ఎక్కువ మంది టూరిస్టులు వెళ్లే ప్రదేశం ఏంటో తెలుసా?
x

ఎక్కువ మంది టూరిస్టులు వెళ్లే ప్రదేశం ఏంటో తెలుసా?

11 కోట్ల మంది దేశీయ టూరిస్టులను ఆకర్షించిన వారణాసి


దేశంలోని యువతలో క్రమంగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కోవిడ్ సంక్షోభం తరువాత దేశంలో దేశీయ పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది ఎక్కువ ఆధ్యాత్మిక ప్రదేశాలలో కావడం గమనార్హం.

బెంగళూర్ లో జరిగిన 55 వ ఫెడరేషల్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వార్షిక సమావేశంలో అతిపెద్ద చర్చనీయాంశమైన అంశాలలో ఇది ఒకటి.

‘‘ఫ్యూచర్ స్కేప్ 2047: రిఫైనింగ్ హస్పిటాలిటీ ఫర్ న్యూ ఇండియా’’ అనే థీమ్ తో జరిగిన ఈ కార్యక్రమంలో హోటల్లు, పరిశ్రమల నాయకుల, విధాన నిర్ణేతలు సహ వేయి మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

భారత ఆతిథ్య భవిష్యత్ డిమాండ్ గురించి ఇందులో చర్చించారు. వాస్తవానికి రెండు, మూడో స్థాయి పట్టణాలలో పెరుగుతున్న డిమాండ్ తీర్చడానికి ఆతిథ్య స్థాయి పరిశ్రమలు తన వ్యూహాన్ని మార్చుకోవాలని చాలామంది నాయకులు అభిప్రాయపడ్డారు.




