బెంగళూర్ లో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి: డచ్ నివేదిక
x

బెంగళూర్ లో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి: డచ్ నివేదిక

తిరస్కరించిన బెంగళూర్ పోలీసులు


ఇటీవల విడుదలైన ఓ నివేదిక భారత్ లోని బెంగళూర్ ను ట్రాఫిక్ పరంగా ప్రపంచంలోనే అత్యధికంగా నెమ్మదిగా కదులుతున్న మూడో నగరంగా ప్రకటించారు. ఈ టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ను బెంగళూర్ పోలీసులు తిరస్కరించారు. డచ్ లోకేషన్ టెక్నాలజీ సంస్థ అయిన టామ్ టామ్ ఇండెక్స్ 2024 ప్రకారం ఈ సర్వే చేసింది.

బెంగళూర్ లో సగటున 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి దాదాపు 34 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుందని తేల్చింది. అదే దూరాన్ని ఇంతకుముందు సంవత్సరం అంటే 2023 నవంబర్ డేటాతో పోల్చినప్పుడు కేవలం 28 నిమిషాల 10 సెకన్ల సమయం తీసుకునేదని వెల్లడించారు. ఈ సర్వేలో బెంగళూర్ మూడు స్థానాలు దిగజారీ ఆరు నుంచి మూడో ర్యాంకుకు పడిపోయింది.

ఇవి నిజం కాదు: బెంగళూర్ పోలీసులు
టామ్ టామ్ నివేదికను బెంగళూర్ ట్రాఫిక్ పోలీసులు తిరస్కరించారు. ‘‘ మేము దానికి ఎటువంటి విలువను ఇవ్వట్లేదు. ఇవి నిజం కాదని అని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎంఎన్ చేత్ ’’ అన్నారు. మరో ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ.. నివేదికలోని వాస్తవితను కూడా ప్రశ్నించారు.
ఇంతకుముందు ఇలాగే సంస్థ బెంగళూర్ ను 64 స్థానంలో పెట్టిందని అన్నారు. సర్వే కోసం ఉపయోగించిన పారామీటర్లు, ఎటువంటి వాహనాలను తీసుకున్నారు. ఏ రోడ్లపై సర్వే నిర్వహించారు. ఎప్పుడు చేశారనే దానిపై స్పష్టత లేదని అన్నారు.
బెంగళూర్ లో ట్రాఫిక్ బాగానే ఉందని, వాహనం చెడిపోవడం, తాత్కాలికంగా ఏదైన రోడ్ ను డైవర్షన్ తీసుకోవడం వంటి వాటి వల్ల కాకుండా సాఫీగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. అలాగే పగలు, రాత్రి కూడా వాహానాల వేగం మారుతుందని పేర్కొన్నారు.
అటువంటి వాటిని కలపకుండా సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. సర్వే చేసిన నివేదిక స్పష్టమైన విషయాలు ఉండాలన్నారు. ట్రాఫిక్ విభాగానికి చెందిన కొన్ని నివేదికల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లపై వాహనాల వేగం పెరిగినట్లు చూపిస్తున్నాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్న మాట.


Read More
Next Story