Anna University | పోలీసుల అదుపులో బీజేపీ మహిళా మోర్చా నేతలు
x

Anna University | పోలీసుల అదుపులో బీజేపీ మహిళా మోర్చా నేతలు

‘‘డీఎంకే ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులుపెట్టినా బాధితురాలి పక్షాన పోరాడతాం. ఆమెకు న్యాయం జరిగేదాకా మా నిరసన కొనసాగుతుంది’’ - బీజేపీ నేత అన్నామలై.


తమిళనాడు(Tamilnadu) అన్నా యూనివర్సిటీ (Anna University) క్యాంపస్‌లో లైంగిక దాడి ఘటనపై పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ(BJP) మహిళా మోర్చా నేతలు శుక్రవారం మధురై నుంచి చెన్నై వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని గృహనిర్బంధంలో ఉంచారు. నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించిన పార్టీ నాయకురాలు ఖుష్బూ సుందర్, టీఎన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమరాతి రాజన్, బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ సీ సరస్వతి, పలువురు మహిళా సభ్యులను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. ఖుష్బు, ఉమరాతి రాజన్‌ పోలీసుల చర్యను ఖండించారు. బాధితురాలికి న్యాయం చేయాలని శాంతియుతంగా చేపట్టిన యాత్రను అడ్డుకోవడాన్ని వారు తప్పుబట్టారు.

ఎక్స్ వేదికగా స్పందిస్తున్న నేతలు..

ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి బి.ఎల్. సంతోష్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. "తమిళనాడులోని పరిస్థితి ఇది’’అంటూ కామెంట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై(Annamalai) ఎక్స్‌లో ఇలా పోస్టు చేశారు. "DMK ప్రభుత్వం మా గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తుంది. అయినా మా కార్యకర్తలు బాధితురాలి పక్షాన పోరాడతారు." బీజేపీ నాయకులు, కార్యకర్తల అరెస్టును ఆ పార్టీ జాతీయ సహ ఇన్‌చార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఖండించారు. రేప్ ఘటన డీఎంకే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని విమర్శించారు. మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కూడా అరెస్టులను ఖండించారు.

Read More
Next Story