డిజిటర్ అరెస్ట్ పేరిట రెండు కోట్లు కొట్టేసిన సైబర్ నేరస్థులు
x

డిజిటర్ అరెస్ట్ పేరిట రెండు కోట్లు కొట్టేసిన సైబర్ నేరస్థులు

ఆస్తులు అమ్మివేయించిన కేటుగాళ్లు, డబ్బులు రావాలంటే స్థానిక పోలీసుల దగ్గరకు వెళ్లాలని సూచన


బెంగళూర్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ ను సైబర్ మోసగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’’ స్కామ్ లో ఇరికించి, వారి డిమాండ్లను తీర్చడానికి ప్లాట్, రెండు నివాస ప్లాట్ లను విక్రయించడంతో దాదాపు రెండు కోట్లు మోసపోయిందని జాతీయ మీడియా తెలిపింది.

డిజిటల్ స్కామ్ లో..
బెంగళూర్ లోని విజ్ఞాన్ నగర్ లోని ఒక ప్లాట్లో తన పదేళ్ల కుమారుడితో కలిసి నివసిస్తున్న ఒక మహిళా టేకీ సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈ బాధిత మహిళకు జూన్ లో కొరియర్ కంపెనీ అధికారిగా నటిస్తూ ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని తెలుస్తోంది.
తన ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన అనుమానాస్పద ప్యాకేజీని అడ్డగించినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఆమె కాల్ ను ముంబైలోని మరో అధికారుల బృందానికి బదిలీ చేసినట్లు నటించారు.
వారు ఆమెను అరెస్ట్ చేస్తామని బెదిరించారు. వారు చెప్పిన ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసే వరకూ ఆమె ఇంటిని వదిలి వెళ్లవద్దని ఆదేశించారు. స్కామర్లు ఆమెకు ఒక నిర్దిష్ట మొబైల్ అప్లికేషన్ ను ఇన్ స్టాల్ చేయమని చెప్పారని, ఆమె సహకరించకపోతే ఆమె కొడుకు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని బెదిరించారని తెలుస్తోంది.
రెండు కోట్లు కొట్టేశారు..
తన బిడ్డ భద్రతకు భయపడి, ఆమె వారి సూచనలు అమలు చేసింది. ఆమె మలూర్ లోని రెండు ప్లాట్ లను తక్కువ ధరకే అమ్మేసింది. తరువాత విజ్ఞాన్ నగర్ లో తనకున్న ప్లాట్ ను కూడా తక్కువకే విక్రయించింది.
ఈ అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని మోసగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. తరువాత మిగిలిన మొత్తాలను బ్యాంకు రుణం తీసుకుని కూడా అందించింది. ఇలా మొత్తంగా రూ. 2 కోట్లు కోల్పోయింది.
చివరికి మోసగాళ్లు ఆమె డబ్బులు తిరిగి తీసుకోవాలంటే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు రావాలని సూచించి కాల్ ముగించారు. తరువాత వారి నెంబర్లు స్విచ్ ఆఫ్ చేశారు. చివరగా ఆ బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Read More
Next Story