తమిళనాడు ఇనుపరాతి యుగపు ఆనవాళ్లు ప్రపంచ చరిత్రను మారుస్తుందా?
x

తమిళనాడు ఇనుపరాతి యుగపు ఆనవాళ్లు ప్రపంచ చరిత్రను మారుస్తుందా?

భారత దేశపు చరిత్ర ఇక రాష్ట్రం నుంచి మొదలవుతుందన్న సీఎం స్టాలిన్


ప్రమీలా కృష్ణన్

ఈ మధ్య తమిళనాడులో లభించిన కొన్నిచారిత్రక ఆనవాళ్ల ప్రకారం దేశంలో ఇనుపరాతి యుగం ఆనవాళ్లు రాష్ట్రంలో 5,300 సంవత్సరాల క్రితం ప్రారంభమైనట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలనాత్మక ప్రకటన చేశారు. ఇది ప్రపంచంలోనే అనేక నాగరికత మూలాలను సవాల్ చేసే అంశం. కఠిన శాస్త్రీయ ఆధారాలతో ఉన్న ఇనుమును కరిగించే సాంకేతికత అన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఎలా ఉద్భవించిందనేదే అసలు ప్రశ్న.

భారత చరిత్ర ఇక నుంచి తమిళనాడు నుంచి ప్రారంభం కావాలని సీఎం స్టాలిన్ మాట. ఆయన కే. రాజన్ అండ్ ఆర్ శివానందం రచించిన ‘ యాంటిక్విటీ ఆఫ్ ఐరన్- రీసెంట్ రేడియోమెట్రిక్ డేట్స్ ఫ్రమ్ తమిళనాడు’’ అనే 73 పేజీల నివేదిక ప్రకారం ఈ ప్రకటన చేశారు.
రేడియో మెట్రిక్ డేటింగ్ టెక్నిక్ ల ఆధారంగా, దేశంలోని పదిమంది నిపుణుల తేల్చిన పరిశోధనల ఆధారంగా తమిళనాడులోని ప్రస్తుతం లభించిన ఆధారాలు ఈ ఇనుము సాంకేతికత 3,345 బీసీఈ కాలం నాటిదని సూచిస్తున్నాయి.
శాస్త్రీయా ఆధారాలు.. కీలక ఫలితాలు..
యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రో మెట్రీ, ఆప్టికల్ స్టిమ్యూలేటేడ్ లువమినిసెన్స్ లను ఉపయోగించి శివగలై, ఆదిచెన్నల్లూర్, మైలదుంపరై, కీల్ సమండి నుంచి సేకరించిన నమునాల నుంచి పరిశోధనలు సాగించి పలు కీలక సాక్ష్యాలు సేకరించారు. ఈ ఫలితాలు దేశంలోని ఇనుపరాతి యుగం కాలక్రమాన్ని మూడు వేల సంవత్సరాల వెనక్కి నెట్టాయి.
నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఇనుపరాతి యుగం ఆనవాళ్లు 1300 బీసీఈ లో అనటోలియాలోని హిట్టైట్ సామ్రాజ్యం తో సంబంధాలు ఉన్నాయి. అయితే తమిళనాడులో దొరికిన తాజా ఆధారాల ప్రకారం.. ఇది బీఫోర్ కామన్ ఏరా మూడు వేల ముందే జరిగిందని తేల్చింది.
ఇది లోహ శాస్త్రం పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా గుర్తించారు. ‘‘ తమిళనాడు లో లభించిన ఆనవాళ్ల ప్రకారం ఇనుము కరిగించిన సాంకేతికత బీఫోర్ కామన్ ఎరా 3,345 నాటిదని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి’’ అని నివేదిక సహ రచయిత కే. రాజన్ అన్నారు.
ఇనుము కరిగించి కళాఖండాలు..
తమిళనాడులోని త్రవ్వకాల్లో మూడు రకాలైన ఇనుము కరిగించే కొలిమిలు బయటపడ్డాయి. ముఖ్యంగా కొడుమన్నాల్, చెట్టిపాళయం, పెరుంగళూర్ లో లభించాయి. ఇందులో ఆధునిక సాంకేతికతలను వాడారు. శిగలపరంబు వంటి శ్మశాన వాటిక కత్తులు, బాణపు తలలు, ఉలి, కత్తులు వంటి ఇనుప కళా ఖండాలు ఉన్న 160 కలశాలు బయటపడ్డాయి.

