కర్ణాటక వొక్కలిగ రాజకీయాలను ఎస్‌ఎం కృష్ణ, దేవెగౌడ ఎలా తీర్చిదిద్దారు?
దేవెగౌడ, కృష్ణల మధ్య రాజకీయ శత్రుత్వం వారి తరువాత తరంలోనూ కొనసాగింది. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి, కృష్ణ శ్రేయోభిలాషి శివకుమార్ రాజకీయ ప్రత్యర్థులుగా మారారు.
కర్ణాటకలోని వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన హెచ్‌డి దేవెగౌడ, ఎస్ఎమ్ కృష్ణ రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న నాయకులు. పాత మైసూరు ప్రాంతం వచ్చిన వీరిద్దరూ తరువాత కీలక పదవుల్లో కొనసాగారు.
‘స్మృతి వాహిని’లో దేవెగౌడ, కృష్ణ గురించి...
కృష్ణ ఆత్మకథ ‘స్మృతి వాహిని’ జనవరి 2020లో ప్రచురితమైంది. దేవెగౌడ, ఎస్ఎమ్ కృష్ణ మధ్య బంధం గురించి ఇందులో రాసుకొచ్చారు. ఎస్ఎమ్ కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (1999-2004) ఉద్యోగుల బదిలీలకు సంబంధించి దేవెగౌడ తనను తరచుగా సంప్రదించేవారని, అయితే వారి బంధం ఎప్పుడూ అంత బలంగా లేదని అందులో రాసి ఉంది. తమ మధ్య విభేదాలను పరిష్కరించుకోడానికి ప్రయత్నాలు చేసి ఉండాల్సిందని కృష్ణ అంగీకరించాడు.
1999లో దేవెగౌడ మంజూరు చేసిన కాంట్రాక్ట్‌పై సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన ఫైల్ ఒకటి తన వద్దకు వచ్చిన విషయాన్ని కృష్ణ పుస్తకంలో ప్రస్తావించారు. అయితే దర్యాప్తునకు కృష్ణ అప్పట్లో అంగీకరించలేదు. "వ్యక్తిగత ద్వేషానికి పోతే, ప్రజా జీవితంలో ఎవరూ శాంతంగా ఉండలేరు’’ అని కృష్ణ తన పుస్తకంలో పేర్కొన్నారు. కృష్ణ వ్యాఖ్యలు దేవెగౌడను డిఫెన్స్‌లో పడేశాయి. తన ప్రతిష్టను దిగజార్చేందుకు కృష్ణ చేస్తున్న ప్రయత్నాలను దేవేగౌడ కొట్టిపారేశారు.
1994లో ప్రత్యర్థి అభ్యర్థికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, బీజేపీ నుంచి రాజకీయ ఒత్తిడి ఉన్నా కృష్ణను రాజ్యసభకు ఎన్నుకోవడంలో తన పాత్రను దేవేగౌడ గుర్తు చేసుకున్నారు.
దేవెగౌడ, కృష్ణల మధ్య రాజకీయ శత్రుత్వం వారి తరువాత తరంలోనూ కొనసాగింది. దేవెగౌడ కుమారుడు హెచ్‌డి కుమారస్వామి, ఎస్ఎం కృష్ణ శ్రేయోభిలాషి డీకే శివకుమార్ రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. డీకే శివకుమార్ కూతురిని ఎస్ఎం కృష్ణ మనవడు పెళ్లిచేసుకోవడంతో డీకే
కృష్ణ కుటుంబంతో బంధం మరింత బలపడింది. జనతాదళ్(సెక్యులర్)లో వ్యూహాత్మక చతురత ఉన్న నాయకుడిగా పేరు గడించిన కుమారస్వామి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కుమారస్వామి రాజకీయ జీవితం తరచుగా దేవెగౌడ పొలిటికల్ కేరీర్‌ను ప్రతిబింబిస్తుంది.
ఇటు కాంగ్రెస్ కీలక నేతగా, కృష్ణకు నమ్మకమైన మిత్రుడిగా ఎదిగిన డీకే శివకుమార్ కర్ణాటక రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగారు. ఆ తర్వాత కుమారస్వామికి గట్టి ప్రత్యర్థిగా నిలిచారు. ఈ ఇద్దరికి తమ సామాజిక వర్గం ఓట్లే కీలకం.