కేరళలో సీపీఐ(ఎం) ఇంటింటి ప్రచారం ఎందుకు?
x

కేరళలో సీపీఐ(ఎం) ఇంటింటి ప్రచారం ఎందుకు?

‘గృహ సంపర్కం’ కార్యక్రమంలో ప్రజలతో వాదనలొద్దు. వారు మాట్లాడేటప్పడు అడ్డు చెప్పొద్దు. విమర్శించినా సహనం వహించాలి - కార్యకర్తలకు పార్టీ నాయకత్వం సూచన.


Click the Play button to hear this message in audio format

‘‘ఒకప్పుడు నా బూత్ పరిధిలో ప్రతి ఓటరు నాకు తెలుసు. ఇరుగు పొరుగువారి గురించి తెలుసుకుని గర్వపడేవాణ్ణి. వారితో ఉన్న పరిచయాలతో ఎన్నికల్లో గెలుపోటములను ఈజీగా చెప్పేవాళ్లం. కాని పరిస్థితులు మారాయి. ఇప్పుడు అలా చెప్పడం సాధ్యం కాదు.” అని అంటున్నారు కేరళ(Kerala) రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న 61 ఏళ్ల వీఎం ప్రకాశన్.

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆయనకు గట్టి షాక్ ఇచ్చాయి. తన సొంత వార్డులో బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి ముందంజలో ఉండగా, యూడీఎఫ్ రెండో స్థానంలో నిలిచింది. CPI(M) మూడో స్థానానికి పరిమితమైంది. 176 ఓట్ల ఆధిక్యంతో గెలుస్తానని అంచనా వేసిన ప్రకాశన్‌కు పూర్తిగా భిన్నమైన ఫలితాలు వచ్చాయి. దీంతో “భూమి మీద నిజంగా ఏం జరుగుతుందో మనకు తెలియడం లేదు” అని నిజాయితీగా ఒప్పుకున్నారు.

ఈ మార్పుల వెనుక కారణాల గురించి ప్రకాశన్ మాట్లాడారు. “కొత్త తరంతో మనకు సంబంధం తెగిపోయిందన్నది నిజం. ఎస్‌ఎఫ్‌ఐ యూనిట్లు ఉన్నా..జనరేషన్ Z ఓటర్లు మనకు అర్థం కావడం లేదు. అపార్ట్‌మెంట్‌ల్లో నివసించే వారితోనూ అదే పరిస్థితి. వారు రాజకీయ నాయకులను లోపలికి అనుమతించడంలేదు. ఇది మన సమస్య మాత్రమే కాదు. కాంగ్రెస్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది” అని అన్నారు.


ఇంటింటి ప్రచారణానికి కారణం ఏమిటి?

పార్టీ్కి, సాధారణ ఓటర్లకు మధ్య దూరం పెరుగుతోంది. ఈ అంతరాన్ని తగ్గించాలని సీపీఐ(ఎం)ను ‘గృహ సంపర్కం’ (ఇంటింటి ప్రచారం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీనియర్ నాయకుల నుంచి అట్టడుగు కార్యకర్తల వరకు జనవరి 25 వరకు కేరళ అంతటా ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడే కార్యక్రమం ఇది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. ఫిబ్రవరి 1 నుంచి మూడు ప్రాంతాల నుంచి ఎంవీ గోవిందన్, బినోయ్ విశ్వం, జోస్ కె. మణి నేతృత్వంలో ఎల్‌డీఎఫ్ ప్రచార యాత్రలు ప్రారంభం కానున్నాయి.


పార్టీ ప్రవర్తనా నియమావళి..

నాయకులు తలుపులు తట్టడం వెనుక పార్టీ రూపొందించిన ప్రవర్తనా నియమావళి కూడా ఉంది. అహంకారం ధోరణి, ఘర్షణాత్మక వైఖరి లేకుండా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని నాయకులకు, కార్యకర్తలకు పార్టీ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలందాయి.


సున్నితమైన అంశాలపై సమాధానాలతో సిద్ధం..

వివాదాస్పద అంశాలపై ఓటర్లు అడిగే ప్రశ్నలకు నాయకులు ఎలా సమాధానం ఇవ్వాలో పార్టీ తర్ఫీదు ఇచ్చింది. శబరిమల బంగారం కేసు గురించి ఎవరైనా అడిగితే.. ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా చెబుతూ.. కేసు హైకోర్టులో ఉందని, పోలీసుల దర్యాప్తు కొనసాతుందని చెప్పాలని పార్టీ సూచించింది.


‘ప్రభుత్వ సర్వే – పార్టీ ప్రచారం మధ్య తేడా ఉంది.’

రూ.20 కోట్లతో ప్రభుత్వం చేపట్టిన ‘న్యూ కేరళ ఇనిషియేటివ్’ సర్వేకు, పార్టీ రాజకీయ ప్రచారానికి మధ్య స్పష్టమైన తేడా ఉందని సీపీఐ(ఎం) పదే పదే చెబుతోంది. సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్తు ప్రణాళికలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి 2031 నాటికి కేరళ రోడ్‌మ్యాప్ రూపొందించడానికేనని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది.

