వైమానిక ప్రదర్శనలతో మెరీనా బీచ్ మురిసిన, అలసటతో ఐదుగురు..
x

వైమానిక ప్రదర్శనలతో మెరీనా బీచ్ మురిసిన, అలసటతో ఐదుగురు..

వైమానిక దళ విన్యాసాలు ప్రత్యక్షంగా చూడాలని లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు. కానీ ఓ వైపు మండే ఎండ, కింద ఇసుక, ప్రభుత్వ ఏర్పాట్లు సరిగా లేకపోవడం, కిలోమీటర్ల మేర


చెన్నైలోని ప్రఖ్యాత మెరీనా బీచ్ వద్ద ఐఏఎఫ్ 92 వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎయిర్ షో ను చూడటానికి లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు. ఇలా వచ్చిన వారిలో ఐదుగురు వ్యక్తులు ఎండ వేడిని తట్టుకోలేక చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీచ్ వద్ద ఒకరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో నలుగురు మరణించారని పోలీసులు వెల్లడించారు.

స్పృహతప్పి పడిపోయిన ప్రేక్షకులు..
వేల సంఖ్యలో ప్రజలు ఎయిర్ షో చూడటానికి వస్తారని తెలిసి కూడా డీఎంకే ప్రభుత్వం సరియైన ఏర్పాట్లు చేయలేదని ప్రతిపక్ష అన్నా డీఎంకే మండిపడింది. ఈ సంఘటనలకు సీఎం స్టాలిన్ బాధ్యత వహించాలని మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళని స్వామి విమర్శించారు.
ఎయిర్ షో ఉదయం పది గంటలకు ప్రారంభం అవుతుందని సమాచారం ఉన్న నేపథ్యంలో దానికి గంట ముందే ప్రజలు వేదిక వద్దకు రావడం ప్రారంభించారు. చాలా మంది ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి గొడుగులు తెచ్చుకున్నారు కానీ మెజారిటీ ప్రజలు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా విన్యాసాలను చూడటానికి వచ్చారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు షో ముగిసింది. అయితే అప్పటికే పదుల సంఖ్యలో స్పృహ తప్పి పడిపోయారు. పక్కన ఉన్నవారు సపర్యలు ప్రారంభించారు. జాతీయ మీడియా ప్రకారం డీ హైడ్రేషన్ లక్షణాలతో 30 మంది సమీపంలో ప్రభుత్వం ఆస్పత్రులకు తరలించారు. కొన్ని మీడియా సంస్థలు ఈ సంఖ్యను 230 అని తెలిపాయి.
కిక్కిరిసిన రోడ్లు..
షో ముగిసిన తరువాత వేలాది మంది ప్రజలు ఒక్కసారిగా ఇళ్లకు ప్రయాణం కావడంతో రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. మెట్రో, లోకల్ ట్రైన్లలో అడుగు పెట్టడానికి సందులేని పరిస్థితి. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ప్రజలు బస్ స్టాండ్లకు చేరుకోవడానికి చాలా దూరం నడవాల్సి వచ్చింది.
వేలాది మంది ఒకే సమయంలో వేదిక నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నించినప్పుడు కొంతసేపు తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ, వారు విజయవంతంగా గుంపును నియంత్రించి అంబులెన్స్‌లకు సురక్షితమైన మార్గంలో తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మెరీనాలో రికార్డు స్థాయిలో జనం
IAF స్పెషల్ గరుడ్ ఫోర్స్ కమాండోలు రెస్క్యూ ఆపరేషన్‌లో బందీలను విడిపించడంలో తమ సాహసోపేత నైపుణ్యాలను ప్రదర్శించడంతో వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. ఈ విన్యాసాలను చూడటానికి ప్రజలు ఇసుక బీచ్ లో ఉత్సాహాభరితంగా కూర్చున్నారు. పారా జంప్ సైనికులు బందీలు ఉన్న ప్రాంతంలో దూసుకెళ్లి వారిని రక్షించడం మంత్ర ముగ్థులను చేసింది.
లైట్‌హౌస్ - చెన్నై పోర్ట్ మధ్య మెరీనాలో జరిగిన 92వ IAF దినోత్సవ వేడుకలను వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రాష్ట్ర మంత్రులు, చెన్నై మేయర్ తదితరులు వీక్షించారు.
లిమ్కా బుక్ ఎంట్రీ
ఈ విన్యాసాల్లో 72 ఎయిర్ క్రాప్ట్ లు పాల్గొనడంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చేరాయి. సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్‌లు రాఫెల్‌తో సహా దాదాపు 50 విమానాలు నిప్పుల వర్షం కురిపించాయి. హెరిటేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ డకోటా, హార్వర్డ్, తేజస్, SU-30, సారంగ్ కూడా వైమానిక విన్యాసాల్లో పాల్గొన్నాయి.
సుఖోయ్ సు-30 ఫైటర్ జెట్ "లూప్-టంబుల్-యా" విన్యాసాన్ని ప్రదర్శించింది. సూర్యకిరణ్ కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు ఆకాశంలో విన్యాసాలు నిర్వహించారు. దేశం గర్వించదగ్గ హెలికాప్టర్లు ప్రచండ, తేజస్ లు కూడా ఇందులో పాల్గొన్నాయి. దాదాపు 21 సంవత్సరాల తరువాత ఆత్మ నిర్భర భారత్ కింద తయారైన లోహ విహంగాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
గొప్ప చర్య
దేశ రాజధాని వెలుపల ఇలాంటివి జరగడం ఇది మూడోసారి. చివరి ప్రదర్శన అక్టోబర్ 8, 2023న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో జరిగింది. అంతకుముందు సంవత్సరం చండీగఢ్‌లో జరిగింది. చెన్నైలో రాఫెల్ ఆకాశం అంతటా తిరుగుతూ, ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని ప్రదర్శిచింది. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.
15 లక్షల మంది ప్రేక్షకులు, 72 విమానాలు
ముందుగా చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా స్టాలిన్ జ్ఞాపికను అందుకున్నారు. 72కి పైగా విమానాలతో దేశం వైమానిక యోధుల ప్రదర్శన ను దాదాపు 15 లక్ష్లల మంది ప్రజలు చూశారని రక్షణ ప్రకటన తెలిపింది.
"సుమారు 21 సంవత్సరాల తర్వాత నగరానికి తిరిగి వచ్చిన ఎయిర్‌షోను చూడటానికి ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని కోవలం నుంచి ఎన్నూర్ వరకు మొత్తం బీచ్ ఫ్రంట్, ఎత్తైన భవనాల పైకప్పులు నిండిపోయాయి" అని అది పేర్కొంది. ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఎయిర్ షోలలో ఒకటి, వార్షిక కార్యక్రమం చాలా కాలం పాటు ఢిల్లీలో జరిగేదని తెలిపింది. ఇతర నగరాల ప్రజలు ఈవెంట్‌ను వీక్షించే అవకాశాన్ని కల్పించడానికి ఇది మూడు సంవత్సరాల క్రితం దేశ రాజధాని నుంచి మార్చబడింది.



Read More
Next Story