
‘‘మనుషుల కంటే జంతువులే నయమనిపిస్తుంది’’
హంపీ సమీపంలోని సనాపూర్ ఘటనపై ఇంకా షాక్ లోనే స్థానిక ప్రజలు
కవితా షణ్ముగం
హంపి సమీపంలో సుందర గమ్యస్థానంగా పేరు పొంది, హోమ్ స్టేలకు ప్రసిద్ది చెందిన సనాపూర్ కొన్ని రోజుల క్రితం ఇద్దరు విదేశీ మహిళలపై అత్యాచారం, ఒక భారతీయ పర్యాటకుడి హత్యతో వణికిపోయింది. తుంగభద్ర ఆనకట్ట సమీపంలో జరిగిన ఈ నేరం ఈ ప్రాంతంలో భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది.
బాధితులు రాత్రి సమయంలో ఆకాశాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా వారిపై దాడి జరిగింది. ఈ దాడిలో ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరైన హోమ్ స్టే యజమాని తన భయానక అనుభవాన్ని వివరించాడు.
‘‘మేము ఎలుగుబంట్లు, చిరుతపులికి మాత్రమే ఇన్నాళ్లు భయపడాల్సి వచ్చేది. కానీ మనుషుల వల్ల మాకు హనీ జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. మనుషులు, జంతువుల కంటే దారుణంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
భయాందోళనలో పర్యాటకులు.. సిగ్గుపడుతున్న స్థానికులు..
అత్యాచారం, హత్య జరిగిన తరువాత ఇజ్రాయెల్ సహ ఇతర విదేశీ పర్యాటకులు భయంతో సనాపూర్ విడిచిపెట్టి వెళ్లిపోయారు. వారి బసలను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ గెస్ట్ హౌజ్ లను ఖాళీగా ఉన్నాయి.
ఇటీవల నెలల్లో రెండుసార్లు సనాపూర్ ను సందర్శించిన బెల్జియన్ పర్యాటకురాలు పౌలిన్ ఈ సంఘటనపై దిగ్భాంతి వ్యక్తంచేసింది. ‘‘ఇంత ప్రశాంతమైన ప్రదేశంలో ఇలాంటివి జరుగుతాయని మీరు ఊహించలేరు.
నా కుటుంబం ఆందోళన చెందుతోంది. నన్ను ఇంటికి తిరిగి రమ్మని పిలుస్తున్నారు’’ అని చెప్పారు.
స్థానికులు ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు పర్యాటక ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక పరిణామాలు ఉంటాయని చాలామంది భయపడుతున్నారు. ఈ సంఘటన కారణంగా భవిష్యత్ లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి నేరాలు మళ్లీ ఎప్పుడూ జరగకూడదని అని స్థానిక షాపు యజమాని ఒకరు అన్నారు.
మాదక ద్రవ్యాల పర్యాటకం..
సనాపూర్ సురక్షితమని అధికారులు చెబుతున్నప్పటికీ, కొంతమంది గ్రామస్తులు మాత్రం కొన్ని విషయాలు వెల్లడించారు. అధికారులు క్రమబద్దీకరించని హోమ్ స్టే లు, మాదక ద్రవ్యాల వినియోగం, భద్రత లేకపోవడం సనాపూర్ లో సమస్యలు పెంచుతున్నాయని అంగీకరించారు.
‘‘వెలుతురు సరిగా లేకపోవడం, భద్రత లేకపోవడం, చీకటి పడిన తరువాత పర్యాటక ప్రదేశాలు సురక్షితం కావు’’ అని స్థానిక పోలీస్ అధికారి ఒకరు అన్నారు.
అధికారులు చట్టవిరుద్దమైన కార్యకలాపాలను అరికట్టడానికి ప్రయత్నించారు. 2022 లో 10, 2023 లో 12 మాదక ద్రవ్యాలను సంబంధించి పోలీస్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా జరిగిన నేరం ఇక్కడ ఉన్న లోపాలను బహిర్గతం చేసింది.
పోలీసులు వేగంగా స్పందించినా..
ఈనేరానికి సంబంధించి పోలీసులు ముగ్గురు స్థానిక నిర్మాణ కార్మికులను అరెస్ట్ చేసినట్లు కొప్పల్ ఎస్పీ రామ్ అరసిద్ది ప్రకటించారు. ‘‘ఇది ఒక భయంకర సంఘటన. మేము వేగంగా చర్యలు తీసుకుంటున్నాము. ఆరు బృందాలను ఏర్పాటు చేశాం. నిందితులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నాం’’ అని ఆయన అన్నారు.
నిందితులు అరెస్ట్ అయినప్పటికీ భయం మాత్రం కొనసాగుతోంది. ఒకప్పుడు పర్యాటకులు ఇక్కడ వన్యప్రాణుల దాడుల పట్ల భయంగా ఉండేవారు. ఇప్పడు పరిస్థితి మారింది. మనుషులంటేనే స్థానికులు, పర్యాటకులు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు.
Next Story