
తమిళనాడు మాజీ సీఎంలు ఎం. కరుణానిధి, జే. జయలలిత.. ప్రముఖ నటులు రజనీకాంత్, విజయ్
తమిళ రాజకీయాల్లో సినీ రంగం ప్రాధాన్యం ఎలా పెరిగింది?
అన్నాదురై నుంచి దళపతి విజయ్ వరకూ అంతా తెరమీద కనిపించిన వారే
మహాలింగం పొన్నుస్వామి
తమిళనాడు రాజకీయాలకు, సినీ రంగాలకు విడదీయరాని సంబంధం ఉంది. ఇవి ఎంత లోతుగా పాతుకుపోయాయంటే తెరమీద కనిపించిన చిన్న స్థాయి నటులు సైతం ఎమ్మెల్యేలు, మంత్రులుగా రాజకీయాల్లో చక్రం తిప్పారు.
ప్రజలతో కనెక్ట్ కావడానికి, ప్రజా అనుకూల అభిప్రాయాలను రూపొందించడానికి సినిమాను ఒక మాధ్యమంగా వాడుకున్నారు. ద్రవిడ భావజాలంలో పాతుకుపోయిన సామాజిక న్యాయాన్ని సమర్థించడానికి సినిమా శక్తివంతమైన మాధ్యమంగా తమిళనాడులో పనిచేసింది.
అన్నాదురై నుంచి సూపర్ స్టార్ విజయ్ వరకూ అందరికీ సినీ రంగంతో విడదీయరాని అనుబంధం ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు విజయ్ ని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా పేర్కొంటూ తమిళ వెట్రి కజగం చేసిన ప్రకటన తాజా చర్చకు దారితీసింది.
ఈ చర్చలో కీలకపాత్రధారుల వారసత్వం వారి ఎన్నికల ప్రదర్శనలు, విజయాలు, కోలీవుడ్ ఖ్యాతిని రాజకీయ విజయంగా మార్చడంలో ఎదురైన సవాళ్ల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం.
మార్గదర్శకుడు సీఎన్ అన్నాదురై..
‘‘అరిగ్నార్ అన్నా’’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే కాంజీవరం నటరాజన్ అన్నాదురై ద్రవిడ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి సినిమాని ఉపయోగించుకున్నాడు.
ఆయన స్క్రీన్ ప్లే, నాటక రచయిత, మంచి వక్త. డీఎంకేలో కీలక వ్యక్తిగా ఎదిగి నల్లతంబి(1949), వేలైక్కరి(1949) వంటి సినిమాలకు స్క్రిప్ట్ లు రాశారు. సామాజిక న్యాయం, కుల వ్యతిరేకత, తమిళ ప్రైడ్ సందేశాలను ప్రచారం చేశారు.
ఆయన చూపించిన మేధో నైపుణ్యం, ప్రజలతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం అంతా సినిమా తెరపై కనిపించింది. ఇవి రాజకీయాలు, సినిమా రెండింటిలోనూ ఒక ఉన్నత వ్యక్తిగా నిలిపాయి. అన్నాదురై 1949 లో డీఎంకే ను స్థాపించారు. ఓటర్లను సమీకరించడానికి సినీ ప్రభావాన్ని ఉపయోగించుకున్నారు.
1967 లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పార్టీ 137 సీట్లను గెలుచుకుని కాంగ్రెస్ ను గద్దె దించింది. అన్నాదురై మొదటి సారి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా(1967-69) పీఠం ఎక్కారు.
అన్నాదురై సినిమాను రాజకీయ సాధనంగా ఉపయోగించుకోవడం భవిష్యత్ నాయకులకు ఒక మార్గంలా నిలిచింది. భూ సంస్కరణలు, కుల అణచివేత వంటి అంశాలను ఆయన రచనలు ప్రస్తావించాయి. ముఖ్యమంత్రిగా ఆయన స్వల్ప కాలం కొనసాగించినప్పటికీ ద్రావిడ పాలనకు బలమైన పునాది వేసింది. సామాజిక సంక్షేమం, తమిళ గుర్తింపుకు ప్రత్యేక స్థానం కల్పించింది.
ఎం. కరుణానిధి ఎక్స్ ప్రెస్..
