యం కూడా ఉంది. రెండు వారాల తరువాత స్థానిక చర్చిలు ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాయి.
సంప్రదాయం ప్రకారం మురుగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ మొదటి వారంలో తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపం మండపంలో వార్షిక ఉత్సవ కార్తిగై దీపం జరిగింది.
అయితే రైట్ విగ్ సంస్థల సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే కొండపై ఉన్న దర్గా సమీపంలో రాతి స్తంభంపై దీపం వెలిగించాలని ఆలయ నిర్వాహకులను కోరారు.
కొన్ని నెలలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో ఈ వివాదం రాష్ట్రంలోని అధికార ద్రవిడ మున్నేట్ర కజగం బీజేపీ, అన్నాడీఎంకే మధ్య రాజకీయ అంశంగా మారింది.
Next Story

