కన్నడ లో మాట్లాడితేనే సాయం చేస్తాం.. విదేశీయుడి విజ్ఞప్తికి సమాధానం
భయంతో ఆరు గంటల పాటు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని స్పెయిన్ దేశస్థుడు
సెంట్రల్ బెంగళూర్ లో నివసిస్తున్న ఓ విదేశీయుడు తనకు సాయం చేయమని టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయగా కన్నడలో మాట్లాడాలని కోరి కాల్ కట్ చేయడంతో బాధితుడికి సాయం అందలేదు. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ బెంగళూర్ లో నివసిస్తున్న ఓ స్పెయిన్ దేశస్థుడి ఇంట్లోకి బుధవారం తెల్లవారు జామున ఇద్దరు దొంగలు ప్రవేశించి భీభత్సం సృష్టించారు. దాంతో బాధితుడు ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్ అయినా 112 కు కాల్ చేశాడు. అయితే ఆపరేటర్ ఆ భాష రాకపోవడంతో కన్నడలో మాట్లాడాలని కోరాడు.
జీసస్ అబ్రియేల్(30) లాంగ్ ఫోర్డ్ రోడ్ లోని నైడస్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో నివసిస్తున్నాడు. తెల్లవారుజామున 2 గంటలకు ఇద్దరు దొంగలు బాత్రూమ్ కిటీకిలోని గాజు పలకలు తీసి లోపలకి వచ్చినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. తనకు శబ్ధాలు రావడంతో వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 112కి కాల్ చేశాడు. అయినప్పటికీ ఇంగ్లీష్, స్పానిష్ లో మాట్లాడానికి ప్రయత్నించాడు. అయితే కేవలం కన్నడలోనే మాట్లాడాలని ఆపరేటర్ కాల్ డిస్ కనెక్ట్ చేశారు.
ఇంటిలోనే 30 నిమిషాలు..
దాడులకు భయపడి జీనస్ తన ఫ్టాట్ నుంచి బయటకు రాలేదు. దొంగలు ఫ్టాట్ లో 30 నిమిషాలు ఉండి ల్యాప్ టాప్, ప్లాటినమ్ రింగ్, హెడ్ ఫోన్, రూ. 10 వేల విలువైనా వాలెట్, డెబిట్ కార్డులు, స్పానిష్ ఐడీ సహ 82 వేల విలువైన వస్తువులను విండో ద్వారా దొంగిలించారు. దీనితో మానసిక క్షోభకు గురైన అబ్రియెల్ దాదాపు ఆరు గంటల పాటు అలాగే ఉండిపోయాడు. ఉదయం 8. 30 నిమిషాలకు తన ఇంటి యజమానికి సుదీఫ్ ఫోన్ చేశాడు. అతను ఫ్లాట్ కు చేరుకున్నాడు.
సీసీటీవీ లేదు..
అపార్ట్ మెంట్ లో సీసీటీవీ నిఘా లేకపోవడంతో డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ ఉన్న గార్డు ఈ సంఘటనను పట్టించుకోలేదు. పక్కన ఉన్న నిర్మాణంలో కార్మికులు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రోడ్లు, ఇతర భవనాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భారత న్యాయసంహిత లోని 305, 331 సెక్షన్ లను పెట్టారు.
హెల్ప్ లైన్ సమస్యలు..
జాతీయ మీడియా నివేదిక ప్రకారం హెల్ప్ లైన్ కు ప్రతి రోజూ 15000 నుంచి 20000 వేల వరకూ కాల్స్ వస్తున్నాయని వాటిలో 1500 మంది మాత్రమే నిజమైనవని పోలీసులు పేర్కొన్నారు. ఆపరేటర్ తనకు వచ్చిన కాల్ ను ఓ చిలిపి లేదా తాగిన మైకంలో వచ్చిన కాల్ గా భావించినట్లు వారు వివరించారు. అయితే కాల్ ఆపరేటర్ తనకు వచ్చిన కాల్ కు మరోసారి కాల్ చేసి ధృవీకరించుకోవాలి. కానీ ఆపని చేయలేదు.
Next Story