కేరళ పేరు మారింది! సీపీఎం ఇప్పుడేం చేస్తుందీ?
x

కేరళ పేరు మారింది! సీపీఎం ఇప్పుడేం చేస్తుందీ?

పినరయి విజయన్ పట్టుదల, పోరాటం ఫలించినట్టేనా.. కేంద్రం వ్యూహాం ఏమైనా ఉందా..


సీపీఎం అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రం పేరు మారింది. బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రధానంగా కేరళ రాష్ట్రం పేరును 'కేరళం'గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం రాష్ట్రం పేరు మార్పు మాత్రమే కాకుండా, రైల్వే, విమానయాన, వ్యవసాయ రంగాల్లో భారీ ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

'కేరళ' నుంచి 'కేరళం' వైపు.. ప్రయాణం ఎలా?

మలయాళ భాషలో ఆ రాష్ట్రాన్ని దశాబ్దాలుగా 'కేరళం' అని పిలుస్తారు. అయితే రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో మాత్రం కేరళగానే ఉంది. ఈ వ్యత్యాసాన్ని తొలగించాలని కేరళ అసెంబ్లీ గతంలోనే ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం పంపనున్నారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అధికారికంగా బిల్లును ప్రవేశపెడుతుంది. అది గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి వస్తుంది.

రాష్ట్రాల అభివృద్ధి, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా కేంద్రం భారీ నిధులను కేటాయించింది. క్యాబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇలా..

అహ్మదాబాద్‌ మెట్రో ఫేజ్‌-2కు ఆమోదం

గోండియా-జబల్‌పూర్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు ఆమోదం

విద్యుత్‌ రంగంలో సంస్కరణలకు ఆమోదం

మూడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహార్ జార్ఖండ్ మీదుగా మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు

బొగ్గు, స్టీల్, ఇనుము, సిమెంట్ ,స్టోన్ చిప్స్ , ఫ్లై యాష్ ,ఫర్టిలైజర్స్, లైమ్ స్టోన్, మ్యాంగనీస్ , ఆహార ధాన్యాల రవాణాకు కీలకం కానున్న మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్.. ప్రతి ఏడాది 52 మిలియన్ టన్నుల సరుకు రవాణా

9072 కోట్ల రూపాయలతో 307 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం..2031 కల్లా నిర్మాణం పూర్తి

జ్యూట్ మద్దతు ధర క్వింటాలు 5,295 రూపాయల పెంపుకు క్యాబినెట్ ఆమోదం

పంట వ్యయంపై 61% పైగా లాభం వచ్చేలా మద్దతు ధర నిర్ణయం

శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సివిల్ ఎన్క్లేవ్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం

1,677 కో రూపాయలతో నిర్మాణం కానున్న సివిల్ ఎన్క్లేవ్

ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 15 విమానాలు పార్కింగ్ చేసే సదుపాయం

గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ నుంచి షాపూర్ వరకు నార్త్ సౌత్ కారిడార్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం

కారిడార్ నిర్మాణానికి ఒక వెయ్యి 67 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న ప్రభుత్వం.

సీపీఎం పోరాటం ఫలించిందా...

కేంద్రం గ్రీన్ సిగ్నల్ వెనుక అసలు కథ ఇదే! కేంద్ర క్యాబినెట్ తీసుకున్న తాజా నిర్ణయాల్లో 'కేరళ' పేరును 'కేరళం'గా మార్చే ప్రతిపాదన అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ నిర్ణయం వెనుక కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం (CPM) చేసిన నిరంతర పోరాటం, వ్యూహాత్మక రాజకీయ మలుపు ఉంది.

ఆ క్రెడిట్ ఎవరిది? సీపీఎం ప్రభుత్వం ఏం చేస్తోంది?

ఈ పేరు మార్పు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి ముందే కేరళ అసెంబ్లీలో అధికార సీపీఎం ప్రభుత్వం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించింది.

ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF) ప్రభుత్వం, కేరళ అసెంబ్లీలో ఈ పేరు మార్పుపై రెండుసార్లు ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేరళం అనేది తమ మాతృభాష మలయాళంలో అసలు పేరని, రాజ్యాంగంలోని అన్ని షెడ్యూళ్లలో దీనిని మార్చాలని వారు పట్టుబట్టారు.

రాజకీయ క్రెడిట్: ఇప్పుడు కేంద్రం దీనికి ఆమోదం తెలపడంపై సీపీఎం శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ ప్రభుత్వం చేసిన పోరాటం వల్లే కేంద్రం దిగివచ్చిందని, ఇది కేరళ ప్రజల సాంస్కృతిక విజయమని సీపీఎం ప్రచారం చేస్తోంది.

Read More
Next Story