‘ముందు బీజేపీ నుంచి మీ పార్టీని కాపాడుకోండి’
x

‘ముందు బీజేపీ నుంచి మీ పార్టీని కాపాడుకోండి’

ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి కె పళనిస్వామి గురించి వ్యంగ్యంగా మాట్లాడిన తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్


Click the Play button to hear this message in audio format

ఏఐఏడీఎంకే(AIADMK)ను భారతీయ జనతా పార్టీ(BJP) వర్గాలుగా విడగొట్టి లాభపడాలని చూస్తోందని తమిళనాడు(Tamil Nadu) ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) బుధవారం ఆరోపించారు. చెంగల్‌పేటలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి(Palaniswami) నినాదం 'ప్రజలను రక్షించండి, తమిళనాడును తిరిగి పొందండి'ని ఎగతాళి చేశారు. ముందుగా బీజేపీ నుంచి ఎఐఎడిఎంకెను కాపాడుకోవాలని ఎద్దేవ చేశారు.


‘ద్రోహ భావం వెంటాడుతుంటుంది.’

‘‘ఎక్కడయినా ఇద్దరు డీఎంకే కార్యకర్తలు కలిసినప్పుడు పార్టీ, కుటుంబ విషయాలపై స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటారు. కాని ఇద్దరు AIADMK కార్యకర్తలు కలిస్తే మాట్లాడుకోరు. ఒకరినొకరు చూసుకుంటారు. అది కూడా ఒకరు మరొకరి ద్రోహం చేశారన్న భావనతో..’’ అని అన్నారు ఉదయనిధి స్టాలిన్.


‘రెండు కాదు, మూడు వర్గాలు తయారయ్యాయి..’

"OPS (O Panneeselvam) వర్గం, EPS (పార్టీ అధినేత్రి ఎడప్పాడి కె పళనిస్వామి) వర్గం, పార్టీ అధినేత దివంగత జె జయలలితకు బాగా సన్నిహితం. కొత్తగా సెంగొట్టయన్ వర్గం మరొకటి పుట్టుకొచ్చింది. కార్యకర్తలు ఈ మూడు వర్గాల్లో ఏ వర్గానికి చెందిన వారు తెలుసుకోవడం కూడా గందరగోళంగా తయారైంది.

EPSను ఎగతాళి చేస్తూ..2016లో పార్టీ చీఫ్ మరణం తర్వాత పార్టీని తనఖా పెట్టిన పళనిస్వామి.. ముందుగా బీజేపీ నుంచి ఏఐఏడీఎంకేను కాపాడుకోవాలి. DMK దాని కూటమి పార్టీలను మింగేస్తుందని పళనిస్వామి చెబుతున్నాడు. DMK నేతృత్వంలోని కూటమి కేవలం ఎన్నికల కూటమి కాదు. ఇది భావజాలంపై ఆధారపడిన కూటమి. DMK నేతృత్వంలోని కూటమి సంవత్సరాలుగా బలంగా ఉంది. దాన్ని ఎవరూ టచ్ చేయలేరు.’’ అన్నారు ఉదయనిధి.

‘‘AIADMK-BJP NDA కూటమిని మిత్రపక్షాలు విడిచిపెట్టాయి. పళనిస్వామి ప్రచారం ముగించుకుని తిరిగి వచ్చేటపుడు ఒంటరిగా తిరిగి రావచ్చు. ఆయన డ్రైవర్ కూడా అతనితో ఉంటాడో లేదో అనుమానమే’’ పళనిస్వామి గురించి ఉదయనిధి వ్యంగ్యంగా మాట్లాడారు.

Read More
Next Story