
శ్రీధర్ వెంబు
తీర్పు నచ్చకపోతే అప్పీల్ చేయాల్సిందే: శ్రీధర్ వెంబు
అభిశంసన ప్రక్రియను ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నలు
బాల వెట్రివేల్ నవనీత కృష్ణన్
తిరుపరంకుండ్రం తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై అభిశంసన ప్రవేశపెట్టాడాన్ని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ప్రశ్నించారు. తీర్పుతో ఎవరైనా ఏకీభవిస్తున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, న్యాయమూర్తిని తొలగించాలని డిమాండ్ చేయడం తప్పు అని పేర్కొన్నారు.
డిసెంబర్ 9న ‘ఇండి’ కూటమికి చెందిన 120 మందికి పైగా ఎంపీలు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ పై అభిశంసన నోటీస్ ను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు.
డిసెంబర్ 1న మధురైలోని తిరుపరంకుండ్రం కొండపై హిందూ భక్తులు సాంప్రదాయ కార్తీక దీపం వెలిగించుకునేందుకు ఆయన తీర్పు ఇచ్చారు. ఈ ఉత్తర్వులో జస్టిస్ స్వామినాథన్ ‘‘న్యాయవ్యవస్థ అతిక్రమణ’’, ‘‘దుష్ప్రవర్తనకు సమానమైన చర్యలు’’ చేశారని డీఎంకే నేతృత్వంలోని ఈ తీర్మానం ఆరోపించింది. ఈ ప్రదేశంలో ఒక దర్గా కూడా ఉంది.
న్యాయ స్వాతంత్య్రం..
‘ది ఫెడరల్’ సోదర సంస్థ అయిన ‘పుతియా తలైమురై’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘అతను లంచం తీసుకున్నాడా? అతని ప్రవర్తన అనుచితమా? అలాంటి కారణాల వల్ల మాత్రమే న్యాయమూర్తిని తొలగించవచ్చు’’ అన్నారు.
‘‘తిరుపరంకుండ్రం కేసులో తీర్పుతో ఎవరైనా ఏకీభవించినా, అంగీకరించకపోయినా, సరైన పరిష్కారం అప్పీల్ దాఖలు చేయడమే. అతను ఇచ్చిన తీర్పు ఆధారంగా మాత్రమే న్యాయమూర్తిని తొలగించడం తప్పు’’ అని వెంబు అన్నారు.
‘‘లంచం లేదా దుష్ప్రవర్తన వంటి ఆరోపణలు ఉంటే, తొలగింపు సమర్థనీయమే. కానీ తీర్పుతో నచ్చకపోతే అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారా? అప్పీల్ చేయడానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. దాని కోసం మీరు అతన్ని తొలగించకూడదు’’ అన్నారు.
‘‘తీర్పు ఆమోదయోగ్యం కాకపోతే, అప్పీళ్ల వ్యవస్థలో దానిని సవాలు చేయడానికి విధానాలు ఉన్నాయి. దీనిని రాజకీయ సమస్యగా మార్చకూడదు. నేను ఒక సాధారణ వ్యక్తిని. కాబట్టి నేను బహిరంగంగా మాట్లాడగలను.
కానీ బహిరంగంగా స్పందించలేని న్యాయమూర్తులను వ్యక్తిగతంగా దాడి చేయకూడదు. అప్పీల్ కు మూడు స్థాయిలు అందుబాటులో ఉన్నాయి. అతన్ని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోకూడదు’’ అన్నారు.
అరట్టై పై ..
వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా జోహోకు చెందిన అరట్టై మెసెజింగ్ యాప్ ఇటీవల దేశంలో భారీ ఆసక్తిని సంపాదించుకుంది. తరవాత దానిపై ఆదరణ తగ్గింది. దీని గురించి అడిగినప్పుడు వెంబు మాట్లాడారు.
‘‘ ఏ టెక్నాలజీ తక్షణ ఆమోదం లభించదు. మేము ప్రతి వారం అరట్టై యాప్ ను అప్ డేట్ చేస్తున్నాము. వినియోగదారుల అవసరాల ఆధారంగా దానిని మెరుగు పరుస్తున్నాము.
అరట్టైని ఒక ఉదాహారణగా చూడాలి. ఏదీ రాత్రికి రాత్రే విజయం సాధించదు. ఏదైన టెక్నాలజీని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది’’ అన్నారు.
కృత్రిమ మేధస్సు రంగంలో జోహో ప్రణాళికలను గురించి అడగగా..‘‘మేము ఏఐలో పెట్టుబడి పెడుతున్నాము. జియా ఏజెంట్ ద్వారా జోహో కొత్త ఏఐ ఆధారిత సామర్థ్యాలపై పని చేస్తోంది. సాప్ట్ వేర్ ను వ్రాయగల, ఉత్పత్తులను సృష్టించగల ఆటోమోటెడ్ సిస్టమ్ లను కూడా మేము అభివృద్ధి చేస్తున్నాము’’ అని అన్నారు.
స్మార్ట్ వర్క్ పని..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి యువకులు రోజుకు 10-12 గంటలు పనిచేయాలని చేసిన సూచనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై తన అభిప్రాయాలను పంచుకుంటూ.. ఎక్కువ గంటలు పనిచేయడం కంటే తెలివిగా పనిచేయడం చాలా ముఖ్యమని వెంబు అన్నారు.
‘‘తెలివితేటలు అత్యంత ముఖ్యమైన అంశం. మనం 8 గంటలు పనిచేసినా లేదా 12 గంటలు పనిచేసినా అది పట్టింపులేదు. మనం అందించే ఆలోచనలే ముఖ్యం. పరిష్కారాలను సాప్ట్ వేర్ ద్వారా అందించాలి.
12 గంటలు పనిచేసినా స్వయంచాలకంగా ఫలితాలు రావు. 8 గంటల పనిదినంలో కూడా మీరు అన్ని వేళలా పూర్తిగా ఉత్పాదకంగా ఉండలేరు’’ అని ఆయన అన్నారు.
తమిళనాడు విద్య..
విశాఖపట్టణంలో ఒక జీబీ డేటా సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు గూగూల్ ఇటీవల ప్రకటించింది. దీనితో తమిళనాడు ఈ ఒప్పందాన్ని ఎందుకు పొందలేకపోయిందనే ప్రశ్న తలెత్తింది.
దీనికి స్పందిస్తూ తమిళనాడు ఆరోగ్యకరమైన జీడీపీతో చాలా బాగా పనిచేస్తోందని వెంబు అన్నారు. రాష్ట్రంలో బలమైన విద్యా మౌలిక సదుపాయాలు, పెద్ద సంఖ్యలో ప్రపంచ ప్రతిభావంతులైన బృందం ఉంది.
డేటా సెంటర్లు అనేక ఉద్యోగాలను సృష్టించగలవు. వాటికి చాలా ఎక్కువ విద్యుత్ వినియోగం కూడా అవసరం అని ఆయన అన్నారు. తమిళనాడులోని అన్నా విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్, సాంకేతికతపై దృష్టి సారించిన ప్రభుత్వ రాష్ట్ర విశ్వవిద్యాలయం గురించి నాణ్యత ఆందోళనలు తలెత్తుతున్నాయి.
కొన్ని సంస్థలు స్వతంత్ర విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని సూచించాయి. అన్నా యూనివర్శిటీ అంశంపై వ్యాఖ్యానించడానికి వెంబు నిరాకరించారు. ‘‘కానీ బహుళ విశ్వవిద్యాలయాలు ఉండటం మంచిదే. ఇది పోటీని సృష్టిస్తుంది. విద్యారంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
Next Story

