వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు బయోఫోర్టిఫైడ్ సీడ్స్
x

వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు బయోఫోర్టిఫైడ్ సీడ్స్

వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్నిపెంచేందుకు, వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే బయోఫోర్టిఫైడ్ విత్తన రకాలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.


వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించే దిశగా..వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే బయోఫోర్టిఫైడ్ విత్తన రకాలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 61 పంటలకు సంబంధించిన విత్తనాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అభివృద్ధి చేసింది. ఈ 61 పంటల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలు ఉన్నాయి.

పంటలను ప్రోత్సహించడం..

పోషకాహార లోపం లేని భారతదేశాన్ని చేయడానికి మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీల వంటి అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ద్వారా బయో ఫోర్టిఫైడ్ రకాల పంటలను ప్రోత్సహించడంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. కొత్త వంగడాలను విడుదల చేశాక ప్రధాని రైతులు, శాస్త్రవేత్తలతో మాట్లాడారు. కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) కొత్త రకాల పంటల గురించి, వాటి ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలను అభినందించారు.

Read More
Next Story