శివగలైలోని శ్మశాన వాటిక నుంచి ఒక వరి నమూనా 1155 బీఫోర్ కామన్ ఎరా నాటిదని, అక్కడే బొగ్గు, కుండలు, 2953-3345 బీసీఈ నాటివని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇనుము సాంకేతికతకు సంబంధించిన ప్రారంభ సాక్ష్యంగా గుర్తించారు. మైలదుంపరై వద్ద 2172 బీసీఈ నాడు ఇనుము వినియోగాన్ని ధృవీకరించాయి.
ప్రాంతీయ చిక్కులు..
తమిళనాడులో లభించిన ఇనుపరాతి యుగం ఆనవాళ్లు ప్రపంచ ఇనుపరాతి యుగం ఇంతకుముందు పరిశోధనలను సవాల్ చేసింది. లోహశాస్త్రం ఆవిష్కరణలో తమిళనాడు కీలకపాత్ర ను హైలైట్ చేసింది. ముఖ్యంగా ఉత్తర భారతంలోని రాగి యుగం, దక్షిణ భారతంలోని ఇనుప యుగం ఒకే కాలానికి చెందినవిగా పలువురు పరిశోధకులు ప్రతిపాదించారు.
ఏఎస్ఐ మాజీ డైరెక్టర్ జనరల్ రాకేష్ తివారీ మాట్లాడుతూ.. తమిళనాడులో స్వతంత్ర నాగరికత పరిణామం చెందిందని, అలాగే అభివృద్ధి చెందిందని గమనించారు. ఇప్పుడు తేదీలు 3వ సహస్రాబ్ధి బీసీఈకి వస్తాయి. దీనికి బలమైన ఆధారాలు ఉన్నాయి.
తమిళనాడు మెటలర్జీ వారసత్వం..
ఆది చెన్నల్లూర్ వంటి ప్రదేశాలు, తామిరబరణి నదికి సమీపంలో చక్కగా రూపొందించిన సిరామిక్స్, కాంస్య ఆభరణాలతో సహ కళాఖండాలు సంపదను బహిర్గతం చేసింది. కాంస్య జంతుబొమ్మలు, మాతృ దేవత విగ్రహం వంటి ప్రత్యేక ఆవిష్కరణలు తమిళనాడును ప్రారంభ సాంస్కృతిక ఆవిష్కరణలకు కేంద్రంగా నిలబెట్టాయి.
తమిళనాడు ఆర్కియాలజీ కమిషనర్ టీఎన్ ఉదయచంద్రన్, ఆవిష్కరణల శాస్త్రీయ దృఢత్వాన్ని నొక్కి చెప్పారు. ‘‘ మేము అనేక ప్రపంచ ప్రయోగశాలలో కార్బన్ డేటింగ్, ఓఎస్ఎల్ సాంకేతికతలను ఉపయోగించి, ఈ పరిశోధనలను నిర్ధారించాము’’ అన్నారు.
ఇందులో కొన్ని అంశాలు సింధు నాగరికతతో సంబంధం ఉన్నట్లు తేలింది. అక్కడ లభించిన కొన్ని ఆనవాళ్లు తమిళనాడులో లభించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో లభించిన చారిత్రక ఆనవాళ్లలోని వస్తువులపై ఉన్న లిపిని కనిపెట్టిన వాళ్లకు కోట్లాది నగదును బహుమతిగా ఇస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు.


Read More
Next Story