ధర్మస్థల వివాదంపై సీబీఐ దర్యాప్తు చేయాలి
x
మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య

ధర్మస్థల వివాదంపై సీబీఐ దర్యాప్తు చేయాలి

ఎంపీ తేజస్వీ సూర్య డిమాండ్


ధర్మస్థల పై కట్టుకథలతో హైందవ ధర్మంపై దాడి చేయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికి పోయిన అంశం పై భక్తులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి వేలాది మంది భక్తులు సోమవారం ఆలయ సమీపంలో సమావేశమై సంఘీభావం ప్రకటించారు.

బెంగళూర్ దక్షిణ విభాగం ఈ కార్యక్రమం నిర్వహించింది. ఆలయంపై జరిగిన కుట్రలకు వ్యతిరేకంగా ‘ధర్మస్థల చలో’ యాత్రను ప్రారంభించింది. పుణ్యక్షేత్రాన్ని కించపరిచే ప్రయత్నాలు చేసిన శక్తులను అణచివేయాలని వారికి కఠిన శిక్ష పడేలా చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.

జయనగర్ ఎమ్మెల్యే సీకే రామమూర్తి నేతృత్వంలోని యాత్రను బెంగళూర్ ఎంపీ తేజస్వీ సూర్య, బసవనగుడి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్య జెండా ఊపీ ప్రారంభించారు.ఈ యాత్ర ప్రారంభం కావడానికి ముందు జయనగర్ లోని శ్రీ వినాయక ఆలయంలో ప్రార్థనలు చేశారు.
దక్షిణ కన్నడ జిల్లా నుంచి దాదాపు 5 వేల మంది భక్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఈ సమావేశంలో గర్భగుడి లోపల శివ పంచాక్షరీ శ్లోకం, ప్రత్యేక నైవేద్యాలు సామూహికంగా జరిగాయి.
వ్యవస్థీకృత కుట్ర..
ధర్మ స్థల పై వచ్చిన ఆరోపణలను ‘‘ఒక వ్యవస్థీకృత కుట్ర’’ గా ఎంపీ తేజస్వీ సూర్య ఎక్స్ లో ఆరోపించారు. ఆలయ పరిపాలనను లక్ష్యంగా చేసుకున్న ఈ వివాదంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ పవిత్ర మందిరంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీజేపీ నిర్ద్వంద్వంగా ఖండిస్తుంది’’ అని ఆయన అన్నారు.
‘‘ధర్మస్థల పై మీరు కురిపించిన ప్రేమ, గౌరవం, సంఘీభావాన్ని ధర్మస్థల పీఠాధిపతి శ్రీ మంజునాథుని ముందు ఉంచి మీ అందరి కోసం ప్రార్థిస్తాను’’ అని ఆయన అన్నారు.
ధర్మస్థల వివాదం..
లైంగిక దాడికి గురైన వందలాది మహిళల మృతదేహాలను కొంతకాలంగా ధర్మస్థలంలో ఖననం చేశానని ఆరోపిస్తూ సీఎన్ చిన్నయ్య అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా వివాదం చెలరేగింది. ఈ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
అతను చెప్పిన చోట్ల తవ్వకాలు జరపగా ఎక్కడ కూడా ఏమి దొరకలేదు. తాను 1994 నుంచి 2014 వరకూ వందలాది మహిళల మృతదేహాలను స్వయంగా పూడ్చినట్లు, కొన్ని మృతదేహాలపై అత్యాచారం జరిపిన ఆనవాళ్లు ఉన్నాయని కూడా ఆరోపణలు చేశాడు. తరువాత ఇవన్నీ తప్పుడు ఆరోపణలని తెలియడంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఆలయ సంరక్షకుడు ధర్మాధికారి డీ వీరేంద్ర హెగ్గడే ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ప్రాంతాలలో ధర్మస్థల సేవా కార్యకలాపాలను భక్తుల విశ్వాసం బలోపేతం చేస్తునే ఉందని హెగ్గడే అన్నారు. ఈ జంట పరిణామాలు రాజకీయ సమీకరణ, భక్తీ సంఘీభావం ఆలయ పట్టణంలోని భక్తులు, ముఖ్యంగా ఇటీవల వారాల్లో ప్రచారం ప్రారంభమైన తరువాత ఒక అసాధారణ సంఘటనగా చూశారు.


Read More
Next Story