కర్నాటక సీఎంపై గవర్నర్ కీలక నిర్ణయం.. ఏంటదీ?
x

కర్నాటక సీఎంపై గవర్నర్ కీలక నిర్ణయం.. ఏంటదీ?

కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం సిద్దరామయ్యపై కొన్ని రోజులుగా వస్తున్న ముడా స్కామ్ ఆరోపణలపై ఇప్పటికే నోటీసులు జారీ చేసిన..


కర్ణాటకలో రాజకీయ సెగ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముడా స్కామ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్దరామయ్య ను విచారించడానికి అనుమతిస్తూ గవర్నర్ ధావర్ చంద్ గెహ్లట్ నిర్ణయం తీసుకున్నారు. ఇది సిద్దరామయ్య రాజకీయ జీవితంలో ఓ ముఖ్యమైన సవాలుగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు.

మైసూరు కు చెందిన స్నేహమయి కృష్ణ, మడికేరికి చెందిన టీజే అబ్రహం, ప్రదీప్‌లు గవర్నర్ కు కలిసి ఫిర్యాదు చేశారు. వీరు తమ దగ్గర ఉన్న ఆధారాలను ఆయనకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ప్రాసిక్యూషన్ కు ఆమోదం లభించింది. గవర్నర్ నిర్ణయంపై ఇంకా కాంగ్రెస్ స్పందించలేదు.
మైసూర్ నగరంలో ముడా సంస్థ నగర అభివృద్ధి కోసం ప్రజల నుంచి భూములను సేకరించి వారికి నగరంలోని ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించారు. ఈ ప్రక్రియలో సీఎం సిద్దరామయ్య భార్య పార్వతి పేరు మీద ఉన్న భూములను తీసుకుని, వేరే ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన భూములను కేటాయించారు. దీని విలువ దాదాపు రూ. 3 వేల నుంచి 4 వేల కోట్లు వరకూ ఉంటుందని బీజేపీ ఆరోపించింది.
దీనిపై సిద్ధరామయ్య తనకు దీనికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. సీబీఐ దర్యాప్తుకు సైతం ఇవ్వనని ప్రకటించారు. మరోసారి మాట్లాడుతూ.. తన భార్యకు కేటాయించిన భూములు తనకు తెలియకుండానే అధికారులు కేటాయించారని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.
దీనిపైనే పలువురు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన రోజే గవర్నర్ సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేశారు. ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రికి తన "షోకాజ్ నోటీసు" ఉపసంహరించుకోవాలని గవర్నర్‌కు "గట్టిగా సలహా" ఇచ్చింది. గవర్నర్ "రాజ్యాంగ కార్యాలయాన్ని" తీవ్రంగా దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.
Read More
Next Story