
కర్ణాటక హోటళ్ల ఇడ్లీలలో క్యాన్సర్ కారకాలు
ఆవిరిపట్టడంలో ప్లాస్టిక్ షీట్లు వాడటమే కారణమని నిర్ధారణ
కర్ణాటక ఆరోగ్య శాఖ నిర్వహించిన పరీక్షల ప్రకారం.. హోటళ్లు, తినుబండారాలలో దుకాణాల్లో ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ షీట్లను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ కు కారణమవుతున్నాయని తేలింది. తరువాత రాష్ట్ర ప్రభుత్వం హెటళ్లు, తినుబండారాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకుంది.
బెంగళూర్ లోని వివిధ రెస్టారెంట్ లలో తీసుకున్న ఇడ్లీ శాంపిళ్లను పరిశీలించి ల్యాబ్ కు పంపగా 51 శాతం ఆహార పదార్థాలు ముఖ్యంగా ఇడ్లీలు తినడానికి అనువుగా లేనట్లు నిర్థారణ అయింది. ముఖ్యంగా క్యాన్సర్ కు దారి తీసే ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయని అర్థమయింది. దీనికి కారణం ఆవిరిపట్టడంలో ప్లాస్టిక్ షీట్లను వాడుతున్నట్లు తేలింది.
రాష్ట్ర వ్యాప్తంగా 251 హోటళ్లు, తినుబండారాల నుంచి ఆహర భద్రతా విభాగం ఆహార నమూనాలను పరీక్షించగా 51 నమూనాలు సురక్షితం కాదని తేలింది. ‘‘ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకం పెరుగుతోంది. ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణం. ప్రజారోగ్యాన్ని కాపాడాటానికి ఇడ్లీలను వండటంలో ప్లాస్టిక్ వాడకాన్ని కచ్చితంగా నిషేధించారు. ప్రజా ఆరోగ్యంతో రాజీ పడకూడదు’’ అని ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘‘ఆహార పదార్థాల తయారీలో ప్లాస్టిక్ అనే తీవ్రమైన ప్రమాదం కలిగిస్తుంది. ఇడ్లీల తయారీలో ఉపయోగించినప్పుడూ ప్లాస్టిక్ నుంచి విషపూరిత రసాయనాలు విడుదల అవుతాయి. వినియోగదారులకు తీవ్రమైన అనారోగ్యానికి కారణం అవుతాయి. అన్ని హోటళ్లు, ఆహారసంస్థలు ఈ పద్దతిని వెంటనే ఆపివేసి, స్టెయిన్ లెస్ స్టీల్ ప్లేట్లను లేదా అరటి ఆకులు లేదా ఇతర సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అవలంభించాలని కోరుతున్నాను’’ అని మంత్రి కోరారు.
కాటన్ వస్త్రం వాడకం..
గతంలో హెటళ్ల ఇడ్లీలను ఆవిరి చేయడానికి కాటన్ వస్త్రాన్ని ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు చాలా హోటళ్లు ప్లాస్టిక్ షీట్లను వాడుతున్నాయి. దీనివల్ల క్యాన్సర్ కారక పదార్థాలు ఇడ్లీలలోకి నేరుగా కలిసి వ్యాధికి కారణమవుతాయి.
ఇటీవల భారత ఆహార భద్రతాసంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) రాష్ట్ర ఆహార శాఖతో కలిసి బెంగళూర్ అంతటా ఆహార దుకాణాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించింది. 15 రోజుల వ్యవధిలో 500 ఇడ్లీల నమూనాలను సేకరించారు. ఈ నమూనాలో 35 కంటే ఎక్కువ సురక్షితం కాదని, అలాంటి ఇడ్లీలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Next Story