
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి
బహిష్కృత నేతపై ఈపీఎస్ ఘాటు విమర్శలు
వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేదే విజయం అన్న మాజీ ముఖ్యమంత్రి
మహాలింగం పొన్నుస్వామి
అన్నాడీఎంకే బహిష్కృత నేత కే.ఏ సెంగొట్టయన్ పై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయనకు ప్రజా గుర్తింపు ఇచ్చిన పార్టీ అన్నాడీఎంకే అని, అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించినందుకు సెంగొట్టయన్ ను ద్రోహిగా, స్వార్థపరుడుగా అభివర్ణించారు.
ఈపీఎస్ భారీ ర్యాలీ..
సెంగొట్టయన్ స్వస్థలం ఈరోడ్ సమీపంలోని గోబిచెట్టిపాళయంలో ఆదివారం జరిగిన భారీ ర్యాలీ నిర్వహించిన ఈపీఎస్, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలనే తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
సెంగొట్టయన్ తమిళగ వెట్రి కజగం(టీవీకే) లో చేరిన కొన్ని రోజుల తరువాత రాబోయే ఎన్నికలోల గోబీ చెట్టిపాళయం స్థానాన్ని అన్నాడీఎంకే నిలుపుకుంటుందని పళని స్వామి అన్నారు.
బహిష్కరించబడిన నాయకుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ముందు ప్రజలను సంప్రదించారా అని ప్రశ్నించారు. ‘‘ఎంగిరుంతలుమ్ వాఝ్గా’’(ఎక్కడ ఉన్నా సరే, బాగా పనిచేయండి) అనే సంప్రదాయ పదబంధాన్ని ఉపయోగించిన ఈపీఎస్, సెంగొట్టయన్ తన శుభాకాంక్షలు తెలిపారు. బహిష్కరించిన నాయకులు మౌనంగా ఉంటే మంచిదని కూడా చెప్పారు.
స్వచ్ఛమైన ప్రభుత్వం..
‘‘టీవీకే స్వచ్ఛమైన ప్రభుత్వం అందిస్తారని సెంగొట్టాయన్ అంటున్నారు’’ అనే పళని స్వామి గుర్తు చేశారు. మీరు మంత్రిగా ఉన్న సమయంలో మనం మంచి పాలన అందించలేదా? అయితే మీరు ఎలా మంత్రిగా పనిచేశారు? అని ప్రశ్నలు సంధించారు.
అన్నాడీఎంకేను ఎవరూ ఓడించలేరని అన్నారు. నెలల క్రితం పళని స్వామి మాట్లాడుతూ.. కీలకమైన అతికడవు అవినాశి ప్రాజెక్ట్ కు సంబంధించిన కార్యక్రమానికి తాను అధ్యక్షత వహించినప్పుడూ అప్పటి స్థానిక ఎమ్మెల్యే సెంగొట్టయన్ అందులో పాల్గొనలేదని అన్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్, జే జయలలిత చిత్రాలు అందులో లేవని అన్నారు.
ఎవరి చిత్రపటాలను చూసి ప్రేరణ పొంది నువ్వు టీవీకే లో చేరావని సెంగొట్టయన్ ను ఈపీఎస్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అన్నాడీఎంకేనే సెంగొట్టయన్ కు గుర్తింపు, స్థానం, ప్రభుత్వ పదవిని ఇచ్చిందని అన్నారు.
ఆయన పార్టీ ప్రయోజనాలకు విరుద్దంగా వ్యవహరించినందునే బహిష్కరించామని చెప్పారు. సీఎం స్టాలిన్, కరుణానిధి ఫొటోలు ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో సెంగొట్టయన్ కూడా పాల్గొన్నారని ఆయన అన్నారు.
అవినాశిలో జరిగిన అన్నాడీఎంకేను అభినందించే కార్యక్రమాన్ని కూడా ఆయన బహిష్కరించినట్లు చెప్పారు. బీజేపీ పేరు చెప్పకుండానే అందరి అగ్రనాయకులను కలిసారని, అయినప్పటికీ అందరికి గౌరవం ఇస్తూనే ఉందని అన్నారు.
అయితే ఆయన తనను సంస్కరించలేదని, బహిష్కరించిన నాయకులను తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని అల్టిమేటం ఇచ్చే స్థాయికి చేరుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పన్నీర్ సెల్వం సహ అనేక మంది బహిష్కృత నాయకులను కలిశారని అన్నారు. ఇవే ఆయన బహిష్కరించడానికి కారణంగా చెప్పారు.
‘‘గత 2-3 సంవత్సరాలుగా అతను పార్టీలోనే ఉంటూనే పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించాడు. ఆయన పార్టీకి ద్రోహం చేశాడు. అందుకే సెంగొట్టయన్ బహిష్కరించారు.
పార్టీకి ద్రోహం చేసిన వారిని దేవుడు చూసుకుంటారు’’ అని ఈపీఎస్ అన్నారు. 2026 ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ మొదటి గోబీచెట్టిపాళయంలో జరుగుతుందదని చెప్పారు.
ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోబీ చెట్టిపాళయం నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే భారీ విజయం సాధిస్తుందని, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడి సెంగొట్టయన్ కలలను బద్దలు కొట్టారని ఆయన అన్నారు.
Next Story

