
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
‘‘ఛత్రపతి శివాజీ పేరు తీసేసీ సెయింట్ మేరీ పేరు ఎలా పెడతారు’’
మరో వివాదంలో సిద్ధరామయ్య సర్కార్
కర్ణాటకలో మరో రాజకీయ వివాదం రాజుకుంది. బెంగళూర్ లోని శివాజీ నగర్ సమీపంలో నిర్మించబోతున్న మెట్రో స్టేషన్ కు ‘సెయింట్ మేరీ’ పేరు పెట్టాలనే ప్రతిపాదనపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలామంది నాయకులు దీనిని తీవ్రంగా విమర్శించారు. దీనిని బుజ్జగింపు రాజకీయంగా అభివర్ణించింది.
సిద్ధరామయ్య ఏం అన్నారు?
సెప్టెంబర్ 8న సెయింట్ మేరీస్ బసిలికాలో జరిగే వార్షిక విందు ప్రారంభోత్సవంలో పాల్గొన్న సిద్ధరామయ్య, రాబోయే మెట్రో స్టేషన్ కు సెయింట్ మేరీ పేరు పెట్టాలని తమ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేస్తుందని అన్నారు.
నగరంలోని పింక్ కారిడార్ లో ఈ స్టేషన్ రాబోతోంది. ‘‘మెట్రో స్టేషన్ కు సెయింట్ మేరీ పేరు పెట్టాలని అభ్యర్థన వచ్చింది. ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ తో నేను మాట్లాడాను.
ఏ స్టేషన్ కు పేరు పెట్టాలో చెబితే, మేము కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు పంపుతాము’’ అని సిద్ధరామయ్య అన్నారు.
శివాజీకీ తీవ్ర అవమానం..
కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటనను బీజేపీ తప్పుపట్టింది. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ప్రతిపాదనను ఖండించిన వారిలో మొదటి వ్యక్తి.
‘‘బెంగళూర్ లోని శివాజీ నగర్ మెట్రో స్టేషన్ పేరును సెయింట్ మేరీ పేరు మార్చాలన్నా కర్ణాటక ప్రభుత్వ చర్యను నేను ఖండిస్తున్నాను. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ ను అవమానించడమే’’ అని ఫడ్నవీస్ అన్నారు.
మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ కాలం నుంచి శివాజీని అవమానించే సంప్రదాయం కాంగ్రెస్ కు ఉందని పేర్కొంటూ ఆ ప్రతిపాదనన అమలు చేయకుండా ఉండటానికి భగవంతుడు సిద్ధరామయయకు తెలివి ఇస్తాడని ఫడ్నవీస్ ఆశించారు.
కాంగ్రెస్ ఆది నుంచి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కర్ణాటక బీజేపీ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు చలవాడీ నారాయణ స్వామి మాట్లాడుతూ.. మెట్రో స్టేషన్ కు పేరు పెట్టడం మతపరమైన ప్రాతిపదికన ఉండకూడదని, తన పార్టీ దీనిని వ్యతిరేకిస్తుందని అన్నారు.
‘‘శివాజీ నగర్ పేరును తొలగిస్తారా? ఎవరినైనా సంతోషపెట్టడానికి వారు హద్దులు దాటి వెళ్లకూడదు. బుజ్జగింపులు కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్రాధాన్యంగా మారాయి. బుజ్జగింపుల కారణంగా పార్టీ ఇప్పుడు కుక్కల వలలో చిక్కుకుంది. అయినప్పటికీ వారు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు. అది పనిచేయదు. మేము దానిని అనుమతించము’’ అని ఆయన విలేకరులతో అన్నారు.
అభ్యర్థనలలో తప్పులేదు..
ఈ వివాదంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడారు. ‘‘మేము ఇప్పుడే దాని గురించి చర్చించాము. సెయింట్ మేరీ పేరు పెట్టాలని ఒక అభ్యర్థన వచ్చింది. అభ్యర్థనలో తప్పులేదు. దానిపై మేము నిర్ణయం తీసుకుంటాము’’ అని అన్నారు.
మతపరమైన ప్రాతిపదిక పేర్లు పెట్టడంపై సోషల్ మీడియాలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మెట్రో స్టేషన్లు ఆ ప్రాంతం పేరు లేదా స్థానిక ప్రముఖుల పేరు పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు.
1980 లో బెంగళూర్ కు వేగవంతమైన రవాణా వ్యవస్థ ఉండాలని తపన పడిన దార్శనికుడు, కన్నడ నటుడు శంకర్ నాగ్ పేరును స్టేషన్ కు పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు.
Next Story