తమిళనాడు: అసెంబ్లీ ఎన్నికల్లో DMKతోనే పొత్తు
x

తమిళనాడు: అసెంబ్లీ ఎన్నికల్లో DMKతోనే పొత్తు

TVKతో సంప్రదింపులు కేవలం ప్రచారమేనన్న AICC తమిళనాడు, పుదుచ్చేరి ఇన్‌చార్జి గిరిష్ చోదంకర్..


Click the Play button to hear this message in audio format

కాంగ్రెస్(Congress) పార్టీ తమిళనాడు(Tamil Nadu)లో DMKతో ఉన్న పొత్తుకు పూర్తిగా కట్టుబడి ఉందని AICC తమిళనాడు, పుదుచ్చేరి ఇన్‌చార్జి గిరిష్ చోదంకర్ స్పష్టం చేశారు. తమ పార్టీ TVKతో సంప్రదింపులు జరుపుతోందన్న వార్తలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. “TVKతో చర్చలు జరిగాయన్న వార్తల్లో నిజం లేదు. ఇవన్నీ వదంతులే” అని పేర్కొన్నారు. త్వరలో DMKతో సీట్ షేరింగ్‌పై కూడా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. పార్టీలో అంతర్గత క్రమశిక్షణపై కూడా దృష్టి పెట్టామని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీగా TVK ఆవిర్భవించిన నేపథ్యంలో.. కాంగ్రెస్–DMK పొత్తుపై సందేహాలు వ్యక్తమైనప్పటికీ..వాటికి ఆస్కారం లేదని కాంగ్రెస్ నాయకత్వం తేల్చిచెప్పింది. తమిళనాడులో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లో భాగంగా DMKతోనే కలిసి ముందుకెళ్తామని కాంగ్రెస్ మరోసారి స్పష్టం చేసింది.

మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి

Congress firm on DMK alliance for Tamil Nadu polls, denies TVK talks

Read More
Next Story