‘‘కలైంజర్(కళాకారుడు)’’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ముత్తువేల్ కరుణానిధి, ఒక గొప్ప స్క్రీన్ రైటర్, నాటక రచయిత, రాజకీయ వ్యూహాకర్త. డీఎంకే ఎదుగుదలలో కీలకపాత్ర పోషించాడు. 1940 లలో సినిమాల్లోకి ప్రవేశించిన కరుణానిధి.. సామాజిక న్యాయం, నాస్తికత్వం, తమిళ జాతీయవాదంపై శక్తివంతమైన సంభాషణలతో ద్రవిడవాద ఆదర్శాలను మిళితం చేశారు.
రాజకుమారి(1947), పరాశక్తి(1952) వంటి చిత్రాలకు స్క్రిప్ట్ రాశారు. అన్నాదురై మరణం తరువాత ఆయనకు సన్నిహితుడిగా ఉన్న కరుణానిధి.. సీఎంగా పీఠమెక్కారు. ఆయన సాహిత్య, సినిమా రంగానికి సంబంధించిన రచనలు, రాజకీయ చతురతతో కలిసి ఐదు దశాబ్ధాలకు పైగా తమిళ రాజకీయాలకు కేంద్రంగా కొనసాగడానికి కారణమైంది.
కరుణానిధి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను అనేక సార్లు విజయవంతంగా నడిపించారు. 1971 లో 184 సీట్లు, 1989 లో 150 సీట్లు, 1996 లో 173 సీట్లు, 2006 96 సీట్లు సాధించి పార్టీని గెలిపించారు. ఆయన ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తమిళనాడులో ఇది ఓ రికార్డు.
అయితే పార్టీని ఘనంగా గెలిపించినప్పటికీ అనేకసార్లు దారుణ పరాజయాలను మూటగట్టుకున్నారు. 1977 లో 48 సీట్లు, 1984 లో 24 సీట్లు, 2001 లో 31 సీట్లకే పరిమితం అయ్యారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత ఆధ్వర్యంలో అన్నాడీఎంకే స్థాపించడం ఇందుకు ప్రధాన కారణం. ఆయన చివరిసారిగా 2006 లో విజయం సాధించారు. అన్నాడీఎంకేపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకుని గెలవగలిగారు.
కరుణానిధి సినిమా రంగంలో చేసిన కృషి డీఎంకే సైద్దాంతిక పరిధిని విస్తృతం చేసింది. పరాశక్తి వంటి సినిమాలు సాంస్కృతిక మైలురాళ్లుగా నిలిచాయి.
రైతులకు ఉచిత విద్యుత్, కలైంజర్ హౌసింగ్ స్కీమ్ వంటి సంక్షేమ పథకాల ద్వారా ఆయన రాజకీయ జీవితంలో మైలురాళ్లు. అయితే బంధుప్రీతీ, అవినీతి ఆరోపణలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి.
సాహిత్య ఆకర్షణ, రాజకీయ ఆచరణ రెండింటిని ఆయన సమతుల్యం చేశారు. కరుణానిధి ఎంజీఆర్, జయలలిత వంటి ప్రత్యర్థులను ఆయన ఎదుర్కొన్నప్పటికీ డీఎంకే శాశ్వత ఔచిత్యాన్ని నిలిపారు. 2018 లో ఆయన మరణం తరువాత కుమారుడు ఎంకే స్టాలిన్ పార్టీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించి 2021 లో ముఖ్యమంత్రి అయ్యారు.
ఎంజీఆర్..
తమిళనాడులో మొట్టమొదటి సూపర్ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన మరుదూర్ గోపాలన్ రామచంద్రన్(ఎంజీఆర్) వందకి పైగా చిత్రాలలో నటించారు. మలైక్కల్లన్(1954), ఎంగా వీట్టు పిళ్లై(1965) వంటి చిత్రాలలో వీరోచిత, పేదలకు అనుకూలంగా ఉండే పాత్రలను పోషించారు.
మొదట్లో డీఎంకే సభ్యుడైన ఎంజీఆర్, కరుణానిధితో ఏర్పడిన విభేదాల కారణంగా 1972 లో ఏఐఎడీఎంకేను స్థాపించారు. అణగారిన వర్గాల రక్షకుడిగా ఆయన జాగ్రత్తగా రూపొందించిన ఇమేజ్ రాజకీయాల్లో బాగా ఉపయోగపడింది.
ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే 1977 లో 130 సీట్లు గెలుచుకుని డీఎంకేను ఓడించి ఆయన ముఖ్యమంత్రిని చేసింది. తరువాత 1980 లో 129 సీట్లు, 1984 లో 132 సీట్లు గెలిచి వరుసగా అధికారాన్ని నిలబెట్టుకున్నారు. 1987 లో మరణించే వరకు ఆయన పదవిలో ఉన్నారు.
***
ఇది కూడా చదవండి
తెలుగు వాళ్ల ఫేమస్ చాక్లెట్ ‘న్యూట్రీన్’ ఎటుపోయింది?
***
ఆయన ఎన్నికల విజయానికి ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ఓటర్లలో భారీ అభిమానుల సంఖ్య, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాలు దోహదపడ్డాయి. ఎంజీఆర్ సినిమాటిక్ కరిష్మా, ప్రజాకర్షణ విధానాలు, అతన్ని రాజకీయ చిహ్నంగా మార్చాయి.
ఆయన అభిమాన సంఘాలు అట్టడుగు స్థాయి రాజకీయ యంత్రాంగంగా మారాయి. ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఇమేజ్ ను ‘‘పురచ్చి తలైవర్’’ (విప్లవాత్మక నాయకుడు) గా నిలబెట్టాయి. 1987 లో ఆయన మరణించిన తరువాత కూడా ఏఐఏడీఎంకే ఇంకా తమిళ రాజకీయాల్లో కొనసాగుతోంది.
జయలలిత.. ఉక్కు మహిళ
1960-70 లలో ఎంజీఆర్ తో పాటు అగ్ర తారమణిగా నటించిన ప్రముఖ తమిళ నటి జయరామ్ జయలలిత ఆయన మరణం తరువాత రాజకీయ వారసత్వాన్ని స్వీకరించింది. జయలలిత పగ్గాలు స్వీకరించే నాటికి పార్టీలో స్త్రీ ద్వేషం, వర్గ విభేదాలు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా అణచివేశారు. ఆమె ఆకర్షణీయమైన ఇమేజ్ ఓటర్లతో కనెక్ట్ కావడానికి సహాయపడింది.
జయలలిత 1991 లో 164 సీట్లు, 2001 లో 132 సీట్లు, 2011 లో 150 సీట్లు, 2016 లో 134 సీట్లు సాధించి సీఎంగా పీఠం ఎక్కారు. కానీ 2016 లో విజయం సాధించాక మరణించారు.
జయలలిత పాలనలో అమ్మ క్యాంటీన్ వంటి ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టారు. కానీ అవినీతి, నిరంకుశత్వం పట్ల విమర్శలు వచ్చాయి. 1996 లో కేవలం నాలుగు సీట్లు మాత్రమే నెగ్గారు.
2001 లో 61 సీట్లు సాధించారు. ఇవి పార్టీలో కొంత అస్థిరతను తీసుకొచ్చాయి. పురుషాధిక్య సమాజంలో మహిళలు గణనీయమైన అధికారాన్ని చెలాయించగలమని జయలలిత నిరూపించారు.
పొత్తులను నడిపించగల నేర్పు, ఎంజీఆర్ వారసత్వం ఉపయోగించుకునే ఆమె సామర్థ్యం ఆమె ఆధిపత్యాన్ని నిర్ధారించిందది. అయితే విశ్వాసులపై ఆధారపడటం ఆమె ప్రతిష్టను మసకబార్చింది.
స్టార్ పవర్ వీరికి అక్కరకు రాలేదు..
అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్,జయలలిత సాధించిన విజయాలను అనుకరించడానికి అనేకమంది నటులు ప్రయత్నించారు కానీ అనుకున్న స్థాయిలో ప్రభంజనం సృష్టించలేకపోయారు.
శివాజీ గణేషన్: ప్రముఖ నటుడు అయిన ఆయన 1988 లో తమిళగ మున్నేట్ర మున్నా ను స్థాపించారు. 1989 లో ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క సీటును సాధించలేకపోయారు. సినిమాల్లో విజయం సాధించినప్పటికీ రాజకీయాల్లో మాత్రం ప్లాప్ అయ్యారు.
