భారత్ లో ‘హెచ్ఎంపీవీ’ వైరస్ కలకలం.. బెంగళూర్ లో రెండు కేసులు
x

భారత్ లో ‘హెచ్ఎంపీవీ’ వైరస్ కలకలం.. బెంగళూర్ లో రెండు కేసులు

ఇద్దరు చిన్నారులకు సోకినట్లు నిర్ధారణ


కరోనా తో ప్రపంచంలో అల్లకల్లోలం రేపిన చైనాలో కొద్ది రోజుల నుంచి కొత్త రకం వైరస్ హెచ్ఎంపీవీ(HMPV) కూడా విభృంభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ వైరస్ భారత్ లోనూ ఉన్నట్లు భారత ప్రభుత్వం ప్రకంచింది. కర్ణాటక రాజధాని బెంగళూర్ లో ఉన్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా సాధారణంగా నిర్వహించిన కొన్ని పరీక్షల్లో ఈ కేసు వెల్లడి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే ఈ చిన్నారులకు వైరస్ ఎలా సోకిందనే విషయంలో ఎలాంటి సమాచారం లేదు. చిన్నారులకు సంబంధించి ఎవరైన చైనా నుంచి వచ్చారా అనే విషయంలో ఇంకా వివరాలు అందాల్సి ఉంది.

హెచ్ఎంపీవీ వైరస్ వూహాన్ వైరస్ అంత ప్రమాదకరంగా కాదు కానీ జలుబు లక్షణాలు మాత్రం ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల జలుబు, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఉంటుందని, వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే ఊపిరితిత్తులపై ప్రభావం ఎక్కువగా చూపే బ్రాంకైటిస్, న్యూమోనియా వంటి ప్రభావిత వ్యాధులకు దారి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వ్యాధి సోకిన మూడు రోజుల తరువాత దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
ఈ వ్యాధి ఎక్కువగా యువకులు బలహీనమైన రోగ నిరోధన వ్యవస్థ ఉన్నవారికి సోకుతోంది. చైనాలో విస్తృతంగా ప్రబలుతున్న ఈ వైరస్ పై బీజింగ్, డబ్ల్యూ హెచ్ ఓ(WHO) తో ఎలాంటి సమాచారం పంచుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి.
అలాగే వ్యాధి తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు సైతం చేస్తోంది. దీని వల్ల చైనాలో ఎటువంటి ఇబ్బంది లేదని కమ్యూనిస్టు ప్రభుత్వం బయటకు చెబుతున్న అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ఈ వ్యాధిని తీవ్రతతో ప్రజలు వేలల్లో ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
వూహాన్ వైరస్ తరువాత ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరో వైరస్ చైనా నుంచి రావడంపై అంతటా భయాందోనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడూ దీనిపై పర్యవేక్షిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా వివిధ చోట్ల ఆర్ఎస్ఏ, హెచ్ఎంపీవీ తదితర పరీక్షలు నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఎదురైనా తాము ఎదర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Read More
Next Story