కేరళ బ్యాంకు కుంభకోణం కేసులో అధికార సీపీఎమ్ నాయకులపై కేసు
x

కేరళ బ్యాంకు కుంభకోణం కేసులో అధికార సీపీఎమ్ నాయకులపై కేసు

పేదల పార్టీగా చెప్పుకునే సీపీఎం, కేరళలోని కరవనన్నూర్ బ్యాంక్ కుంభ కోణం కేసులో వంద కోట్లను దారి మళ్లించిందని దర్యాప్తు సంస్థ కోర్టుకు నివేదించింది.


ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ కేరళలోని కరవనూర్ బ్యాంక్ స్కామ్ లో తన మొదటి అడుగు వేసింది. త్రిస్సూర్ జిల్లా సీపీఎం కార్యదర్శి ఎంఎం వర్గీస్ పేరుపై ఉన్న ఆస్థిని అటాచ్ చేసింది. వర్గీస్, కరువన్నూర్ కో ఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణంలో సంబంధించి మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ నేరం చేసి సంపాదించిన రూ. 60 లక్షల రూపాయాలతో ప్రస్తుతం అటాచ్డ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. ఇందులో అతడి ఇంటిని సైతం జప్తు చేసింది. ప్రత్యేక కోర్టు లో చార్జీషీట్ నమోదు చేసినప్పుడు సీపీఎం ను కూడా ఈడీ నిందితుడిగా నమోదు చేసింది.

ఈడీ ఆరోపణలు
కరువనూరు సహకార బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితులు జరిపిన మనీలాండరింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్రంలోని పొరతుస్సేరిలో ఆస్తులను కొనుగోలు చేసిందని ఈడీ అభియోగాలు మోపింది. నిందితులు, బ్యాంకు అధికారులతో కుమ్మక్కయ్యి, నకిలీ రుణాలు మంజూరు చేస్తూ డిపాజిట్ నిధులపై ఎర్రజెండా పాతారు.
ఒకే ఆస్తిపై అనేక బోగస్ రుణాలు పదేపదే మంజూరు చేయించుకున్నారు. బ్యాంకు సభ్యులు కాని వ్యక్తులకు బినామీ రుణాలు మంజూరు చేశారు. ఆస్తి విలువలు తక్కువగా ఉన్నప్పటికీ వాటికి రుణాలు మంజూరు చేసి బ్యాంకును లూటీ చేశారు. ఆ తరువాత వీటిని మనీలాండరింగ్ చేశారు.
నిందితుల అరెస్ట్
మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద ఈడీ అరెస్టులు చేసింది. వీరిలో మనీ లెండర్ కు పాల్పడిన ప్రధాన నిందితుడు సతీష్ కుమార్ కూడా ఉన్నారు. వీరితో పాటు త్రిపూర్ కు చెందిన కలెక్షన్ ఏజెంట్ పీపీ కిరణ్, వడక్కంచెరి మున్సిపాలిటికి చెందిన సీపీఎం కౌన్సిలర్ పీఆర్ అరవిందాక్షన్, బ్యాంకు అకౌంటెంట్ సీకే జిల్స్ ఉన్నారు. వీరందరికి సీపీఎం పార్టీతో సంబంధాలు ఉన్నాయని, అంతిమ లబ్ధి ఆ పార్టే పొందిందని ఈడీ గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఈడీ ఎంఎం వర్గీస్, మాజీ మంత్రి ఏసీ మొయిదీన్, పార్టీ నేతలు పీకే బిజు, ఎంకే కన్నన్‌లను విచారించింది.
ఆప్ తర్వాత సీపీఐ(ఎం)
దర్యాప్తు సంస్థ ఒక రాజకీయ పార్టీని ఒక కేసులో నిందితుడిగా పేర్కొనడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు మార్చి 2024లో ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అతడి పార్టీ ఆమ్ ఆద్మీపై కేసు నమోదు చేసింది. ఇది భారతీయ న్యాయశాస్త్ర చరిత్రలో ఒక సంచలనంగా చెప్పవచ్చు.
స్కాం ఎన్నికల పై ప్రభావం..
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ మాట్లాడుతూ.. కరువనూరు బ్యాంకు కుంభకోణం వెనుక రాజకీయ కక్ష్యలు ఉన్నాయని, ఈడీ ఉద్దేశ్యపూర్వకంగా పార్టీని టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. సీపీఐ(ఎం) ఈ సమస్యను న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటుందని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే వ్యూహంలో భాగమే గోవిందన్ విమర్శిస్తున్నారు.
కరువన్నూర్ బ్యాంకు కుంభకోణం ప్రధాన ఎన్నికల సమస్యగా మారింది, ముఖ్యంగా 2024 లోక్‌సభ ఎన్నికలలో BJP గెలవడానికి కారణం అయింది. ఇక్కడ నుంచి గెలిచిన సురేష్ కేంద్రమంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నాడు.
ప్రకంపనలు రేపుతున్న కేసు
వేలాది మంది సామాన్య ప్రజల డిపాజిట్లను సీపీఎం తప్పుడు రుణాలతో ఎర్రజెండా పాతిందని, వాటితో పార్టీ ఆస్తులు సమకూర్చుకుందని బాగా ప్రచారం జరిగింది. వీటికి తోడు ఇచ్చిన హమీల అమలులో వైఫల్యం కారణంగా ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 18 సీట్లలో గెలుపొందింది. సీపీఎం నేతృత్వంలోని ఎల్ డీ ఎఫ్ కేవలం ఒక్క సీటు, బీజేపీ మరో సీట్ ను గెలుచుకుంది.
2010లో ప్రారంభమైన త్రిస్సూర్‌కు చెందిన కరువన్నూర్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో జరిగిన మోసాలపై మీడియా 2021 నుంచి వరుసగా కథనాలు ప్రచురించింది.దీనిపై కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు 16 ఎఫ్ఐఆర్ నమోదు చేశాక కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంట్రీ ఇచ్చాయి. అంతకుముందే రాష్ట్రానికి చెందిన రిజిస్ట్రార్ 2022 లో ఆడిట్ చేసిన తరువాత దాదాపు రూ. 100 కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు తేల్చింది.
సీపీఐ(ఎం) రహస్య ఖాతాలు?

