నేను స్కూల్ టాపర్ ని: సూపర్ స్టార్ రజనీకాంత్ సందేశం..
ఇంగ్లీష్ మాధ్యమంలోకి రావడంతో తీవ్ర ఇబ్బందిపడినట్లు చెప్పిన తలైవా, చివరకు డిప్రెషన్ లో వెళ్లినట్లు వివరణ
తాను ప్రాథమిక పాఠశాలలో చదువుకునే రోజుల్లో స్కూల్ టాపర్ అని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. బెంగళూర్ లోని ఆచార్య పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఇందులో రజనీకాంత్ చదువుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఆయన హజరుకాలేదు.
తన వీడియోసందేశాన్ని మిత్రలకు పంపారు. ఆయన ప్రస్తుతం థాయ్ లాండ్ లో షూటింగ్ లో ఉన్నారు. ఈ సమ్మేళనానికి రానందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘‘ మీ అందరితో కలిసి ఉంటే బాగుండేది. అదో మరుపురాని అనుభవం’’అని సూపర్ స్టార్ అన్నారు. పాఠశాల రోజలు గురించి అప్యాయంగా మాట్లాడారు.
కన్నడలో మాట్లాడిన సూపర్ స్టార్
తన సందేశాన్ని సూపర్ స్టార్ కన్నడలో వినిపించారు. ‘‘ నేను మీ అందరితో కలిసి ఉండాలనుకుంటున్నాను. అది మరిచిపోలేని అనుభూతిగా ఉండేది’’ అని రజనీ అన్నారు. కన్నడలో ఐదు నిమిషాలు మాట్లాడిన ఆయన.. పాఠశాల సమీపం లో ఉన్న గంగాధరేశ్వర ఆలయం, ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక విద్యను కన్నడలోనే అభ్యసించని విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
‘‘నేను శ్రద్ధతో చదువుకునే వాడిని, టాపర్ ని కూడా, క్లాస్ లీడర్, మానిటర్ చేసేవాడిని’’ అని ఒకింత గర్వంగా చెప్పుకున్నారు. మిడిల్ క్లాస్ లో 98 శాతం ఉత్తీర్ణత సాధించి తన మాధ్యమిక విద్యను కొనసాగించానికి ఏపీఎస్ ఉన్నత పాఠశాలను ఎంచుకున్నానని చెప్పారు.
తరువాత ఆంగ్ల మాధ్యమంలోకి..
రజనీ ప్రాథమిక విద్యాభ్యాసం కన్నడలో సాగింది కానీ మాధ్యమిక విద్యను మాత్రం ఆంగ్లంలో చదవాల్సివచ్చింది. తన సోదరుడు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడంతో ఆయన చాలా నిరాశగా గురి అయినట్లు చెప్పుకొచ్చారు. వేరే మాధ్యమంలో చదువు సాగడంతో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం వంటి వాటిని నేర్చుకునే సమయంలో ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
‘‘ఆంగ్ల విద్యతో తాను ముందు బెంచ్ నుంచి చివరి బెంచ్ కు వచ్చాను’’ అని అంగీకరించారు. భాష అవరోధం పాఠశాల విద్యను కొనసాగించడం కష్టంగా మారిందని, ఓ విధంగా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే పాఠశాలలోని ఉపాధ్యాయులు తనకు ఎంతో సాయం చేశారని, చివరకు ఇంగ్లీష్ నేర్చుకోగలిగానని కూడా సూపర్ స్టార్ చెప్పారు.
Next Story