
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
‘‘హిందీ, ఇంగ్లీష్ తో పిల్లల ప్రతిభ తగ్గిపోతోంది’’
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి హిందీ, ఇంగ్లీష్ లపై విమర్శలు గుప్పించారు. కేంద్రం కన్నడ భాషను నిర్లక్ష్యం చేసి హిందీని బలవంతంగా రుద్దుతోందని అన్నారు. కన్నడ వ్యతిరేకులను వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
కర్ణాటకపై సవతి తల్లి ప్రేమ..
కర్ణాటక ప్రభుత్వంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని రాష్ట్ర రాజధాని బెంగళూర్ లో రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కేంద్రానికి రూ. 4.5 లక్షలు ఆదాయం ఇచ్చిందని, కానీ దానికి న్యాయంగా రావాల్సిన వాటాను తిరస్కరించి, అతి తక్కువ మొత్తం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
కన్నడకు అన్యాయం జరుగుతోంది
కన్నడ భాషకు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి మరోసారి ఆరోపించారు. హిందీని రుద్దడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలోని ఇతర భాషలు నిర్లక్ష్యం చేస్తున్నారని, హిందీకి, సంస్కృత భాషకు గ్రాంట్లు ఇస్తున్నారని అన్నారు. కర్ణాటక అభివృద్దికి కూడా నిధులు నిరాకరిస్తున్నారని కూడా ఆయన దుయ్యబట్టారు.
‘‘కన్నడ భాష అభివృద్దికి తగిన నిధులు నిరాకరించడం ద్వారా దానికి అన్యాయం జరుగుతోంది. కన్నడ వ్యతిరేకులందరినీ మనం వ్యతిరేకించాలి’’ అని సిద్ధరామయ్య అన్నారు. కన్నడ భాషను, దాని సంస్కృతిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విద్యలో కన్నడ భాషపై జరిగిన నిర్లక్ష్యం అనేక సమస్యలకు కారణమైందని చెప్పారు.
‘‘అభివృద్ది చెందిన దేశాల పిల్లలు తమ మాతృభాషలోనే ఆలోచిస్తారు, నేర్చుకుంటారు, కలలు కంటారు. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇంగ్లీష్, హిందీ మన పిల్లల ప్రతిభను బలహీనపరుస్తున్నాయి’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
కాబట్టి మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టడానికి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఈ దిశలో శ్రద్ద వహించాలని నేను గట్టిగా చెప్తున్నాను’’ అని ఆయన అన్నారు.
Next Story

