దళిత నేత హత్య కేసు: ఏడాదైన ఎక్కడి విచారణ అక్కడే?
x
హత్యకు గురైన బీఎస్పీ నేత ఆర్మ్ స్ట్రాంగ్

దళిత నేత హత్య కేసు: ఏడాదైన ఎక్కడి విచారణ అక్కడే?

బీఎస్పీ తమిళనాడు నాయకుడు ఆర్మ్ స్ట్రాంగ్ ను ఏడాది క్రితం నరికి చంపిన రౌడీలు.. ఇప్పటి వరకూ ముందుకు సాగని కేసు


మహాలింగం పొన్నుస్వామి

బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కే. ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురై నేటితో ఏడాది పూర్తయింది. అయితే కేసును విచారిస్తున్న పోలీసులు ఇప్పటి వరకూ దర్యాప్తులో ఎలాంటి పురోగతి సాధించలేదు. ఈ అంశంపై కార్యకర్తలు, రాజకీయ నాయకులు, సీనియర్ న్యాయవాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకూ పోలీసులు 5200 పేజీలతో కూడిన సుదీర్ఘమైన చార్జీషీట్ ను దాఖలు చేశారు 28 మంది అనుమానితులను అరెస్ట్ చేసినప్పటికీ కీలక వ్యక్తులను పట్టుకోవడంలో మాత్రం విఫలం అయ్యారు.
జూలై 5, 2024న చెన్నైలోని పెరంబూర్ లోని నిర్మాణంలో ఉన్న ఇంటి సమీపంలో 52 ఏళ్ల కే. ఆర్మ్ స్ట్రాంగ్ ను దుండగులు నరికి చంపారు. ఈ హత్య తమిళనాడు అంతటా సంచలనం సృష్టించింది.
పోలీసులు ఈ కేసు విషయంలో చాలా వేగంగా స్పందించారు. జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు, ప్రధాన సూత్రధారిగా రౌడీ షీటర్ నాగేంద్రన్, అతని కుమారుడు అశ్వ థామన్ తో సహ 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరి దగ్గర నుంచి కంట్రీ బాంబులు సహ ఆయుధాల నిల్వను స్వాధీనం చేసుకున్నారు. 90 రోజుల్లోనే 30 మంది నిందితుల పేర్లతో కూడిన చార్జీషీట్ దాఖలు చేశారు.
విచారణలో అడ్డంకులు...
అయితే పోలీసుల విచారణలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కర్ణాటక, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రదేశాలలో ఏడాది పొడవునా గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటర్ పోల్ లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు.
అయినప్పటికీ ఇప్పటికే ఏ2 గా ఉన్న సాంబో సెంథిల్ ఇప్పటికి పోలీసులకు చిక్కలేదు. ఈ నిందితుడు గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కేసుల్లో పరారీలోనే ఉన్నాడు. ఇది ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సామాజిక మాధ్యమాల్లో చెన్నై పోలీసులపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
‘‘నేను ఇంకా దు:ఖంలోనే ఉన్నాను. మా కూతురు ఇప్పటికి తండ్రిని మరచిపోలేకపోతోంది. ప్రతిరోజు అతని కోసం అడుగుతూనే ఉంది. ఆమె ఇంకా కోలుకోలేదు. నేను కూడా కోలుకోలేదు. అతను ఇంకా బతికే ఉన్నాడని ఆలోచనలోనే ఉన్నాను’’ అని ఆర్మ్ స్ట్రాంగ్ భార్య చెప్పింది.
ఆర్మ్ స్ట్రాంగ్ దళితుడు అయినప్పటికీ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఎందుకు ప్రయోగించలేదని ప్రశ్నిస్తూ ఈ కేసును తమిళనాడు పోలీసులు నిర్వహిస్తున్న తీరుపై సీనియర్ న్యాయవాదీ ఇళంగోన్ ప్రశ్నించారు.
‘‘పోలీసులు ప్రతి అనుమానితుడిని నిందితులుగా పేర్కొన్నారు. ఫలితంగా 5200 పేజీల భారీ చార్జీషీట్ కేసును వేలాడదీసింది. పేరుమోసిన రౌడీ నాగేంద్రన్, అతని కుమారుడు అశ్వత్థామన్ సహ 27 మంది అనుమానితులను చర్చడం వాస్తవం కంటే సంచలనాత్మకంగా కోసమే’’ అని ఇళంగోవన్ అన్నారు. ఈ కేసులో సీసింగ్ రాజా ప్రమేయం ఉందని మొదట చేప్పినప్పటకీ చివరకు ఈ పేరును మరోసారి ఉపసంహరించుకున్నారు.
ఎన్ కౌంటర్ పై అనుమానాలు..
జూలై 14, 2024న జరిగిన ఓ ఎన్ కౌంటర్ లో అనుమానితుడు తిరువెంగడమ్ మరణించారు. దీనిపై అనుమానాలు ఉన్నాయి. ‘తిరువెంగడమ్’ ను ఎందుకు చంపారు. దానిపై ఎందుకు దర్యాప్తు చేయలేదు.
సాంబో సెంథిల్, మొట్టై కృష్ణ వంటి పరారీలో ఉన్నవారు ఇప్పటికే చెన్నైలోని రౌడీలను సంప్రదించి కార్యకలాపాలు నిర్వహించగలిగితే పోలీసులు వారిని ఎందుకు పట్టుకోలేదు? అని ఆయన ప్రశ్నించారు.
ఈ కేసును కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారని న్యాయవాదీ ఆరోపించారు. ‘‘కొందరు తమ ప్రత్యర్థులను నిర్మూలించడానికి ఈ కేసును ఉపయోగించుకుంటున్నారు. ఇది కేసు నిష్పాక్షికతలపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతోంది’’ అని ఇళంగోవన్ అన్నారు.
ముందుగా లొంగిపోయిన వారిలో కూడా అసలు నిందితులు ఎవరనేదీ అస్పష్టంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. నాగేంద్రన్ సహ కొంతమంది అనుమానితులపై గూండా చట్టం ప్రయోగించిన కేసు ముందుకు సాగలేదు. విచారణలో లేదా దర్యాప్తులో గణనీయమైన పురోగతి సాధించలేదు.
ప్రధాన రాజకీయ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే, బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్ లతో సంబంధం ఉన్న అనుమానితుల ప్రమేయం సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ల ను తీవ్రతరం చేసింది.
ఆర్మ్ స్ట్రాంగ్ సోదరుడు కీనోస్ ఈ విషయంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జూలై 21, 2025 న విచారణ జరగనుంది. రాజకీయ జోక్యం, పరారీలో ఉన్న వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని తన పిటిషన్ లో ఆరోపించారు.
భారీ బందోబస్తు..
నేడు ఆర్మ్ స్ట్రాంగ్ వర్ధంతి కావడంతో ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెరంబూర్ లోని హత్యా స్థలంలో స్మారక కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆర్మ్ స్ట్రాంగ్ అంత్యక్రియలు జరిగిన తిరువళ్లూర్ లోని పోతూర్ లో ఒక స్మారక కార్యక్రమానికి అనుమతి ఇచ్చి పోలీసులు భద్రతను పెంచారు.


Read More
Next Story