జన నాయగన్కు కాంగ్రెస్ మద్దతు..
x

'జన నాయగన్'కు కాంగ్రెస్ మద్దతు..

టీవీకే విజయ్‌కి సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్టులు..


Click the Play button to hear this message in audio format

తమిళగ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam) పార్టీ చీఫ్ విజయ్ (Vijay) నటించిన ‘జన నాయగన్‌’ చిత్రం విడుదల జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సెన్సార్‌ బోర్డ్‌ నుంచి ధ్రువీకరణ పత్రం అందని కారణంగా చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు మద్రాస్ హైకోర్టు(Madras High court)ను ఆశ్రయించారు. రేపు కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో విజయ్‌కు కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీబీఎఫ్‌సిని తన గుప్పిట్లో ఉంచుకుని ‘జన నాయగన్‌’ విడుదలను అడ్డుకుంటోందని ఆరోపించారు. కళా రంగానికి రాజకీయాలతో ముడిపెట్టవద్దని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదిక మోదీని కోరారు తమిళనాడు, పుదుచ్చేరి AICC ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్.

మోదీ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆరోపించారు. సీబీఎఫ్‌సీ తీరును కరూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జోతిమణి సెన్నిమలై తప్పబట్టారు. తమిళ చిత్ర పరిశ్రమపై దాడిగా అభివర్ణించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాను అడ్డుకోవడం తగదన్నారు.

ఇటీవల కాంగ్రెస్(Congress) కార్యకర్త ప్రవీణ్ చక్రవర్తి టీవీకే చీఫ్ విజయ్‌ను కలవడం కాంగ్రెస్-టీవీకే మధ్య పొత్తుపై ఊహాగానాలకు బీజం పడింది. “కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలుగా తమిళనాడులో అధికారంలో లేదు. ప్రభుత్వంలో వాటా, అధికారంలో వాటా కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్లు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరైనా డిమాండ్లతో రావొచ్చు. ఎటువంటి సమస్య లేదు. కానీ తుది నిర్ణయం నాయకత్వం తీసుకుంటుంది. నేను విజయ్‌ను కలిశాను. అంతే. దాని గురించి ఇంకేమీ చెప్పనవసరం లేదు. విజయ్ ఒక రాజకీయ శక్తిగా మారాడు. దాన్ని ఎవరూ కాదనలేరు.’’ అని అన్నారు.

Read More
Next Story