‘‘ చేప.. చేప.. నువ్వేందుకు కల్తీ అయ్యావ్’’
మన దేశంలో చేపలు తినడంలో కేరళీయులు ప్రథమ స్థానంలో ఉన్నారు. అయితే వారు నిత్యం తినే చేపల్లో విపరీతంగా కల్తీ జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
(శ్రీనివాస ప్రసాద్)
దేవభూమి కేరళ.. ఆహ్లదకరమైన వాతావరణం.. అందమైన ప్రదేశాలకే కాదు.. రుచికరమైన చేపల వంటకాలకు ప్రసిద్ది.. మలయాళీలకు ప్రతిరోజు భోజనంలో చేపల ముక్కలు ఉండాల్సిందే. అక్కడి పర్యాటకులు కూడా అక్కడి చేపలు పులుసును బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే రాష్ట్రంలో అవసరమైన డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్ నుంచి చేపలను దిగుమతి చేసుకుంటున్నారు.
రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సాజీ చెరియన్ ప్రకారం.. రాష్ట్రంలో రోజువారీ అవసరాలకు 2,281 టన్నుల చేపలు అవసరం. అయితే రాష్ట్రంలో దాదాపు 24 శాతం చేపల కొరత ఉంది. ఈ డిమాండ్ ను పూడ్చడానికి ప్రతి రోజు వివిధ రాష్ట్రాల నుంచి 539 టన్నుల చేపలను దిగుమతి చేసుకుంటున్నారు. చేపలు దూర ప్రాంతాల నుంచి రావడంతో అవి పాడవకుండా ఉండటానికి రసాయనాలు ఉపయోగిస్తున్నారు.
మీరు కేరళ వెళ్లిన సమయంలో మీ విస్తరిలో వడ్డించే చేపల కూరలో ప్రసిద్ధ మలయాళీ మసాలా దినుసులే కాకుండా అమ్మోనియా, ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలు ఉన్నాయని గుర్తుంచుకోండి.
రుచికరమైన భోజనంలో..
సాధారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే చేపల పాడవకుండా ఉండటానికి అమ్మోనియా, ఫార్మాల్డిహైడ్ ను ఉపయోగిస్తారు. అమ్మోనియం.. మంచు కరగడాన్ని నిదానం చేస్తుంది. కానీ వీటిలో ఉన్న చేపలను తింటే నోటి, కడుపుపూతకు కారణమవుతుంది. పార్మాల్డిహైడ్ వల్ల కండరాల సమస్యలు, క్యాన్సర్, ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. దీనిని శవాలు కుళ్లిపోకుండా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ రసాయనాన్ని చేపల కోసం వాడుతున్నారు.
‘‘ చేపలలో విపరీతంగా కలుషితం జరుగుతోంది. కేరళ ప్రజలకు ఇది ఎంతలా హనీ చేస్తుందో తెలియాలంటే మాత్రం ఎపిడెమియోలాజికల్ సర్వే అవసరం’’ అని గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(తిరువనంతపురం) ప్రిన్సిపాల్ డా. కేశవన్ రాజశేఖరన్ నాయర్ ది ఫెడరల్ తో అన్నారు. అయితే ప్రజలకు ఇవి ఎంతమేరకు హనీ చేశాయో కనిపెట్టడం చాలా కష్టమైన అభిప్రాయపడ్డారు.
కేరళలో మంచి చేపల ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఎక్కువగా కోస్టల్ ప్రాంతాలు ఉత్తమం. అవి నేరుగా సముద్రం నుంచి తీసుకొస్తారు కాబట్టి అవి ఆరోగ్యకరంగా ఉంటాయి. లేదా బ్యాక్ వాటర్ లలో దొరికే ఆహార పదార్థాలను సురక్షితంగా చెప్పవచ్చు.
టెస్ట్ కిట్ లు..
కెమికల్ కలిసిన చేపలను గుర్తించడానికి కేరళ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ కిట్ లను ప్రచారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ కిట్ లను ఉపయోగించడానికి కేవలం రూ. 2 మాత్రమే ఖర్చు అవుతుంది. కొచ్చికి చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (CIFT) ఐదేళ్ల క్రితం ఈ కిట్ లను అభివృద్ధి చేశారు. చేపలపై ఉంచిన కిట్‌లోని తెల్లటి కాగితపు స్ట్రిప్ ఫార్మాల్డిహైడ్ ఉన్నట్లయితే 30 సెకన్లలో నీలం రంగులోకి మారుతుంది. అమ్మోనియా ఉంటే ఆకుపచ్చ లేదా నీలం రంగుకు రెండు నిమిషాల్లో మారుతుంది.
'CIFTest కిట్‌లను' ప్రస్తుతం ఆహార భద్రత అధికారులు నమూనాలపై యాదృచ్ఛిక పరీక్షల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు . కానీ వినియోగదారులకు ఈ కిట్ ల గురించి పెద్దగా తెలియదు. కొద్దిమందికి తెలిసిన ఈ కిట్ లు ఎక్కడ లభిస్తాయో తెలియదు. CIFT ఐదేళ్ల క్రితం కిట్ లను సాంకేతికతను ముంబై లోని ఓ ఔషధ కంపెనీకి బదిలీ చేసింది. ప్రస్తుతం దాని గడువు ముగిసింది. ప్రస్తుతం వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తిని ప్రారంభించవచ్చు.
