కరూర్ విషాదం తరువాత టీవీకే అధ్యక్షుడు పాఠాలు నేర్చుకున్నాడా?
x
టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్

కరూర్ విషాదం తరువాత టీవీకే అధ్యక్షుడు పాఠాలు నేర్చుకున్నాడా?

పుదుచ్చేరిలో నిరాడంబరంగా కనిపించిన దళపతి


మహాలింగం పొన్నుస్వామి

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ పెట్టి, జోరుగా ప్రచారం ప్రారంభించిన టీవీకే అధ్యక్షుడు విజయ్ పుదుచ్చేరిలో మాత్రం సాధారణంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించాడు.

సెప్టెంబర్ 27న కరూర్ లో నిర్వహించిన రోడ్ షోలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తరువాత తొలిసారిగా ఆయన తొలిసారిగా బహిరంగంగా కార్యకలాపాలు పుదుచ్చేరిలో నిర్వహించాడు.

కరూర్ విపత్తు నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్న విజయ్ జనగందరగోళం లేకుండా పూర్తి భద్రతతో కూడిన సభను నిర్వహించాడు. మొదట చెన్నై నుంచి ఉప్పలం మీదుగా కారులో వచ్చాడు.
తన ప్రచార వాహానంపై ఎటువంటి రోడ్ షో లేదా ర్యాలీని నిర్వహించకుండా ప్రయాణించారు. ఇంతకుముందులా భారీగా జనాన్ని ఆకర్షించి, రోడ్ షో వంటి కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు.
కేవలం 13 నిమిషాల ప్రసంగం..
విజయ్ పర్యటన సందర్భంగా పుదుచ్చేరి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాస్ లు తయారు చేయించారు. సభకు కేవలం 5 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ పాస్ లు ఇచ్చారు.
ఇందుకోసం దాదాపు 800 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలతో ఎత్తుకున్న వారిని నిషేధించారు. తన మద్దతుదారులు వాహనం వెంట రావద్దని విజయ్ ప్రత్యేకంగా కోరారు.
విజయ్ మాట్లాడటానికి ముందు టీవీకే నాయకులు అదవ్ అర్జున, బుస్సీ ఆనంద్ మాట్లాడారు. భద్రత ఏర్పాటు చేసిన పుదుచ్చేరీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు కార్యక్రమాల నిర్వహణలతో వారు దీనిని పోల్చారు. డీఎంకే ప్రభుత్వం పుదుచ్చేరిని చూసి నేర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విజయ్ కేవలం 13 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. ఆయన తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేను, కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీని విమర్శించారు. అయితే తమిళనాడులో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై మాత్రం విమర్శలు చేయలేదు.
‘‘ఈ అద్బుతమైన భద్రతా చర్యలకు పుదుచ్చేరి ప్రభుత్వానికి , ముఖ్యమంత్రికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పుదుచ్చేరి ప్రభుత్వం తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం లాంటిది కాదు.
వారు ఎటువంటి వివక్ష లేకుండా భద్రత అందించారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, పుదుచ్చేరి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి. కానీ వారు నేర్చుకునేలా లేరు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం నేర్పుతారు’’ అని విజయ్ అన్నారు. ‘‘కేంద్రానికి మాత్రమే తమిళనాడు, పుదుచ్చేరి వేరు, మాకు, ప్రజలకు మేము కలిసి ఉన్నాము’’ అని ఆయన అన్నారు.
డీఎంకే విమర్శలు..
అనేక సంవత్సరాలుగా పుదుచ్చేరి రాష్ట్ర హోదా కావాలని డిమాండ్లు ఉన్నాయని కానీ కేంద్రం పదే పదే నిరాకరిస్తోంది. నిధులు, అభివృద్ధి సరైన రేషన్ వ్యవస్థ వంటి ప్రాథమిక సౌకర్యాలను నిరాకరిస్తోందని ఆయన ఆరోపించారు.
