ధర్మస్థల: కుమార్తె ఫొటోను విడుదల చేసిన బాధితురాలు
x
సుజాత భట్

ధర్మస్థల: కుమార్తె ఫొటోను విడుదల చేసిన బాధితురాలు

రెండు దశాబ్ధాల క్రితం స్నేహితులతో ధర్మస్థలకు వెళ్లిన అనన్య భట్


విజయ్ జొన్నహల్లి

కర్ణాటక లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన ‘ధర్మస్థల’ సందర్శన సమయంలో తన కుమార్తె అనన్య భట్ కనిపించకుండా పోయిందని ఆరోపించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన బెంగళూర్ కు చెందిన సుజాత భట్, తాజాగా 22 సంవత్సరాల క్రితం (2003) తప్పిపోయిన తన కుమార్తె ఫొటోను విడుదల చేశారు.

ధర్మస్థల ఆలయ పట్టణంలో వందలాది మృతదేహాలను తాను ఖననం చేశానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ‘భీమ’ చేసిన ఆరోపణలతో వివాదం చెలరేగిన నేపథ్యంలో ఇది జరిగింది. భీముడి వాదనలు పెనుదుమారం రేపాయి. అయితే తాజాగా ధర్మస్థలలో తప్పిపోయిన తన కుమార్తె ఫోటోను సుజాత విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
క్లాస్ మేట్స్ తో అనన్య ప్రయాణం..
సుజాత కథనం ప్రకారం.. మణిపాల్ లోని కస్తూర్భా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న తన కుమార్తె అనన్య, తన క్లాస్ మేట్స్ తో ధర్మస్థలకు వెళ్లి కనిపించకుండా పోయింది. ఇప్పుడు తన కుమార్తె అవశేషాలు కూడా ఆ ప్రాంతంలో ఖననం చేసి ఉండవచ్చని బాధితురాలు నమ్ముతోంది.
అయితే చాలా అస్థిరమైన కేసులో సుజాత తప్పుడు వాదనలు చేస్తోందని, పోలీస్ ఫిర్యాదు చేసిన తరువాత దర్యాప్తు అధికారులకు అందుబాటులో లేరని ధర్మస్థల ఆలయ అనుచరులు ఆరోపించారు.
పోలీసులను నిందించిన సుజాత..
ఆ ఆరోపణలకు ప్రతిగా శనివారం సుజాత తన న్యాయవాదీ ద్వారా తన కుమార్తె ఫోటోను చూపించే వీడియోను విడుదల చేశారు. బెల్తాంగడీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడూ పోలీసులు దానిని నమోదు చేయడానికి నిరాకరించడమే కాకుండా తనను తిట్టి పంపించారని సుజాత ఆరోపించింది.
తరువాత తనను అపహరించి హింసించారని కొంతకాలంగా కోమాలో ఉన్నానని ఆమె పేర్కొంది. భీముడి ఆరోపణల తరువాత స్వాధీనం చేసుకున్న అస్థిపంజర అవశేషాలను తనకు అప్పగించాలని, అవి తన కుమార్తె కు చెందినవని అనుమానంగా ఉందని వాటిని తనకు అప్పగించాలని కూడా ఆమె ఫిర్యాదులో అభ్యర్థించింది. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ధర్మస్థల కేసును దర్యాప్తు చేస్తోంది.

ఇప్పటి వరకూ ఈ కేసులో 11 స్థలాలలో సిట్ గుర్తించి, తవ్వకాలు జరిపింది. ఇందులో ఆరు, పదకొండవ స్థలాలలో కొన్ని మానవ అవశేషాలు దొరికాయి. మిగిలిన స్థలాలపై ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ఇవే కాకుండా మరో రెండు చోట్ల స్థలాలో కూడా సిట్ తవ్వకాలు జరుపుతోంది.


Read More
Next Story