భారత్ లో ఆహార భద్రత అంటే కేరళనే.. అయినప్పటికీ..
దేశంలో ఆహారభద్రత అంటే కేరళనే అని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకారం.. 2022 నుంచి ఆహార భద్రత విషయంలో దేశంలోనే కేరళ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర ఫుడ్ సేప్టీ అధికారులు తరుచుగా చేపల రవాణాపై దాడులు చేస్తున్న, చాలా తక్కువభాగం మాత్రమే పట్టుబడుతున్నాయి.
చేపల విషయంలో కేవలం కేరళకు వచ్చేవే కాదు.. అన్ని రాష్ట్రాలకు రవాణా అవుతున్న వాటిలో అమ్మోనియం, ఫార్మాల్డిహైడ్ వాడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం.
"వాష్ చేయడం, వంట చేయడం వలన కాలుష్యం స్థాయిలు తగ్గుతాయి కానీ కాలుష్యం ప్రభావం పూర్తిగా తోసిపుచ్చలేము. వంట నుంచి వచ్చే వేడి ఈ రసాయనాలను మరింత హానికరమైన పదార్థాలుగా మారుస్తుంది" అని CIFT డైరెక్టర్ డాక్టర్ జార్జ్ నినాన్ ది ఫెడరల్‌తో అన్నారు .
చేపలు ఎక్కువగా తినేది మలయాళీలే..
దేశంలో ముఖ్యంగా కేరళలో ప్రజల ఆదాయం పెరగడం, చేపల ధరలు తగ్గడంతో ప్రజలు ఎక్కువగా వీటిని తినడానికి ఇష్టపడుతున్నారు. కేరళ ప్రజలు తినే చేపల సగటు ప్రపంచ సగటును సైతం మించిపోయింది. చేపలు తినడం వల్ల మంచి ఆరోగ్యం సమకూరుతుందనే అవగాహన ఉండటం వల్ల వీటి వినియోగం పెరిగింది. 2005 -2022 వరకూ దేశంలో చేపల ఉత్పత్తి రెండింతలు పెరిగాయి. ప్రస్తుతం వీటి ఉత్పత్తి 142 లక్షల టన్నులు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో ఆక్వా కల్చర్ విపరీతంగా సాగు చేస్తున్నారు. దాదాపు సగం చేపలు ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నారు. కేరళలో మాత్రం చేపల పెంపకం బాగా తగ్గిపోయింది.
ఆక్వాటిక్ రీసెర్చ్‌లో గ్లోబల్ లీడర్ అయిన వరల్డ్ ఫిష్ ఫిబ్రవరి 2024 అధ్యయనం ప్రకారం, కేరళలో 97.35 శాతం మంది ప్రజలు చేపలను తింటారు. (జాతీయ సగటు 72.1 శాతంతో పోలిస్తే చాలా ఎక్కువ). ఇందులో 53.5 శాతం కేరళీయులు రోజూ చేపలను తింటారు.
దేశవ్యాప్తంగా రోజువారీ చేపలు తినేవారి సగటు 5.95 శాతం మాత్రమే. కేరళ తలసరి చేపల వినియోగం - సగటున ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి తినే చేపల పరిమాణం - 30 కిలోలు. వరల్డ్ ఫిష్ డేటా ప్రకారం ఇది ఆల్ ఇండియా సగటు 8.89 కిలోల కంటే మూడు రెట్లు, ప్రపంచ సగటు 20.25 కిలోల కంటే ఎక్కువ . ఈ వినియోగం మరింత పెరుగుతుందని సిఎంఎఫ్‌ఆర్‌ఐ చెబుతోంది.
చేపలలో రసాయనాలు కలుస్తున్నాయని విషయంపై షీలా జోసెఫ్ అనే గృహిణి మాట్లాడుతూ.."అవును, రసాయన కాలుష్యం గురించి మాకు తెలుసు" అని ఆమె చెప్పింది. “మేము మలయాళీలం, మలయాళీలు చేపలు లేకుండా ఉండలేరు కదా? నీరు కూడా కలుషితమవుతుంది. నీళ్లు తాగడం మానేస్తారా? మనం చేయగలిగింది ఏమీ లేదు,” అని ఆమె వాదించారు.
పరిష్కారం ఏమిటి?
అయితే ఈ సమస్యను తగ్గించడానికి కేరళ ప్రభుత్వం చేయగలిగినది ఒకటే. అదే.. CIFTest కిట్‌లతో ప్రజలకు అవగాహన కల్పించడం.. అప్రమత్తం చేయడం.. వినియోగదారులు వీటిని ఎందుకు వినియోగించడం లేదని రాష్ట్ర ఆహార భద్రత జాయింట్ కమీషనర్ జాకబ్ థామస్ అడిగిన ప్రశ్నకు, “అవి ప్రజలకు అందుబాటులో లేవు” అని సమాధానం ఇచ్చారు. కాబట్టి, వాటిని అందుబాటులో ఉంచండి.
(రచయిత
బెంగళూరుకు చెందిన జర్నలిస్ట్, అతను 30 ఏళ్లకు పైగా కెరీర్‌లో దక్షిణాది రాష్ట్రాలు మరియు గోవాను కవర్ చేశాడు)
Next Story