ఇడ్లీ- చికెన్ దౌత్యం: మరోసారి ఐక్యంగా సిద్ధా, డీకేఎస్
x
డీకే శివకుమార్ ఇంటిలో అల్ఫాహారం తీసుకుంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

ఇడ్లీ- చికెన్ దౌత్యం: మరోసారి ఐక్యంగా సిద్ధా, డీకేఎస్

ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి అల్ఫాహారం చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్లారు. కొద్దిరోజుల క్రితం ఇద్దరు నాయకులు సీఎం కుర్చీ కోసం గ్రూపులుగా తమ బలప్రదర్శనకు దిగారు.

సిద్ధరామయ్య బెంగళూర్ లోని సదాశివనగర్ లోని డిప్యూటీ సీఎం నివాసానికి కారులో వెళ్లారు. అక్కడ శివకుమార్, ఆయన సోదరుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ డీకే సురేష్ ఆయనకు స్వాగతం పలికారు.

శివకుమార్ ఇంట్లో తయారు చేసిన అల్ఫాహారంలో దోశ, ఉప్మా, కంట్రీ చికెన్, ఇడ్లీ, కాఫీ ఉన్నాయి. మూడు రోజుల క్రితం శివకుమార్, సీఎం సిద్ధరామయ్య ఇంటికి వెళ్లి అల్ఫాహారం చేశారు.

ఇది కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఇది జరుగుతున్నందున రాజకీయ పరిశీలకులు నిశితంగా గమనిస్తున్నారు. తమ మధ్య గందరగోళం సృష్టించడానికి మీడియానే కారణమని డీకే ఆరోపించారు. తాను, ముఖ్యమంత్రి ఇద్దరూ ఒక బృందంగా కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.

కర్ణాటకకు ఎన్నికల సమయంలోతమ పార్టీ ఇచ్చిన వాగ్థానాలను నెరవేర్చడానికి తాము సమష్టిగా ప్రయత్నాలు చేస్తున్నామని, వాటిని చర్చించడానికి, పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధరామయ్యను అల్ఫాహారానికి ఆహ్వానించానని శివకుమార్ అన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ లో ఎటువంటి గ్రూపులు లేవని తామంతా కలిసి పనిచేస్తున్నామని అన్నారు. మీడియానే ఈ గందరగోళం సృష్టించడానికి కారణం అన్నారు.

ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రెండు రోజుల క్రితం తొలి అల్ఫాహార సమావేశం జరిగింది. ఆ తరువాత ఇద్దరు నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ఇక నుంచి పార్టీలో ఎలాంటి గందరగోళం జరగదు అని బహిరంగంగా ప్రకటించారు. నాయకత్వం విషయంలో ఇద్దరూ హైకమాండ్ మాట వింటామని తేల్చి చెప్పారు.
నాయకత్వ పోరు..
ఈ పరిణామం ఇద్దరి మధ్య నాయకత్వ పోరుకు విరామం ఇవ్వడానికి హైకమాండ్ తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. డిసెంబర్ 8 నుంచి బెళగావి శాసనసభ సమావేశాలకు ముందు, ప్రస్తుతానికి సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పార్టీ కేడర్ కు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు అయింది.
నవంబర్ 20న కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలంలో సగం మార్క్ ను చేరుకున్న తరువాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహగానాల మధ్య అధికార పార్టీలో అధికార పోరు తీవ్రమైంది. 2023 లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడూ కుదిరిన అధికార భాగస్వామ్య ఒప్పందం గురించిన చర్చలలో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి.


Read More
Next Story