ముందు వరుసలో వారణాసి..
దేశీయ పర్యాటక రంగంలో ఏది ముందంజలో ఉంది.? గోవానా, కాశీనా.. గణాంకాల ప్రకారం చూస్తే ఇది చాలా సులువైన ప్రశ్న. ఎందుకంటే గోవాకు గడచిన ఏడాది కోటిమంది పర్యాటకులు వస్తే.. వారణాసికి ఏకంగా 11 కోట్ల మంది వచ్చారు.
ఈ కథ ఇక్కడితో ముగియలేదు. అయోధ్య, తిరుపతి, ప్రయాగ్ రాజ్, వారణాసి, పూరీ, అజ్మీర్ వంటి తీర్థయాత్రల ప్రదేశాలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇందులో ఎక్కువగా యువతే ముందువరుసలో ఉంటున్నారు. ఈ ధోరణి తీర్థయాత్ర ప్రదేశాలకే కాదు.. ఆరోగ్యం, యోగా, ధ్యానం వంటి గమ్యస్థానాలకు సైతం యువత ప్రయాణాలు సాగిస్తున్నారు.
హోటాలివేట్ మేనేజింగ్ పార్టనర్ అచిన్ ఖన్నా చేసిన ప్రజేంటేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. దేశవ్యాప్తంగా 50 ఆధ్యాత్మిక గమ్యస్థానాలను ఇది జాబితా చేసింది. ఇందులో ఎక్కువగా భారతీయ పర్యాటకుల ఆధ్యాత్మిక ఆసక్తిని ప్రతిబింబింది.
అగోడా పరిశోధనలలో తిరుమల అగ్రస్థానం..
ఈ కార్యక్రమంలో జరిగిన చర్చ సందర్భంగా అగోడా కంట్రీ డైరెక్టర్ గౌరవ్ మాలిక్ ప్రేక్షకులను ఓ ప్రశ్న అడిగారు. వారి ప్లాట్ ఫాంలో ఈ మధ్య ఎక్కువగా ఏ భారతీయ పట్టణం లేదా నగరం ఎక్కువగా కనిపిస్తుందని అడిగారు. బెంగళూర్, ఆగ్రా, గువాహాటి వంటి పేర్లను ప్రేక్షకులు చెప్పారు. కానీ ఆయన మాత్రం ఇవేవి కాదని, ఆంధ్రప్రదేశ్ లోని టెంపుల్ సిటీ తిరుపతి అని చెప్పారు.
‘‘మా దగ్గర సరైన డేటా, ఇతర వివరాలు లేవు. కానీ మా పరిశోధనల ప్రకారం.. తిరుపతి మొదటి స్థానంలో ఉండగా, డార్జిలింగ్ రెండో స్థానంలో ఉంది’’ అని మాలిక్ అన్నారు.
2025 ప్రారంభంలో కూడా అగోడాకు సంబంధించి ఇదే ధోరణిని సూచించాయి. సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ముఖ్యమైన గమ్యస్థానాలపై ఆసక్తి ఉన్న దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.
జెన్ జెడ్ మతపరమైన వారు కాకవపోచ్చు. కానీ వారు విభిన్నమైన అనుభవాలను కోరుకుంటున్నారని , ఈ ధోరణులు మార్పును సూచిస్తున్నాయని అనేకమంది అభిప్రాయపడ్డారు.
మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, మంచి అనుభవాల కోసం దేశీయ పర్యాటకులు చూస్తున్నారని ఇదే పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు.
కర్ణాటక పొడవైన తీరం..
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం మూడురోజుల ఎఫ్ హెచ్ఆర్ఏఐ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక అతిథ్య రంగాన్ని ప్రొత్సహించే లక్ష్యంతో విధానాలు ప్రకటించారు.
కర్ణాటకకు 320 కిలోమీటర్ల పొడవైన తీరం ఉందని, రాష్ట్రంలో కోస్టల్ టూరిజం పాలసీ తీసుకొస్తుందని, దీనికి రూ.200 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన చెప్పారు.
గ్రామీణ, వారసత్వ సంపద కలిగిన ప్రాంతాలలో కమ్యూనిటీ ఆధారిత ఆతిథ్యాన్ని ప్రోత్సహించడానికి ‘హోమ్ స్టే పాలసీ’ ఉందన్నారు. కర్ణాటకలో వసతులను విస్తరించడానికి ఇటీవల సంవత్సరాలలో 54 కొత్త హోటళ్లు, రిసార్ట్ లను కూడా ప్రారంభించింది.
కర్ణాటకలో పర్యాటక రంగం బలమైన వృద్దిని సిద్ధరామయ్య హైలైట్ చేశారు. 2024 లో దేశీయ పర్యాటకుల సంఖ్య 30.46 కోట్లకు చేరుకుందని, ఇది గత సంవత్సరం కంటే 56 శాతం ఎక్కువని ఆయన పేర్కొన్నారు. ఈ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.25 వేల కోట్లను అందించిందని, 4 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించింది.
ప్రస్తుతం వేయి మంది యువతకు ఇప్పటికే టూరిస్ట్ గైడ్ లుగా శిక్షణ ఇవ్వగా, 2026 నాటికి 50 వేల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని,వారిని రాష్ట్ర పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి ప్రకటించారు.
గడగ్, మాండ్యలకు పెద్ద ఊపు..
జాతీయా మార్కెట్ లో దాదాపు 15 శాతం వాటా కలిగిన ఎంఐసీఈ కు బెంగళూర్ ప్రీమియం కేంద్రంగా మారడాన్ని ఆయన గుర్తు చేశారు.
గడగ్, హసన్, మాండ్యాలలో పర్యాటక ప్రాజెక్ట్ లు ప్రారంభించబడుతున్నాయి. అంజనాద్రి కొండలు, సౌందట్టి ఎల్లమ్మ వంటి పుణ్యక్షేత్రాలు చురుకుగా అభివృద్ది చెందుతున్నాయి. లక్కుండి, ఐహోల్ వంటి వారసత్వ ప్రదేశాలలో అవకాశాలను అన్వేషించడానికి రాష్ట్రం ప్రభుత్వం ఎఫ్ హెచ్ఆర్ఏఐని ఆహ్వానించింది.
ఈ కార్యక్రమంలో కేంద్రపర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరాలలో భారత దేశ ఆతిథ్య రంగం 20 శాతం వృద్దికి సిద్దంగా ఉందని, దేశ విస్తృత ఆర్థిక విస్తరణలో దాని పాత్రను కీలకంగా మార్చుకోబోతోందని అన్నారు.


Read More
Next Story