
ఈపీఎస్, అమిత్ షా
బీజేపీకి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండదన్న ఈపీఎస్
బీజేపీ ప్రకటనకు భిన్నంగా స్పందించిన అన్నాడీఎంకే అధినేత
(మూలం.. మహాలింగం పొన్నుస్వామి)
తమిళనాడులో వచ్చే ఏడాది భారతీయ జనతాపార్టీ(బీజేపీ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన తమకు లేదని ఏఐడీఎంకే నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి చెప్పారు.
2026 అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలో పాలన సాగిస్తుందని, తమిళనాడులో తాను ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు అందుకుంటానని పళని స్వామి మీడియాకు తెలిపారు.
సంకీర్ణ ప్రభుత్వం ఉండదు...
ప్రతిపక్షాలను మాట్లాడనివ్వనందున స్పీకర్ పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని పేర్కొంటూ తమిళనాడు అసెంబ్లీ నుంచి ఈపీఎస్ నేతృత్వంలోని ఏఐడీఎంకే సభ్యులు వాకౌట్ చేసిన తరువాత ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పై పొత్తు గురించి వివరించారు.
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం గురించి అడిగిన ప్రశ్నకు ఈపీఎస్ సమాధానం ఇస్తూ.. ‘‘సంకీర్ణ ప్రభుత్వం అంటూ ఉండదు. బీజేపీతో పొత్తు మాత్రమే ఉంటుంది. వారు మా పాలనలో పాల్గొనరు. ఢిల్లీకి ప్రధాని మోదీ, తమిళనాడుకు ఎడప్పాడి పళని స్వామి’’ అని చెప్పారు.
ఈ వైఖరి బీజేపీ మాట్లాడుతున్న దానికి కాస్త భిన్నంగా ఉంది. బీజేపీ నాయకుడు నైనార్ నాగేంద్రన్ వంటి వ్యక్తులు తమిళనాడులో ఏఐడీఎంకే ప్రధాన మిత్రపక్షంగా ఎన్డీఏ ఉంటుందంటున్నారు.
ద్రవిడ పార్టీలు..
సంకీర్ణ అంశంపై అన్నాడీఎంకే, బీజేపీల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను రాజకీయ పరిశీలకులలో ఆసక్తిని రేకేత్తించాయి. బీజేపీకి ఏదైన రాజకీయ ప్రయోజనం కల్పించడంపై ఆయన పార్టీలోని ఆందోళనలను ఈపీఎస్ ప్రకటన ప్రతిబింబిస్తుందని వారు విశ్లేషిస్తున్నారు.
‘‘ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే లు సంకీర్ణ ప్రభుత్వ భావనను ప్రాథమికంగా తిరస్కరించాయి. ఎన్నికల తరువాత అధికార పంపిణీ ఏర్పాట్లు నిర్ణయించబడతాయని అమిత్ షా స్పష్టం చేసినప్పటికీ ఈపీఎస్ మాత్రం దృఢ వైఖరితో కొనసాగుతున్నారు.’’ అని సీనియర్ జర్నలిస్ట్ టీ రామకృష్ణన్ వ్యాఖ్యానించారు.
‘‘తమిళనాడులో అన్నాడీఎంకే తప్ప మిగతా పార్టీలు కూడా ఉన్న ఎన్డీఏ గెలిస్తే 2026 ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని షా ప్రకటించారు’’ అని ఆయన గుర్తు చేశారు.
సమాఖ్య సమస్యలు..
మే 2న చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. వచ్చే ఏడాది అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈపీఎస్ పార్టీ కార్యకర్తలకు చెబుతున్నారు.
మరో వైపు ఏఐడీఎంకే జాతీయ విద్యా విధానం 2020 తో సహ అనే సమాఖ్య విధానాలకు వ్యతిరేకంగా తన నిరసన గళం విప్పింది. వక్ఫ్ చట్టాన్ని కూడా ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది మైనారిటీ హక్కులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
Next Story