ఎట్టకేలకు కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామా..
x

ఎట్టకేలకు కర్ణాటక మంత్రి నాగేంద్ర రాజీనామా..

కర్ణాటక షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర ఎందుకు రాజీనామా చేశారు? అసలు ఆయన మీదున్న ఆరోపణలేంటి?


షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర రాజీనామాను కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదించారు. ఈ విషయాన్ని రాజ్ భవన్ కార్యాలయ అధికారులు శుక్రవారం ధృవీకరించారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ నిధులను మంత్రి పక్కదారి పట్టించాడన్న ఆరోపణలతో నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు.

గురువారం మంత్రి రాజీనామాపై హైడ్రామా నడిచింది. ఈ నెల 6 లోపు మంత్రిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ రోజున నాగేంద్ర రాజీనామా చేస్తారని భావించారు. ఆయన తాను రాజీనామా చేయలేదని, అన్ని విషయాలు మీడియాతో మాట్లాడతానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా నాగేంద్ర రాజీనామా చేయలేదని పేర్కొన్నారు.

ఇటీవల కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన డెత్ నోట్‌ ఆధారంగా ముగ్గురు సహోద్యోగులను సస్పెండ్ చేశారు. కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.187 కోట్ల నుంచి రూ.80 నుంచి 85 కోట్లు దారి మళ్లిన విషయాన్ని చంద్రశేఖర్ ఆ లేఖలో వివరించారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ రెండూ వేర్వేరుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాయి.

Read More
Next Story