Karnataka Politics | ‘పదవి అంగట్లో దొరికే వస్తువు కాదు’
x

Karnataka Politics | ‘పదవి అంగట్లో దొరికే వస్తువు కాదు’

మంత్రి జార్కిహోలిపై డిప్యూటీ సీఎం శివకుమార్ ఆగ్రహం


హీటెడ్ పాలిటిక్స్‌కు కేరాఫ్ కర్ణాటక. పార్టీ నేతల కామెంట్లకు కౌంటర్లు కూడా చాలా షార్ఫ్‌గానే ఉంటాయి. మంత్రి సతీష్ జార్కిహోలి వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే నిప్పులు చెరిగారు.

జార్కిహోలి వ్యాఖ్యలతో..

ఇటీవల మంత్రి జార్కిహోలి(Satish Jarkiholi) ఓ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటక(Karnataka) రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని, పార్టీకి ఎక్కువ సమయం కేటాయించే నాయకుడు అవసరం ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం, కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్(Shivakumar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "మీడియా ముందు మాట్లాడితే పోస్ట్ వచ్చేస్తుందా? పదవి దుకాణంలో వస్తువు కూడా కాదు. కష్టపడి పనిచేస్తే ప్రతిఫలంగా దక్కేది,’’ మండిపడ్డారు.

యూ-టర్న్ తీసుకున్న సతీష్..

బుధవారం రాత్రి పార్టీ అధినాయకత్వం మందలించడంతో జార్కిహోలి యూ టర్న్ తీసుకున్నారు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ‘‘ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు వాస్తవానికి చాలా దూరం. నేను డి.కె. శివకుమార్‌ను మార్చడం గురించి మాట్లాడలేదు. పార్టీ బలపరచడం కోసం కొన్ని సూచనలు చేశాను. అంతే," అని ఫేస్‌బుక్ వీడియో ద్వారా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేతలపై రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బంధారీ (Manjunath Bhandary) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని గట్టిగానే హెచ్చరించారు.

"కేపీసీసీ అధ్యక్షుడు లేదా ముఖ్యమంత్రి(CM) మార్పుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయంలో మంత్రులెవరూ మాట్లాడొద్దని," అని వార్నింగ్ ఇచ్చారు బంధారీ. మీడియా ముందు పార్టీ విషయాలు షేర్ చేసుకోవద్దని స్పష్టం చేశారు. "హైకమాండ్ ఆదేశాలను ఉల్లంఘించే నాయకులు క్రమశిక్షణ లేని సైనికులు," అని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారి వివరాలను అధినాయకత్వం నివేదిక కోరిందని కూడా చెప్పారు.

డిప్యూటీ సీఎం డీకే 2020 నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Read More
Next Story