సీపీఐ(ఎం) బినామీ నిధులను వినియోగించుకునేందుకు ‘రహస్య ఖాతాలు’ నిర్వహిస్తోందని ఈడీ కోర్టుకు సమర్పించిన నివేదికలో ఆరోపించింది. అయితే ఎన్నికల ప్రచారంలో వాటిని సీపీఎం పార్టీ ఖండించింది. తన ఎన్నికల అకౌంట్లను బహిర్గతం చేసింది. ఈడీ తనపై రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తోందని విమర్శించింది.
కేరళ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం, కేరళలోని అనేక సహకార సంఘాల్లోని ప్రజలకు అక్రమ రుణాలు మంజూరు చేయడంలో నిమగ్నమై ఉన్నాయని, తద్వారా బ్యాంకింగ్ నిబంధనల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ED ఆరోపించింది. ఈ కుంభకోణం రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌కు తెలిసి ఉండవచ్చని, ఆడిట్ కాపీని రిజిస్ట్రార్‌కు అది పూర్తయిన సమయంలోనే అందజేసి ఉంటుందని ED వాదించింది. ఈ మోసపూరిత కార్యకలాపాలలో రిజిస్ట్రార్ కార్యాలయానికి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిందని ఈడీ తెలిపింది.
షాడోల నిర్ణయం..
ఈ సహకార సంఘాల్లోని కీలక నిర్ణయాధికారులను రాజకీయంగా ప్రభావవంతమైన వ్యక్తులు వారి సహచరులు అని ED అఫిడవిట్ లో పేర్కొంది. చాలా సహకార సంఘాలు సీపీఎం ఆధీనంలో నే ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డైరెక్టర్ల పదవులను సీపీఎం నాయకత్వం వహిస్తోందని ఈడీ వెల్లడించింది. ఈ రాజకీయ ప్రభావం వల్ల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగాయని తెలిపింది. డిపాజిటర్ నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి బ్యాంకింగ్ నిబంధనలు మార్చాలని దర్యాప్తు సంస్థ పేర్కొంది. అయితే సీపీఎం పార్టీ దీనిని ఖండించింది. అమిత్ షా మంత్రి అయ్యాక ఈ విషయం మరింత ముదిరిందని, తమను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
Read More
Next Story