పాలిటిక్స్‌లోకి మాజీ సిపాయి
x

పాలిటిక్స్‌లోకి మాజీ సిపాయి

ఆంధ్రప్రదేశ్‌లోని అనపర్తి ప్రస్తుతం వార్తలకెక్కింది. ఎందుకంటే ఇక్కడి నుంచి సిఫాయి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అక్కడి బీజేపీ అభ్యర్థి.


జి. విజయ కుమార్

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వ్యాపారస్తులు.. ఉద్యోగస్తులు.. ఐఏఎస్, ఐపిఎస్‌ అధికారులు.. జమిందారులు.. ధనవంతులు.. చివరికి సామాజిక కార్యకర్తలు రాజకీయాల్లోకి రావడం.. ఎన్నికల్లో పోటీ చేయడం చూస్తుంటాం. కానీ శత్రు దేశాల నుంచి ప్రతి క్షణం కంటికి రెప్పలా దేశాన్ని రక్షించే సైన్యంలో పని చేసిన సోల్జర్స్‌ను ఎక్కడా చూసి ఉండం. ఉత్తర భారత దేశంలో అక్కడక్కడ అలాంటి వారు తారసపడినా అది కూడా అరుగానే కనిపిస్తుంది. సరిగ్గ ఇలాంటి సంఘటనే అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో చోటు చేసుకుంది. ఒక మాజీ సైనికుడు తాను కూడా రాజకీయాల్లో రావడం, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతనానని ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా బిజెపీ సీటు కూడా ఖరారు చేసింది. సైన్యంలో దేశానికి అందించిన సేవలను గుర్తించి అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గానికి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించింది. ఆయనే ములగపాటి శికరామకృషంరాజు. బుధవారం బిజెపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో శివరామకృష్ణంరాజు కూడా స్థానం దక్కించుకున్నారు.

17 ఏళ్ల పాటు మిలటరీలో సేవలు

పూర్తి పేరు మునగపాటి శివరామకృష్ణంరాజు. 1986లో జన్మించారు. బిఏ, బిఎల్‌ చదివారు. 2004 డిసెంబరులో ఆర్మిలోకి వెళ్లారు. ఆర్మీలోని ఇంటెలిజెన్స్‌ విభాగంలో వివిధ హోదాల్లో దేశానికి సేవలు అందించారు. దాదాపు తొమ్మిది రాష్ట్రాల పరిధిలో సేవలు అందించారు. హౌల్దారుగా ఉద్యోగ విరమణ చేశారు. తండ్రి అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో 2020లో ఆ మిలటరీ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సొంతూరుకు వచ్చేశారు. ఆ తర్వాత బిజెపీలో చేరారు. రెండేళ్ల నుంచి బిజెపీ వనపర్తి అసెంబ్లీ నియోజక వర్గం ఇన్‌చార్జీగా ఉన్నారు. మిలటరీ రాజు తండ్రి బిజెపీలో దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. వివిధ పార్టీ హోదాల్లో పని చేశారు.

తొలుత టీడీపీకని ప్రచారం

అనపర్తి అసెంబ్లీ సీటు తొలుత టీడీపీకి కేటాయించాలని నిర్ణయించారు. టీడీపీ, జనసేన, బిజెపీ పొత్తులో భాగంగా దీనిని టీడీపీకి కేటాయించాలని భావించారు. అందులో భాగంగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని చంద్రబాబు నిర్ణయించారు. ఆ మేరకు జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌తో కలిసి విడుదల చేసిన తొలి జాబితాలో ఆయన పేరును కూడా ప్రటకించారు. అయితే అప్పటికి ఇంకా పొత్తు ఫైనల్‌ కాలేదు. పొత్తు అనంతరం దీనిని బిజెపీ కేటాయించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డికే ఈ సారి కూడా టికెట్‌ ఇవ్వాలని స్థానిక నేతలు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని నారా భువనేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల రాజమండ్రి ఎయిర్‌ పోర్టుకు వచ్చిన ఆమెను స్థానిక నేతలు కలిసారు. అనపర్తి సీటును తెలుగుదేశం పార్టీకే కేటాయించాలని, మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డికి ఈ సారి కూడా టికెట్‌ ఇవ్వాలని కోరారు.

అనపర్తి సీటును బిజెపీకి కేటాయించడంతో ఆ పార్టీ వర్గాలు బగ్గుమంటున్నాయి. పొత్తుల్లో టీడీపీకి దక్కక పోవడంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను బిజెపీ ఎలా సముదాయిస్తుందో, అనుకూలంగా ఎలా మలచుకుంటుందో అని వేచి చూడాలి.

Read More
Next Story