విజయ్ కాంత్: యాక్షన్ స్టార్ దేశీయ ముర్కొక్కు ద్రవిడ కజగం(డీఎండీకే) స్థాపించారు. 2006 ఎన్నికల్లో 8.38 శాతం ఓట్ల వాటాతో కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్నారు. 2011 లో పొత్తు వల్ల 29 సీట్లు సాధించింది కానీ, 2016 లో ఒక్క సీటు సాధించలేదు.
కమల్ హసన్: 2018 లో మక్కల్ నీదీ మయ్యం స్థాపించారు. 2021 ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 2 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. కానీ ఒక్క సీట్ కూడా గెలుచుకోలేదు. మేథో పరమైన సపోర్టు, కింది స్థాయి కార్యకర్తల బలం లేకపోవడంతో ఇది జరిగింది. ప్రస్తుతం డీఎంకే అండతో రాజ్యసభ ఎంపీ కాగలిగారు.
రజనీకాంత్: సూపర్ స్టార్ రజనీకాంత్ 2017 లో తన రాజకీయ ప్రవేశం ప్రకటించారు. కానీ ఆరోగ్య సమస్యల కారణంగా 2020 లో రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించారు. ఒక దశాబ్దం పాటు ఆయన సినిమాలు, రాజకీయాల మధ్య ఊగిసలాడారు.
రాజకీయాల్లో విజయాలు సాధించడానికి స్టార్ పవర్ మాత్రమే సరిపోదని చెప్పడానికి ఇవి గొప్ప ఉదాహారణలు. తమిళనాడు వంటి పోటీ వాతావరణంలో విజయాలు సాధించాలంటే నటులకు సైద్దాంతిక బలం, బలమైన పార్టీ నిర్మాణాలు, స్థిరమైన ఓటర్ల మద్ధతు చాలా అవసరం.
కొత్త ఆటగాడు విజయ్..
జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, అభిమానులు ముద్దుగా ‘దళపతి’ అని పిలుచుకుంటారు. 30 సంవత్సరాలకు పైగా సినీ కెరీర్ ఉంది. ఆయన నటించిన మెర్సల్(2017), సర్కార్ (2018) రెండింటిలో సామాజిక- రాజకీయ సందేశాలు ప్రధాన కేంద్రంగా ఉన్నాయి.
ఇవి యువత, అణగారిన వర్గాల కథలను ప్రతిబింబిస్తాయి. విజయ్ ఫిబ్రవరి 2024 లో తమిళగ వెట్రి కజగం(టీవీకే) ని ప్రారంభించారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు వ్యతిరేకంగా మూడో శక్తిగా నిలబడటానికి ప్రయత్నిస్తున్నారు.
గతవారం టీవీకే విజయ్ ను 2026 ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. డీఎంకే లేదా బీజేపీతో పొత్తులు ఉండవని ప్రకటించింది. ఆయన ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికల రాజకీయాల్లో విజయ్ సామర్థ్యంపై అనేక ఊహగానాలు ఉన్నాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ - డిసెంబర్ మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్త పర్యటన, రెండు కోట్ల మంది పార్టీ సభ్యులను చేర్చుకోవడం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. విజయ్ రాబోయే చిత్రం ‘జననాయగన్’ వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయబోతున్నారు.
ఇది ప్రజల హీరో అనే ఇమేజ్ తీసుకువస్తుందని బలంగా నమ్ముతున్నారు. విజయ్ ప్రస్తుత డీఎంకే- అన్నాడీఎంకే రాజకీయాలను దెబ్బతీస్తాడని, ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తాడనే పరిశీలకులు అంచనావేస్తున్నారు.
విజయ్ ప్రధానబలం ఆయనకున్న అభిమానులు, క్లీన్ ఇమేజ్.. యువతతో ఎక్కువ టచ్ లో ఉండటం. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక సమస్యలను ఉపయోగించుకునే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేది ప్రశ్నార్థకం.
రాజకీయ అనుభవం లేకపోవడం, టీవీకే ఇప్పుడే పుట్టిన పార్టీ కావడం మైనస్ పాయింట్లు. రెండు పార్టీలు విజయ్ పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాయనడంలో సందేహం లేదు. ఇవి విజయ్ ముందున్న అతి పెద్ద సవాళ్లు
Next Story