అయితే ప్రతిపక్షాలు దీనిని అంగీకరించడం లేదు. ప్రభుత్వ వనరులు, కార్యక్రమాలు అధికార పార్టీ ప్రచారానికి వినియోగిస్తున్నారని యూడీఎఫ్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ సర్వేలు, పార్టీ తలుపు తట్టడం ఒకేసారి నిర్వహిస్తే ఓటర్లకు అర్థంకాదని ప్రతిపక్షం వాదిస్తోంది. కాగా సీపీఐ(ఎం) నేతలు యూడీఎఫ్ నాయకుల ఆరోపణలను ఖండిస్తున్నారు. పార్టీ ప్రచారం పూర్తిగా పార్టీ నిధులతో మాత్రమే చేపడతామని చెబుతోంది.


‘వాదనలు వద్దు.. వినడం ముఖ్యం..’

ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో ప్రజలతో వాదించవద్దని పార్టీ నాయకులకు ఇప్పటికే అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వారు చెప్పేది వినయంగా, ఓపికగా వినాలని, ముఖ్యంగా కుటుంబానికి తెలిసిన వ్యక్తులను వెంట పెట్టుకు వెళ్లాలని సూచించింది. గేటు వద్ద నిలబడటం కంటే ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా మాట్లాడాలని, ప్రతి కుటుంబ సభ్యుడి మాట వినాలని, ఇంటి యజమానికి గౌరవం ఇవ్వాలని, కుటుంబ నేపథ్యాన్ని అర్థం చేసుకుని సంభాషణలు జరపాలని జాగ్రత్తలు చెప్పింది.

ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై చర్చ ప్రారంభించాలని పార్టీ చెబుతోంది. ఓటమి ఎదురైన ప్రాంతాల్లో ఎందుకు అలా జరిగిందో బహిరంగంగా అడగాలని కోరుతోంది. పార్టీపై ప్రజల అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచమని కోరాలని, వారు మాట్లాడేటప్పడు మధ్యలో అడ్డుతగలొద్దని, విమర్శలను ఎదురుదాడిగా కాకుండా స్వాగతించాలని పార్టీ సూచించింది. పార్టీకి దూరమైన మాజీ కామ్రేడ్‌లతో తిరిగి సంబంధాలు కొనసాగించాలని కూడా సూచించింది.


‘స్పందన బాగుంది.’

ప్రతిపక్షాలు ఈ కార్యక్రమంపై పదే పదే ఆరోపణలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మంచి స్పందన లభిస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. త్రిస్సూర్ జిల్లా కార్యదర్శి, గురువాయూర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కె.వి. అబ్దుల్‌ఖాదర్ మాట్లాడుతూ.. “ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఎక్కువగా స్థానిక సమస్యలే లేవనెత్తుతున్నారు. రాజకీయ అంశాలూ వస్తున్నాయి. సీపీఎం–బీజేపీ ఒప్పందం అనే తప్పుడు ప్రచారం, ప్రధానమంత్రి శ్రీహరి వివాదం, శబరిమల అంశాలపై యూడీఎఫ్ చేస్తున్న తప్పుదారి పట్టించే ప్రచారం గురించి చర్చ జరుగుతోంది. చాలా మందిని రాజకీయంగా ఒప్పించగలుగుతున్నాం” అన్నారు.

పాలక్కాడ్‌లో మాజీ ఎంపీ కృష్ణదాస్ ఎన్ఎన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. “మొదటి రోజే 83 కుటుంబాలను కలిశాం. స్పందన చాలా సానుకూలంగా ఉంది. ప్రజలు బహిరంగంగా మాట్లాడుతున్నారు” అని చెప్పారు.

ప్రకాశన్ లాంటి నేతలకు ‘గృహ సంపర్కం’ కేవలం రాజకీయ ప్రచారం కాదు. ఇది జరిగిన నష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం — ప్రజలతో పరిచయం వాస్తవాల్ని తెలుసుకునే ప్రక్రియలో భాగం. “ముందు ప్రజలే మన కోసం ఎదురు చూశారు. ఇప్పుడు మనమే మళ్లీ తలుపు తట్టడం నేర్చుకుంటున్నాం” అని చెప్పారు.

కేరళలో రాజకీయ పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పార్టీ భావజాలంతో మాత్రమే ఓట్లు పడవని సీపీఐ(ఎం)కు అర్థమైంది. అందుకు ఓటరు విశ్వాసాన్ని చూరగోరాలంటే వారితో వినయంగా మాట్లాడటం, వారు చెప్పింది ఓపికగా వినడం, వారి అనుమానాలను నివృత్తి చేయాలని పార్టీ నిర్ణయించుకుంది.

Read More
Next Story