ధర్మస్థల: తనను పలువురు వ్యక్తులు బెదిరిస్తున్నారన్న చిన్నయ్య
x
చిన్నయ్య

ధర్మస్థల: తనను పలువురు వ్యక్తులు బెదిరిస్తున్నారన్న చిన్నయ్య

ధర్మస్థలలో వందలాది శవాలు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు


కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలపై అబద్ధపు ఆరోపణలు చేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అబద్దపు సాక్ష్యాలపై ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ మీద ఉన్న చిన్నయ్య.. తాజాగా పోలీసులను ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2012 అక్టోబర్ 9న ధర్మస్థల పరిసరాల్లో అత్యాచారం చేసి హత్యకు గురైన 17 ఏళ్ల ప్రీ యూనివర్శిటీ బాలికకు న్యాయం కోసం వాదిస్తున్న కార్యకర్తలు మహేశ్ శెట్టి తిమరోడి, గిరిష్ మట్టెన్నర్, టి జయంత్, విట్టల గౌడ, య్యూటూబర్ సమీర్ ఎండీలపై ఫిర్యాదు చేశాడు.

ధర్మస్థల లో జరిగిన అనేక అత్యాచారం, హత్య, పూడ్చివేతలకు సంబంధించిన ఆరోపణలకు సంబంధించిన తన ప్రకటనలను ఉపసంహరించుకున్న ఫలితంగా ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులు తనకు తన భార్యకు బెదిరింపులు చేస్తున్నారని అతను తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ధర్మస్థల కేసులో మోసపూరితంగా ఫిర్యాదు ఇవ్వాలని చిన్నయ్యపై ఒత్తిడి తెచ్చారని వారు తెలిపారు. డిసెంబర్ 18న బెయిల్ తరువాత శివమొగ్గ జిల్లా జైలు నుంచి విడుదలైన చిన్నయ్య అదే రోజు సాయంత్రం తన భార్య, సోదరితో కలిసి ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.
ఏదైనా అవాంఛనీయమైన సంఘటన జరిగితే అధికారులను బాధ్యులుగా చేస్తూ, తమకు రక్షణ కల్పించి, వేధింపులను అడ్డుకోవాలని ఆయన అధికారులను అభ్యర్థించాడు. ఈ ఫిర్యాదుపై బెల్తాంగడీ పోలీసులు కేసు నమోదు చేశాడు.
ఫిర్యాదుకు సంబంధించి తదుపరి చట్టపరమైన విధానాలు అనుసరిస్తామని దక్షిణ కన్నడ డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ అరుణ్ కే తెలిపారు. నవంబర్ లో ధర్మస్థలలో జరిగిన అనేక అత్యాచారాలు, హత్యలు ఖననాలపై ఆరోపణలను దర్యాప్తు చేయడానికి ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 215 ప్రకారం బెల్తాంగడీ లోని జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు 3,900 పేజీల వివరణాత్మక నివేదిక సమర్పించింది.
ఈ నివేదికలో చిన్నయ్యతో సహ ఆరుగురు వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. ఈ ప్రత్యేక విభాగం ప్రజా న్యాయానికి వ్యతిరేకంగా జరిగే నేరాలను విచారించే ప్రక్రియను వివరిస్తుంది.
మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య మొదట్లో 1995-2014 మధ్య ధర్మస్థలలో లైంగిక వేధింపులు, డజన్ల కొద్ది మహిళలు, మైనర్ల మృతదేహాలను రహస్యంగా ఖననం చేశారని ఆరోపించారు. ఈ కేసు వెనక శక్తివంతమైన రాజకీయ, ప్రభావంతమైన వ్యక్తులు ఉన్నారని కూడా ఆయన ఆరోపించారు.
అతని ఇంటర్వ్యూలు, ప్రకటనలు చిన్నయ్యకు ప్రజల సానుభూతిని, విజిల్ బ్లోయర్ ఇమేజ్ ను ఇచ్చాయని కేసు పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో తనకు తాను భీమ్ గా చెప్పుకున్నాడు. చిన్నయ్య అని తరువాత బయటపడింది. అయితే అతని ఆరోపణలు అన్నీ తప్పుడు వాంగ్మూలాలు అని సిట్ గుర్తించింది.


Read More
Next Story