బెంగళూరులో నిలిచిపోయిన చెత్త సేకరణ వాహనాలు..
x

బెంగళూరులో నిలిచిపోయిన చెత్త సేకరణ వాహనాలు..

బయోగ్యాస్ ఉత్పత్తే మార్గమంటున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..


నగరంలో పేరుకుపోయిన చెత్త(Garbage)తో బెంగళూరువాసులు సతమతమవుతున్నారు. ఇటు డంపింగ్ యార్డు వ్యర్థాలతో నిండిపోయింది. దీంతో గత మూడు రోజులుగా మహాదేవపురలో చెత్త సేకరణ వాహనాలు నిలిచిపోయాయి.

‘‘నగరంలో చెత్తను పూర్తిగా తొలగించడం లేదు. సమస్య బాగా పెరిగిపోయింది,’’ అని శాసనమండలిలో ఎంఎల్సీ ఎం.నాగరాజు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం, బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి డీకే శివకుమార్ (D K Shivakumar) సమాధానమిచ్చారు.

"ఈ సమస్య గురించి నేను కూడా కొన్ని వార్తా ఛానళ్లలో చూశాను. ఇక్కడ ఒక పెద్ద మాఫియా నడుస్తుంది. చెత్త రవాణా కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యారు. వారు 85 శాతం ఎక్కువగా కోట్ చేశారు. ఇప్పుడు వారే కోర్టుకు వెళ్లి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారు,’’అని పేర్కొన్నారు.

"మా బెంగళూరు ఎమ్మెల్యేలు మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అందులో అన్ని పార్టీల వారున్నారు. నేను వారి పేర్లు చెప్పను. రూ.800 కోట్లు అభివృద్ధి నిధులు కావాలంటున్నారు. చెత్తను నగరానికి సుమారం 50 కి.మీ బయట తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది. కోలార్, నేలమంగళ, కనకపుర రోడ్‌లో 100 ఎకరాల సేకరణకు ఎమ్మెల్యేలు సహకరించాలి. ప్రభుత్వమే ఆ భూమిని కొంటుంది. సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇప్పటికే చెత్తను డిస్పోస్ చేయడానికి నైస్ రోడ్డు (NICE) ప్రాజెక్ట్ పరిధిలోని భూభాగం, దొడ్డబళ్లాపురం ప్రాంతాలను గుర్తించాం.’’ అని డీకే సమాధానమిచ్చారు.

అదే ఏకైక మార్గం..

"నేను హైదరాబాద్, చెన్నై వెళ్లి చూశాను. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం అక్కడ సాధ్యం కాలేదు. ప్రస్తుతం చెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తి చేయడమే ఏకైక మార్గం," అని శివకుమార్ చెప్పారు.

Read More
Next Story