
చెన్నైలోని పుతియా తలైమురై కార్యాలయానికి బాంబు బెదిరింపు..
పేలుడు పదార్థాలేవీ లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులు..
చెన్నై(Chennai) ఎక్కతంగల్‌లోని ‘‘పుతియ తలైమురై’’ (Puthiya Thalaimurai) మీడియా కార్యాలయాన్ని శనివారం (నవంబర్ 2న) పోలీసులు తనిఖీ చేశారు. బాంబులు ఉంచారని తమిళనాడు(Tamil Nadu) డీజీపీ కార్యాలయానికి మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ మెయిల్‌లో ఏం రాసి ఉందంటే..
“ఎక్కతంగల్‌లోని ‘‘పుతియ తలైమురై’’ కార్యాలయంలో నాలుగు ఆర్‌డీఎక్స్ ఐఈడీలను ఉంచారు. అవి నాలుగు గంటల్లో పేలబోతున్నాయి. అందరిని ఆఫీసు నుంచి ఖాళీ చేయించండి.” అని మెయిల్‌లో రాసి ఉంది. ఆదివారం ఉదయం 9:40 గంటల ప్రాంతంలో డీజీపీ ఆఫీసుకు ఈమెయిల్ వచ్చింది. వెంటనే చెన్నై పోలీసులు పుతియ తలైమురై కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. తర్వాత బాంబ్ డిటెక్షన్ డిస్పోసబుల్ స్క్వాడ్ (BDDS) బృందం స్నిఫర్ డాగ్‌తో వచ్చి భవనం మొత్తాన్ని మధ్యాహ్నం 1:00 గంటల వరకు తనిఖీ చేశారు. చివరకు బాంబు బెదిరింపు బూటకమని తేల్చారు. కార్యాలయంలో భద్రతను పెంచారు. అయితే మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది.
అక్టోబర్ 10వ తేదీ కూడా పుతియా తలైమురై కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్పుడు కూడా బాంబ్ డిటెక్షన్ డిస్పోసబుల్ స్క్వాడ్ వచ్చి తనిఖీ చేసి వెళ్లింది.