డీఎంకే ఓటర్లను మోసం చేస్తోందని విమర్శించారు. ఆ పార్టీని ప్రజలు నమ్మవద్దని విజయ్ కోరారు. పుదుచ్చేరితో ఎంజీఆర్ చారిత్రక సంబంధాలను గుర్తు చూస్తూ టీవీకే జెండా కేంద్రపాలిత ప్రాంతంలో ఎగురుతుందని ప్రతిజ్ఞ చేశారు.
డీఎంకే సీనియర్ ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ విజయ్ ను విమర్శించారు. కరూర్ విషాదం తరువాతే టీవీకే నాయకుడు 15 నిమిషాల ముందుగానే వచ్చారని, 5 వేల మందికి పైగా ప్రతినిధులు హజరైతే సమావేశాన్ని రద్దు చేసుకుంటామని అక్కడి ప్రభుత్వాన్ని బతిలాడుకున్నారని ‘ది ఫెడరల్’ తో చెప్పారు.
‘‘సరైన రేషన్ దుకాణాలు లేవని విజయ్ విమర్శిస్తే, దానిని పుదుచ్చేరి ప్రభుత్వాన్ని విమర్శించినట్లుగానే భావించాలి’’ అని ఎలంగోవన్ అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలనే ఆశయం తప్ప విజయ్ కు ప్రజల పట్ల నిజమైన ఆందోళన లేదని చెప్పారు. టీవీకే తమిళనాడులో పోలీసుల సూచనలు పాటించి ఉంటే ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు మంజూరు చేసి ఉండేవని ఆయన పేర్కొన్నారు.
పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి మాట్లాడారు. ప్రధాని మోదీ ఒకప్పుడు ట్విన్ ఇంజన్ పాలనగా అభివర్ణించారని, ఎన్ఆర్ కాంగ్రెస్- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు, ప్రజా పథకాలను అమలు చేయడంలో వైఫల్యం, పేలవమైన శాంతిభద్రతలను విజయ్ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.
‘‘పుదుచ్చేరిలో ఒక కార్యక్రమం నిర్వహించామని ఎవరో సలహ ఇచ్చినందుకే విజయ్ ఇక్కడికి వచ్చి సమావేశం నిర్వహించాడు’’ అని కాంగ్రెస్ నాయకుడు నారాయణ స్వామి అన్నారు. విజయ్ స్థానిక రాజకీయాలపై సరైన అవగాహన లేదని అన్నారు.
పుదుచ్చేరిలో ఎంజీఆర్ పాలన సమర్థవంతంగా వేళ్లూనుకోలేదని, రామస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని కేవలం 1.5 సంవత్సరాలలోనే సొంత పార్టీ సభ్యులే కూల్చివేశారని ఆయన చెప్పారు.
‘‘విజయ్ తమిళనాడులో అవినీతి గురించి మాట్లాడతాడు. కానీ పుదుచ్చేరీ ప్రభుత్వంలోని అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదు’’ అని నారాయణ స్వామి ప్రశ్నించాడు. కేంద్రపాలిత ప్రాంతం రాజకీయ దృశ్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని టీవీకే నాయకుడిని కోరారు.
విజయ్ పొత్తుకు సై అంటున్నారా?
టీవీకే అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం, డీఎంకేపై తీవ్రంగా విమర్శలు గుప్పించినప్పటికీ ఎన్ఆర్ కాంగ్రెస్ పై మాత్రం ఎలాంటి విమర్శలు చేయలేదని జర్నలిస్ట్ స్వామినాథన్ గమనించారు. ముఖ్యమంత్రి రంగస్వామితో పొత్తు పెట్టుకోవడానికి విజయ్ ఆసక్తి చూపుతున్నారని సూచించారు.
పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పొత్తులు అవసరమని ప్రముఖ జర్నలిస్ట్ శ్యామ్ పేర్కొన్నారు. విజయ్ ప్రసంగం దానికి ఆయన సంసిద్దతను సూచిస్తుందని అన్నారు.
అయితే రేషన్ కార్డులకు సంబంధించి విజయ్ కొన్ని తప్పుడు గణాంకాలను ఉటంకించారని విజయ్, అతని బృందానికి పుదుచ్చేరిపై ఎలాంటి అవగాహన లేదని ఆయన గమనించారు. పుదుచ్చేరి సమావేశానికి విజయ్ నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఏంటంటే.. సమయపాలన ప్రాముఖ్యత, ఆలస్యం లేకుండా చేరుకోవడం అని శ్యామ్ అన్నారు.


Read More
Next Story