
తమిళనాడులో ‘Assured Pension Scheme’ ప్రారంభం
OPS తరహా భద్రత కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన పథకం..
తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(CM Stalin) ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం Tamil Nadu Assured Pension Scheme (TAPS)ను ప్రారంభించారు. పాత పెన్షన్ విధానం (OPS) తరహా భద్రతను కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద ఉద్యోగి చివరి జీతంలో 50 శాతాన్ని పెన్షన్‌గా లభించనుంది. ఉద్యోగి వాటా 10 శాతంగా ఉంటే.. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరించనుంది. ఉద్యోగులకు వర్తించే విధంగానే పెన్షన్‌పై Dearness Allowance (DA) పెరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగి మరణిస్తే 60 శాతం కుటుంబ పెన్షన్, గరిష్టంగా రూ. 25 లక్షల వరకు గ్రాట్యుటీ లభించనుంది. గతంలో CPS కింద పనిచేసి ప్రయోజనాలు కోల్పోయినవారికి ప్రత్యేకంగా కంపాషనేట్ పెన్షన్ కూడా ఇవ్వనున్నారు.
ఈ పథకాన్ని అమలు చేయడానికి తొలి దశలో సుమారు రూ. 13 వేల కోట్ల వ్యయం అవుతుందని, ఏటా ప్రభుత్వంపై రూ. 11 వేల కోట్ల ఆర్థిక భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా OPS కోసం సాగిన ఉద్యమానికి ఇది కీలక మలుపుగా వారు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి..
CM Stalin launches Tamil Nadu Assured Pension Scheme for govt staff

